ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఇంజినీరింగ్ అనేది ఇంజినీరింగ్ ఆశావహులు మంచి కెరీర్‌ని కొనసాగించేందుకు ఎంచుకున్న ప్రముఖ డొమైన్. ఈ రంగంలో మాస్టర్‌గా మారడానికి ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల మక్కువ కలిగి ఉండాలి. ఒక IT ఇంజనీర్ కోసం, ఎన్నో కంపెనీలు, ప్రభుత్వంలోనూ, దాని అనుబంధ రంగ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో, IT నిపుణులు అవసరమయ్యే వివిధ విభాగాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో చేరడం అనేది మంచినిర్ణయం. ఎందుకంటే ఉద్యోగ భద్రత, స్థిరమైన జీతాల పెంపు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇ-కామర్స్ పరిశ్రమ, టెలి కమ్యూనికేషన్స్, విద్యా రంగం, బయో టెక్నాలజీ పరిశ్రమ వంటి వాటిలో మంచి అవకాశఆు ఉన్నాయి.,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగావకాశాలు
IT ఇంజనీర్లు కోర్సు పూర్తయిన తర్వాత క్రింది ఉద్యోగాల కోసం చూస్తుంటారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను సంస్థల్లోని జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో నియమించుకుంటారు. అనుభవం, ప్రమోషన్లతో, వారు సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్, కంప్యూటర్ సపోర్ట్ స్పెషలిస్ట్,డేటా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ టెక్నీషియన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ సపోర్ట్ స్పెషలిస్ట్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిక్రూటర్, ప్రాసెస్ మేనేజర్ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు.
టాప్ రిక్రూటింగ్ సంస్థలు :
TCS, మైండ్‌ట్రీ, ఎంఫాసిస్, NIIT టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, IGAT, CMC లిమిటెడ్, విప్రో లిమిటెడ్, టెక్ మహీంద్రా, HCL టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు ఎంపిక చేసుకుంటాయి. ఇక జీతాలలోకూడా స్థాయిని బట్టి ఉంటాయి.ప్రాధమిక స్థాయిలో(ఎంట్రీ లెవెల్).. రూ.2- 6 లక్షలు, మిడిల్ కెరీర్ లో రూ.4-14లక్షలు, అనుభవం పెరిగితే రూ.5- 25లక్షల వరకూ ఉంటంది.