వయసు పెరుగుతున్నప్పుడు తమ శిరోజాలు కూడా బలంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి నెలా మనిషి జుత్తు 0.5 అంగుళాలు (1.25 సెంటీమీటర్లు) పెరుగుతుంది. సంవత్సరానికి 6 అంగుళాలు (15 సెంటీమీటర్లు) పెరుగుతుంది. మీ వయస్సు, ఆరోగ్యం, జెనెటిక్స్, తీసుకునే ఆహారం వంటి కారణాలపై మీ జుత్తు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే వయస్సు, జెనెటిక్స్ వంటి అంశాలను మీరు మార్చలేరు. ఒక డైట్ మాత్రమే మీరు అదుపులో పెట్టుకోవచ్చు. నిజానికి సరైన పోషకాహారాల లేమికి దారితీసే డైట్‌ను తీసుకున్నట్లయితే, అది కూడా జుత్తు కోల్పోవడానికి కారణం అవుతుంది.
మరోవైపున సరైన పోషకాహారాలను తీసుకుంటూ సమతుల్యతతో కూడిన డైట్‌ను తీసుకుంటే అది మీ జుత్తు పెరుగుదలకు సాయపడుతుంది.
మీ జుత్తు పెరుగుదలకు వీలుకల్పించే కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలను ఇక్కడ చూద్దాం.
1. గుడ్లు
శరీరానికి అవసరమైన ప్రొటీన్, బయోటీన్లకు గుడ్లు గొప్ప వనరుగా ఉంటాయి. ఈ రెండు పోషకపదార్థాలు జుత్తు పెరుగుదలకు వీలుకలిగిస్తాయి. జుత్తు పెరుగుదలకు తగినంత పరిమాణంలో ప్రొటీన్ తీసుకోవాలి. ఎందుకంటే హెయిర్ ఫోలిసిల్స్ చాలావరకు ప్రొటీన్‌తోనే ఏర్పడతాయి. అందుకే తినే ఆహారంలో ప్రొటీన్ లోపిస్తే అది హెయిర్ లాస్ కి దారితీస్తుంది. ఇక బయోటిన్ అనేది కెరటిన్ అనే పేరుతో పిలచే హెయిర్ ప్రొటీన్ ఉత్పత్తికి చాలా అవసరం. అందుకనే బయోటిన్ సప్లిమెంట్స్‌ని జుత్తు పెరుగుదలకు అవసరమంటూ ప్రాచుర్యం కల్పిస్తుంటారు. ఎంత ఎక్కువగా బయోటిన్ తీసుకుంటే బయోటిన్ లోపం కల వారి జుత్తు పెరుగుదలను అది మెరుగుపరుస్తుంది.
2. బెర్రీస్
జుత్తు పెరుగుదలకు వీలు కల్పించే ఉపయోగకరమైన కాంపౌండ్స్, మరియు విటమిన్లకు బెర్రీస్ మారుపేరుగా ఉంటున్నాయి. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది బలమైన యాంటాక్సిడెంట్ గుణాలతో ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ అని పిలిచే ప్రమాదకరమైన మాలిక్యూల్స్ వల్ల జుత్తుకు కలిగే నష్టం నుంచి యాంటాక్సిడెంట్లు తోడ్పడతాయి. ఈ మాలిక్యుల్స్ సహజంగానే శరీరంలోనూ, వాతావరణంలోనూ ఉంటాయి. ఉదాహరణకు ఒక కప్ (144గ్రాములు) స్ట్రాబెర్రీస్ మీకు రోజూ అవసరమైన విటమిన్ సీ ని 141శాతం వరకు అందిస్తుంది. అలాగే కొల్లాజెన్ ప్రొటీన్‌ని తయారు చేసే విటమిన్ సి ని శరీరం ఉపయోగిస్తుంది. ఇది జుత్తు విరిగిపోకుండా నిరోధిస్తుంది.
3. బచ్చలికూర
బచ్చలికూర ఒక ఆరోగ్యకరమైన ఆకుపచ్చ ఆకుకూర. ఇది పొలేట్, ఐరన్, విటమిన్స్ ఎ మరియు సి వంటి పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ జుత్తు పెరుగుదలకు తోడ్పడతాయి. విటమిన్ ఏ అనేది సెబమ్ తలవెంట్రుకలకు జిడ్డునిచ్చే కొవ్వు ద్రవ్యాన్ని తయారు చేయడంలో చర్మ గ్రంథులకు తోడ్పడుతుంది. ఇక ఐరన్ శరీరమంటా ఆక్సిజన్ తీసుకుపోవడంలో ఎర్ర రక్తకణాలకు సాయపడుతుంది. ఇది జుత్తు పెరుగుదలకు చాలా అవసరం. మరీ ముఖ్యంగా, ఐరన్ లోపిస్తే అది నేరుగా జుత్తు రాలిపోవడానికి దారితీస్తుందని గ్రహించాలి.
4. కొవ్వు చేప
సాల్మన్, హెర్రింగ్, మకీరల్ వంటి కొవ్వు చేపలు జుత్తు పెరుగుదలకు వీలుకల్పించే పోషకాలను కలిగి ఉంటాయి. అవి ఒమేగా-3కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన ఆధారాలుగా పనిచేస్తాయి. ఇటీవలే ఒమేగా-3, ఒమేగా-6ఫ్యాటీ యాసిడ్లను, యాంటాక్సిడెంట్లను సప్లిమెంట్లుగా తీసుకున్న 120మంది మహిళపై జరిపిన అధ్యయనం ఫలితాలను చూస్తే, వీరిలో జుత్తు రాలడం గణనీయంగా తగ్గిపోయిందని తేలింది. వీరికి జుత్తు బాగా పెరిగిందని కూడా తేలింది. అలాగే చేప నూనెను సప్లిమెంటుగా తీసుకుంటే అది జుత్తు రాలిపోవడాన్ని బాగా తగ్గించింది జుత్తు పెరగడాన్ని పెంచిందని మరొక అధ్యయనం తెలిపింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్యాటీ ఫిష్‌ను ఆరగిస్తే అది ప్రొటీన్, సెలెనియం, విటమిన్ డి3, బి విటమిన్స్, న్యూట్రియంట్స్కి గొప్ప వనరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, బలమైన జుత్తును అందిస్తుంది.
5. చిలగడదుంపలు
చిలగడ దుంపలు బెటా కరోటెన్ అనే కాంపౌండ్‌కి గొప్ప ఆధారంగా ఉంటాయి. ఈ కాంపౌండ్‌ని శరీరం విటమిన్ ఏ గా మారుస్తుంది. ఇది మన జుత్తును ఆరోగ్యకరంగా ఉంచుతుంది కూడా. మీడియం స్థాయి స్వీట్ పొటాటో (114గ్రాములు) మీరు రోజూ అవసరమైన విటమిన్ ఏ కి నాలుగురెట్లు అదనంగా అందించే బెటా కరొటెన్ కాంపౌండును కలిగిఉంటుంది. పైగా తలవెంట్రుకలకు జిడ్డునిచ్చే కొవ్వు ద్రవ్యం తయారీకి విటమిన్ ఏ వీలుకల్పిస్తుంది. ఇది తలవెంట్రుకలను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. పైగా విటమిన్ ఏ జుత్తు పెరుగుదలతోపాటు జుట్టు మందంగా పెరగడానికి కూడా తోడ్పడుతుంది.