కొన్ని సార్లు ఆరోగ్యకరమైన ఆహారం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను అందించవు. జన్యు కారణాల వల్ల అధిక కొలెస్ట్రాల్ ఏర్పడుతున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో , కొలెస్ట్రాల్ మందులు సహాయపడతాయి. వీటిలో స్టాటిన్స్కే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే గుండెపోటు , స్ట్రోక్ ప్రమాదాన్ని స్టాటిన్స్ బాగా తగ్గిస్తాయి. ఎంపిక చేసుకున్న కొలెస్ట్రాల్ శోషణ ఇన్హిబిటర్లు , రెజిన్లు వంటి మందులను కూడా వాడవచ్చు. ఇవేకాక ఫైబ్రేట్స్ , నియాసిన్ , ఒమేగా- 3 లు వంటి లిపిడ్ తగ్గించే చికిత్సలను కూడా తీసుకోవచ్చు.
కొలెస్ట్రాల్ చికిత్స - సప్లిమెంట్లు
కొలెస్ట్రాల్ లెవల్స్‌ని మెరుగుపర్చడంలో పలు పోషకాహార సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడే పోషకాహార సప్లిమెంట్లు
ట్రైగ్లిజిరైడ్స్ను తగ్గించడంలో చేప నూనెలు ఉపయోగపడతాయి. సాయ్ ప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. కొన్ని రకాల పండ్లు , కూరగాయలు , నట్స్ , సీడ్స్‌లో ప్లాంట్ స్టనోల్స్ మరియు స్టెరోల్స్ సహజంగా ఉంటాయి. ఇవి పేగులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి.
కొలెస్ట్రాల్ మెరుగుపర్చడానికి తరచుగా నికోటినిక్ యాసిడ్ (నియాసిన్ లేదా విటమిన్ బి 3) ని డాక్టర్లు రాసి ఇస్తుంటారు. అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు అధికంగా తీసుకునే విటమిన్ సప్లిమెంట్ల వల్ల ఉపయోగం లేదని పరిశోధనలలో తేలింది. పైగా వీటితో దుష్ప్రభావాల కారణంగా , అధిక డోస్‌లను డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్ చికిత్స - మూలికలు
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి గార్లిక్ వెల్లుల్లి సమర్థంగా ఉపయోగపడుతుందని చెబుతుంటారు. అయితే విస్తృత పరిశోధనల్లో తేలిందేమంటే వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గింపులో పెద్దగా పనిచేయదట. పైగా అనేక మూలికలు , వంటింటి చిట్కాలు కూడా కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయని చెబుతుంటారు. వీటిలో ఎర్ర బియ్యం , మెంతులు , మెంతి ఆకులు , దుంప ఆకులు , జింజర్ , పసుపు , రోజ్ మేరీ వంటి వాటిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు.
అయితే ఈ చిట్కా వైద్య పద్ధతుల్లో చాలా వరకు కొలెస్ట్రాల్ లెవల్స్‌ని మెరుగుపర్చుతాయని నిరూపితం కాలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ మూలికా సప్లిమెంట్‌ని తీసుకోవడానికి ముందగా మీ డాక్టరును సంప్రదించండి. ఎందుకంటే మీరు ప్రస్తుతం తీసుకుంటున్న మందులపై ఇవి దుష్ప్రభావాలు చూపిస్తాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 100 మిల్లీ గ్రాములకు తక్కువగా ఉంచుకోండి. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని 60 మిల్లీ గ్రాముల వరకు ఉండేలా జాగ్రత్త పడండి. గుండెపోటు , గుండె వ్యాధి , అధిక రక్తపోటు , పొగతాగుడు , కుటుంబాని గుండెరోగం చరిత్ర ఉండటం , 45 ఏళ్లున్న పురుషులు 55 సంవత్సరాల వయస్సున్న మహిళలు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని 40 మిల్లీ గ్రాముల లోపు కలిగి ఉన్నట్లయితే , ఇలాంటివారు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 70 మిల్లీ గ్రాములకు తగ్గించుకోవలసిన అవసరం ఉంది.