collapse
...
Home / ఆరోగ్యం / డైట్ & న్యూట్రిషన్ / కలుషిత ఆహారం నుంచి రక్షణ ఎలా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Te...

కలుషిత ఆహారం నుంచి రక్షణ ఎలా?

2021-12-02  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

 

FOOD-1
 

సాధారణ జీవక్రియలో భాగంగామానవ శరీరం మనిషి జీవిత కాలంలో అనేక జెనోబయోటిక్ లేదా విషపూరితాల ప్రభావాలకు గురవుతుంది. ఇది తీసుకున్న ఆహారంఆహారంలో కలిపిన పదార్థాలుఆల్కహాల్పర్యావరణపరమైన విషపదార్థాలుసూక్ష్మజీవులుఅనేక మాత్రలతోపాటుసాధారణ శరీర జీవక్రియను నిలిపివేసే ఉత్పత్తులు వంటివి దీనికి కారణాలు. ఇవి శరీరంలో నిల్వ అయితే తప్పకుండా విషపూరిత ప్రభావాలను కలిగిస్తాయి. 

జెనోబయోటిక్స్ 

విషాలు లేదా విషపూరిత పదార్థాలను జెనోబయోటిక్స్ అని పిలుస్తారు. జెనో బయోటిక్‌ని శరీరం  లోపల ఉండే రసాయనిక ఉప పదార్థాలుగా నిర్వచిస్తారు. ఇలాంటి పర్యావరణ విషాలకు శరీరం ప్రభావితం కావడం సాధారణంగా జరుగుతుందని నేడు ఆమోదిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మన ఆహారంలో పోషక విలువలను మనం ఇప్పుడు పూర్తిగా మార్చివేయడమే కాకుండావాటి స్థానంలో కృత్రిమ రంగులనుసంరక్షణ కారులనుసంకలిత పదార్ధాలుఫ్లేవర్లు వంటివాటిని తినే ఆహారంలో చేరుస్తున్నాము.  దీనిఫలితంగా ఇవన్నీ పోషకవిలువలను హరించిశరీరంలో విషపూరితాలు పోగయ్యే ప్రక్రియకు దారితీస్తాయి. కొన్నిసార్లు మన శరీరం ఆధునికపర్యావరణ విషపదార్థాలను తట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు కలుగుతున్న అస్వస్థతలో 80 శాతం వరకు పర్యావరణం మరియు జీవన శైలి కారణమని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంచనా వేసింది. 

జెనోబయోటిక్ మెటబాలిజం 

మానవులు సాధారణంగా గాలినీరుమట్టి ద్వారా జెనో బయోటిక్స్ ప్రభావానికి గురవుతాయి. ఇవి చర్మంఊపిరితిత్తులుజీర్ణాశయానంతర మార్గం ద్వారా రక్తంలో కలుస్తాయి. ఈ విషపదార్థాలను తొలగించడానికి మానవ శరీరం అత్యున్నత కాంప్లెక్స్ ఎంజైమేటిక్ (పేనకద్రవ్యం) యంత్రాంగాలను అభివృద్ధి చేసుకుంటుంది. విష  పదార్థాలను తక్కువ విషపూరితమైన నీటి కాంపౌండ్‌లుగా మార్చడానికి నిర్విషీకరణ అనేది వరుసగా బయోకెమికల్ రియాక్షన్లకు పాల్పడుతుంది. దీన్నే బయో ట్రాన్స్  పర్మేషన్   జెనోబయోటిక్ మెటబాలిజం అంటారు. 

నిర్విషీకరణ అవసరం ఏమిటి 

ప్రజలు నిర్విషీకరణ చేసుకోవాలి. కానీ మితిమీరిన విషపదార్థాలుపోషకాలు లేని శరీరంరాజీపడిన   జీర్ణ వ్యవస్థ వంటివి నిర్విషీకరణను సమర్థవంతంగా నిర్వహించనీయవు. అదనపు విషాలను నిత్యం ప్రభావితం చేసే సమర్థ విసర్జన లేమి కారణంగా అవి కొవ్వు సంబంధమైన టిష్యూలుమెదడులోని ఫ్యాటీ టిష్యూలునెర్వస్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ గ్రాండ్స్‌లలో పేరుకుపోతాయి. 

నిర్వీషీకరణ వ్యవస్థ రాజీపడటం జరిగితే అది ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఇవి లిపిడ్స్ప్రొటీన్లుడీఎన్ఏను మరింత తీవ్రంగా మార్చివేస్తాయి. మందగించిన నిర్విషీకరణ మరియు కేన్సర్ఫైబ్రోమైయాల్జియాదీర్ఘకాలిక ఆయాసం వంటి వ్యాధులకుఇమ్యూన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ మరియు అల్జీమర్స్పార్కిన్సన్ వ్యాధులు వంటి న్యూరోలాజికల్ వ్యాధులకు మధ్య సంబంధం ఉంటుందని శాస్త్రీయ సాహిత్యం సూచిస్తోంది. 

కాలేయం నిర్విషీకరణ 

నిర్విషీకరణ ప్రక్రియలో భాగంగా ఉండే ప్రధాన అంగాలు ఏవంటే.. కాలేయంమూత్రపిండాలుజీర్ణక్రియానంతర మార్గం. కాలేయం అతి ప్రధానమైన నిర్విషీకరణ అవయవం. ఇది రెండు దశల్లో పనిచేస్తుంది. కాలేయంలోని వివిధ ఎంజైముల పాత్ర ఏమిటంటేకొవ్వు రూపంలోని విషాలను నీటిలో కరిగే పదార్థంగా మార్చి దాన్ని మూత్ర రూపంలో విసర్జించేలా చేయడమే. కాలేయం జెనో బయోటిక్‌ని డీయాక్టివేట్ చేసిదాని జీవపరమైన కార్యాచరణను బలహీనపరుస్తుంది మరియు శరీరం నుంచి దాన్ని తొలగించడాన్ని వేగవంతం చేస్తుంది. 2021-12-02  Health Desk