6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / కృత్రిమ మేధస్సుతో కొత్త చిక్కులు

కృత్రిమ మేధస్సుతో కొత్త చిక్కులు

2021-11-27  News Desk

AI 3
సాంకేతికత పెరిగి కంప్యూటర్ ఇంటర్ నెట్ వచ్చాక      కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఎఐ) అనే మాట బాగా వాడుకలోకి వచ్చింది.      కృత్రిమ మేధస్సు అంటే మనిషి ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ మనకు ఇంటర్ నెట్ లోనే దొరుకుతున్నాయి. ఆలోచనతో పని లేదు. ఫలానా సమాచారం కావాలంటే వెంటనే ఇంటర్ నెట్ లో వెతికితే కనబడుతోంది. దాంతో ఆలోచించడం మానేశాం. సృజన (క్రియేటివిటీ) తగ్గి , ‘  కాపీ-పేస్ట్ ’  పద్ధతి బాగా ఎక్కువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్      ప్రపంచంలో బాగా పాపులర్ అయింది. సమాచారం తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. మేడ్ ఈజీ అయింది. కానీ దీనివల్ల సమస్యలూ రచనలు విషయాల అపహరణ (ప్లాగరిజమ్)      కూడా పెరిగిపోయాయి. ఏది అసలైన రచనో ఏది      దొంగిలించబడినదో గుర్తించడం నిఘా ఉంచడం కష్టమైంది. అన్ని రంగాల్లో  …  ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు ఇది తలనొప్పిగా మారింది. సాంకేతికంగా ఎంతో      అభివృద్ధి చెందడంతో నిన్నటివరకు ఉన్న విద్యా సమగ్రత (అకడమిక్ ఇంటెగ్రిటీ) రచయితకు తన రచన మీద ఉండే హక్కు (ఆథర్ షిప్) ల అర్థాలూ రూపాలూ మారిపోయాయి.    

కరోనా మహమ్మారి వల్ల విద్య వాణిజ్యం కార్యాలయాల పనులు.. ఇలా అన్ని రంగాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొని ఆన్ లైన్ పద్ధతి వచ్చింది. సాంకేతికాభివృద్ధి వల్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలలో విద్యార్థులు కాపీ కొట్టడంపై నిఘా ఉంచడం పెద్ద సమస్య అయింది.    

పెరిగిన కాపీయింగ్         

కోవిడ్  19  కారణంగా సాంకేతికత (టెక్నాలజీ) లో వచ్చిన మార్పులు విద్యారంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలలో కాపీయింగ్ బాగా ఎక్కువైందని వెల్లడైంది. ఆధునిక టెక్నాలజీలు రచనల్లో (రైటింగ్స్) ఆటోమేషన్ ’  కు వీలుగా మారి నానాటికీ విస్తరిస్తోంది. గత రెండేళ్లుగా రచనల ఉత్పత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా భాషా ఉత్పాదక యంత్రం (లాంగ్వేజ్ జనరేటర్) జిపిటి  రావడంతో చౌర్యం మరింత ఎక్కువైంది. ఒక భాష నుంచి మరో భాషకు ఈ యంత్రమే అనువదించి పెడుతోంది. ఈ ప్రక్రియను ఎఎల్ జనరేటెడ్ రైటింగ్ (కృత్రిమ మేధస్సు సృష్టించిన రచన) అంటారు. గూగుల్. మైక్రోసాఫ్ట్ ఎన్ విడియా వంటి కంపెనీలు అచ్చం రచయిత సొంతంగా రాసినట్టుగా భ్రమింపచేసే రచనల్ని అందిస్తున్నాయి. ఇందువల్ల విషయాలను దొంగిలించడం వంటి విద్యాపరమైన దుష్ప్రవర్తన పెరిగితే విద్యా ప్రమాణాల్ని ఎలా కాపాడుకోవాలా అని యూనివర్శిటీలు. పాఠశాలలు ఆందోళన చెందుతున్నాయి.      విద్యాపరమైన సమగ్రత కలిసి పని చేసే వాతావరణాన్ని కోరుకునే వారు  సమాజం విద్యాపరంగా శ్రమించేవారు విద్యావేత్తలు పేరెంట్స్  …  వీరంతా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని ఈ పరిణామాలపై దృష్టి సారించాలి.    

యూనివర్శిటీల్లో నిఘా    

విద్యారంగంలో సాంకేతికత వాడకం ఎక్కువ కావడంతో (ఉదాహరణకు అకడెమిక్ రైటింగ్) అంశాల      అపహరణ కూడా పెరిగింది. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనడానికి  …  టర్న్ టిన్ వంటి రచన ఆధారిత చౌర్య నిఘా పరికరాల్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. వ్యాకరణపరమైన తప్పులు చేయకుండా ఉండేందుకు స్టూడెంట్స్ క్లౌడ్ బేస్డ్ రైటింగ్ అసిస్టెంట్ ‘  ను వాడవచ్చు. రాయాలనుకున్న దానిని తయారు చేయడం సరైన అంశాన్ని వెతికి పట్టుకోవడం ప్రిడిక్షన్. మైనింగ్ ఫారాలు నింపడం ఏదైనా అంశాన్ని దశలవారీగా విభజించడం అనువాదం ట్రాన్స్ క్రిప్షన్ ( లిక్యంతీకరణ) వంటి వాటికి సాంకేతికంగా రైటింగ్ సపోర్ట్ అవసరమవుతుంది.    

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఎఐ) అభివృద్ధి కావడంతో తీసుకునే విషయాలు (కంటెంట్) సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నూతన పరికరాలు ఉత్పత్తులు. సేవలు రాసేవారికి అందుబాటులోకి వచ్చాయి. దాంతో      వ్యాసాలను (ఆర్టికల్స్) త్వరలో పూర్తిగా కృత్రిమ మేధస్సుతోనే జరుగుతుంది. ఇందువల్ల భవిష్యత్తులో …  పాఠశాలల్లో నేర్చుకోవడం రాయడం బోధన రంగాల రూపురేఖలు మారడమే కాకుండా సమస్యలు కూడా తలెత్తుతాయి.    

అయోమయం ఆాందోళన    

సాంకేతికత పెరిగి కృత్రిమ మేధస్సు మన ముందుకు రావడంతో విద్యారంగంపై పడుతున్న దుష్ప్రభావాల గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారని కెనడాలోనూ ప్రపంచంలో ఇతరత్రా ఉన్నత విద్యా సంస్థల్లో జరిగిన పరిశోధనల్లో తేలింది. ఈ పరిణామాలపై మనకు తక్కువ సమాచారమే ఉన్నా అది ఆందోళన కలిగిస్తోంది. వేరేవారి సమాచారాన్ని  53  శాతం విద్యార్థులు దొంగతనంగా సేకరిస్తున్నారని      కెనడాలో  11  ఉన్నత విద్యా సంస్థల్లో చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఎవరో రాసిన తయారుచేసిన వ్యాసాలను అంశాలను విద్యార్థులు ప్రతి పదాన్ని వదలకుండా మక్కీకి మక్కీగా కాపీ చేసి తాము సొంతంగా రాసినట్టు చూపిస్తూ అందజేస్తున్నారట.    

విద్యా సంబంధమైన సమగ్రత పరంగా  …  సమాచార చౌర్యం కాంట్రాక్ట్ చీటింగ్ (విద్యార్థులు వేరే వారిచేత తమ పేపర్లు రాయించడానికి కాంట్రాక్ట్ తీసుకోవడం) లో స్టూడెంట్స్ బాగా ముదిరిపోయారు. రకరకాల ట్రిక్స్ తో మోసాన్ని వారొక కళగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందులో విద్యార్థులే కాదు  …  అధ్యాపకులు విద్యావేత్తలు ఇతర రంగాల రచయితల పాత్ర కూడా ఉంది.      కృత్రిమ మేధస్సు వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ దానివల్ల వచ్చిన సమస్యలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.    

 


2021-11-27  News Desk