collapse
...
Home / లైఫ్ స్టైల్ / పర్యాటకం / ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా?

2021-12-05  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

expensive cities
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన  పది నగరాలు ఉన్నాయి. దీంట్లో ప్యారిస్సింగపూర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా..డమాస్కస్ నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా ప్రకటించారు.

మొదటి స్థానంలో టెల్ అవీవ్ నగరం

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితో ఇజ్రాయేల్లోని టెల్ అవీవ్ నగరం ఈ జాబితాలో మొదటిస్థానం దక్కించుకుంది. ఈ వార్త మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెరుగుతున్న ద్రవ్యోల్బణం  ప్రపంచ జీవన వ్యయాన్ని పెంచేసింది.  పారిస్సింగపూర్  ఈ రెండు దేశాలు కూడా సంయుక్తంగా రెండో  స్థానాన్ని దక్కించుకున్నాయి.

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంకలనం చేసిన అధికారిక ర్యాంకింగ్స్ లో...ఇజ్రాయిల్ నగరం మొదటిసారి ఐదు స్థానాలు పైకి ఎగబాకింది. ప్రపంచ జీవన వ్యయ సూచిక 173 నగరాల్లోని వస్తువులుసేవల ధరలను యూఎస్ డాలర్లతో పోల్చి సంకలనం చేశారు. ఇక టెల్ అవీవ్ జాతీయ కరెన్సీతో పాటు రవాణాకిరణా ధరల పెరుగుదల కారణంగా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పారిస్ తోపాటుగా సింగపూర్ సంయుక్తంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత జ్యూరిచ్హాంకాంగ్ వచ్చాయి. న్యూయార్క్ సిటీ ఆరవ స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరం ఏడవస్థానానికి చేరుకుంది.

9వ స్థానంలో లాస్ ఏంజెల్స్

టాప్ 10లో కోపెన్  హాగన్ నగరం 8వ స్థానంలోలాస్ ఏంజెల్స్ 9వ స్థానంలో ఉండగా...జపాన్ లోని ఒసాకా 10వస్థానంలో నిలిచింది. పోయిన ఏడాది ఈ సర్వేలో పారిస్జ్యూరిచ్హాంకాంగ్ సంయుక్తం తొలిస్థానంలో నిలిచాయి. ఇక ఈ సంవత్సరం డేటాను ఆధారం చేసుకుని ఆగస్టుసెప్టెంబర్ లో సేకరించారు. స్థానిక కరెన్సీ పరంగా సగటు ధరలు 3.5శాతం పెరిగినట్లుగా కమెడిటీ ధరలు చూపిస్తున్నాయి.



2021-12-05  Lifestyle Desk