కరోనా మహమ్మారి వల్ల అప్పటికప్పుడు ఆన్ లైన్ కు మారాల్సి వచ్చింది. క్రమంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి కనుక, పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడు తిరిగి వాస్తవిక (ఆన్ లైన్) క్లాసుల్ని ప్రారంభిస్తున్నాయి. అయితే, స్టూడెంట్స్ మేలుకోరి చాలా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ బోధనా విధానాన్నే ఎంచుకున్నాయి.నిజానికి, చాలా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్. మాస్టర్ డిగ్రీ తరగతుల్ని పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలోనే ప్రారంభిస్తున్నాయి.
CDOE కోర్సులు
తన అనుబంధ శాఖ సెంటర్ ఫర్ డిస్టన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (సిడిఓఇ) ద్వారా జామియా మిల్లియా ఇస్లామియా (జెఎంఐ) కొన్ని కోర్సుల్ని అందిస్తోంది. అవి: బిబిఏ, బి.కాం, ఇంగ్లీష్ లో ఎంఎ , హిందీ. హిస్టరీ. ఉర్దూ, సోషియాలజీ, ఎం కాం. బి కాం (అకౌంటెన్సీ), ఎంఎ (సోషియాలజీ) కోర్సులతో సహా రెండు పూర్తిస్థాయి ఆన్ లైన్ ప్రోగ్రామ్ లను ప్రారంభించేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం సన్నాహాలు చేసింది. ఆంధ్రా యూనివర్శిటీ పూర్తి ప్రత్యక్ష ప్రోగ్రాంలను విడుదల చేయడం బహుశ ఇదే మొదటిసారి కావచ్చు. ఇకపోతే, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఎ సంస్కృతం కోర్సును ఆన్ లైన్ లోనే అందించబోతోంది. ఆన్ లైన్ ప్రోగ్రాంల కోసం ఈ యూనివర్శిటీ ఆన్ లైన్ ఇ- లెర్నింగ్ ఇనిషియేటివ్ (ఓఇఎల్ ఐ)ప్లాట్ ఫాం ను డెవలప్ చేస్తోంది. ఆన్ లైన్ ప్రోగ్రాంలు చేయాలనుకునే, చేసే అర్హత ఉన్న అన్ని విద్యాసంస్థల నుంచి యుజిసి డిస్టన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అదివరకు దరఖాస్తులను ఆహ్వానించింది యుజిసి అర్హతా ప్రమాణం ప్రకారం ఎన్ ఎఎసి 3.26 స్కోర్ సాధించిన వారిని, మూడు ప్రొసెడింగ్ సైకిల్స్ లో కనీసం రెండుసార్లు నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో (ఎన్ఐఆర్ఎఫ్) టాప్ 100 లో ర్యాంక్ ఉన్నవారిని తీసుకుంటారు.
ఆన్ లైన్ ఎందుకంటే…
కొవిడ్ మహమ్మారి వల్లనే జెఎంఐ లో ఆన్ లైన్ విధానం వచ్చింది. డెలివరీ కోసం మేము జూమ్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాంలను వినియోగించడం ప్రారంభించాము. ఆన్ లైన్ విధానంలో అవే ప్లాట్ ఫాంలను కొనసాగిస్తాము. మాకు స్వంత నియంత్రణా యంత్రాంగాలు ఉన్నాయి’ అని జెఎంఐలో సెంటర్ ఫర్ డిస్టన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జెస్సీ అబ్రహం చెప్పారు.’ఆన్ లైన్ లో నేర్చుకోవడం స్టూడెంట్స్ కు ప్రయోజనకరం. ఎలాగంటే వాళ్లు ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. అదే టైమ్ లో కోర్స్ కొనసాగించవచ్చు.’ అని అబ్రహం చెప్పారు.గత ఏడాది కొవిడ్ వచ్చింది కాబట్టి అకడెమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్, యూజీసీ నుంచి అవసరమైన పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాం. డెలివరీ. అసైన్ మెంట్స్, కోర్సులకు ఫీడ్ బ్యాక్ ల కోసం మేము ఆన్ లైన్ ప్లాట్ ఫాంలను వాడుకుంటున్నాం. అందువల్లే ఆన్ లైన్ కు వెళ్లవలసి వచ్చింది. డైరెక్ట్ తరగతులైనా, ఆన్ లైన్ అయినా ఒకటే‘ అని జామియాలో ఆన్ లైన్ బోధనపై వివరించారు.
స్టూడెంట్స్ కు ఉపయోగం
స్వీయ ప్రేరణ కల (సెల్ఫ్ మోటివేటెడ్) విద్యార్థులు తమ పట్టణం లేదా ఊరిలోనే ఉంటూ డిగ్రీ తీసుకునే అవకాశాలను ఆన్ లైన్ డిగ్రీ కోర్సులు కల్పిస్తున్నాయి.‘ప్రతికూల పరిస్థితి వల్ల విద్యార్థులు చదువును వాయిదా వేయాలనుకుంటారు. దాంతో కోర్సు ప్రోగ్రాం పూర్తి కాదు. చదువును శ్రద్ధగా కొనసాగించకపోతే అది అభ్యాస ఫలితం మీద (learning outcome) ప్రభావం చూపిస్తుంది’ అని బెంగళూరు సిఎంఆర్ యూనివర్శిటీ లోని అకడమిక్స్ డీన్ సుజా బెన్నెట్ చెప్పారు.
గత రెండేళ్ల కాలంలో లక్షలాది మంది ఆన్ లైన్ క్లాసుల్లో చేరారు. కానీ పూర్తి చేసేందుకు కష్టపడ్డారు.‘ఆన్ లైన్ బోధన - నేర్చుకునే ప్రక్రియలో ప్రత్యక్షంగా మానవ సంబంధం ఉండదు. పరస్పరం చర్చించుకుని తెలుసుకునే వీలుండదు. ఎంతో ఆశతో చేరారు. కానీ చాలామంది కోర్సును పూర్తి చేయలేకపోయారు. క్రమశిక్షణ, తోటివారి సహకారం లేకపోవడమే అందుకు కారణం’ అని దుబాయ్ ఎస్ పి జైన్ క్యాంపస్ ప్రొఫెసర్ క్రిస్ అబ్రహం అన్నారు. ఆన్ లైన్ కోర్సుల్లో ముఖాముఖి సంబంధంపై మాట్లాడుతూ ఆయన ఈ వివరణ ఇచ్చారు.’ముఖాముఖి సంప్రదించడం చాలా ముఖ్యం. ఆన్ లైన్ పద్ధతిలో అధ్యాపకునికి, విద్యార్థికి మధ్య సరైన ప్రత్యక్ష సంబంధం కల్పించేలా టెక్నాలజీ హామీ ఇవ్వాలి’ అన్నారు క్రిస్. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న సంవత్సరాలలో ఆన్ లైన్ ఎగ్జిక్యూటివ్ ఎంబిఏ ప్రోగ్రామ్ లు వేగంగా జరిగాయి.‘ఆ సమయంలో ఆస్ట్రేలియా, ఇండియా. యూరప్ నుంచి విద్యార్థులు వచ్చారు. ఒక బహుళజాతి కూడలిలా కనిపించింది’ అని వివరించారు క్రిస్.
ఆన్ లైన్ కోర్స్ లలో చేకూరే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే … ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రాజెక్ట్ లనైనా స్టూడెంట్స్ తీసుకోవచ్చు. ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదు. సమతుల్యతకు భరోసా ఉంటే ఆన్ లైన్ బోధన ద్వారా విద్యాసంస్థలు దేశంలో విద్యారంగం స్వరూపాన్నే మార్చేయగలవు.