collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫుడ్ & బేవరేజ్ / పులియబెట్టిన ఫుడ్.. వెరీ గుడ్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Te...

పులియబెట్టిన ఫుడ్.. వెరీ గుడ్

2021-12-05  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ferment foods
 

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో చాలా రకాల పదార్థాలు ఉండేట్లు చూసుకోవాలి. అన్ని రకాలు తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ కూడా అందుతాయి. డైట్ లో ఎక్కువగా కూరగాయలుపండ్లు తీసుకోవాలన్న విషయం మనకు తెలిసిందే. అయితే పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.

పులియబెట్టిన ఆహారపదార్థాలు అంటే...?

పులియబెట్టిన ఆహారాపదార్థాలు ఏవంటే...యోగర్ట్పచ్చళ్లుకాటేజ్చీజ్ ఇవన్నీ కూడా పులియబెట్టిన ఆహారపదార్థాలు. అయితే వీటన్నింటిని తీసుకోవడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆహార పదార్దాలను తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని స్టాన్ఫర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. వీటిని తీసుకోవడం వల్ల ఇంఫ్లేమేషన్ కూడా చాలా తగ్గుతుంది.

పులియబెట్టిన ఆహార పదార్థాలు ఎందుకు అవసరం...?

పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ప్రకారం ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యంగా ఉన్న 36 మందిపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహించారు. దాదాపు పది వారాల పాటు ఆహార పదార్థాలను ఇచ్చారు. వీటిలో పులియబెట్టిన ఆహారపదార్ధాలతోపాటుగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను వాళ్లకు ఇచ్చారు. అయితే ఈ రెండు ఫలితాలు కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి. రోగ నిరోధకశక్తిగట్ మైక్రోబియల్ లో చాలా వరకు తేడా ఉన్నట్లు గుర్తించారు.

ఎలాంటి పదార్థాలను తీసుకోవచ్చు....?

ఎలాంటి ఆహారపదార్ధాలు అనేది చూసినట్లయితే...యోగర్ట్ఫెర్మెంటేడ్ కాటేజ్చీజ్ తోపాటుగా పులియబెట్టిన ఇతర కూరగాయలు, పచ్చళ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని ఈ రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. మైక్రో బయాలజీ ప్రొఫెసర్ చెప్పిన ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే...ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాదు మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు గమనించవచ్చని చెబుతున్నారు.

ఇక సాధారణంగా మానవ శరీరంలో 19 రకాల ఇమ్యూనిటీ ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి. వీటిని బ్లడ్ శాంపిల్స్ ద్వారా కనుకొవచ్చు. అయితే ఇలా ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అవి తగ్గాయని కూడా తేలింది. అదేవిధంగా పులియబెట్టిన ఆహార పదార్థాలును తీసుకున్నట్లయితే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే గింజలు ఉన్న కూరగాయలు పండ్లు తీసుకున్నవారిలో ఈ 19 ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ తగ్గలేదు. కేవలం ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇది తగ్గడం లేదు. ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చని తెలుస్తోంది. అంతేకాదు ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. డయాబెటిస్క్యాన్సర్కార్డియో వాస్య్కులర్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు ఇలాంటి ఆహార పదార్ధాలను తీసుకున్నట్లయితే ఇతర బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

జీవక్రియ మెరుగుపడుతుంది....

మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం కావాలంటే పులియబెట్టిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. బరువు తగ్గించుకోవడానికి కూడా ఎంతో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల అవసరం కూడా తీరుస్తుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది...

ఫ్లూవైరల్ వంటి వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే సాధారణంగా మనకు ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి బ్యాక్టీరియా చాలా అవసరం. ఇలా ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇతర ప్రయోజనాలు...

గ్యాస్ఎసిడిటిమలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. అయితే పులియబెట్టిన ఆహారంలో ఉండే లాక్టిక్ యాసిడ్ పేగులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. పేగుల్లో ఉండే చెడు బ్యాక్టిరియాను తొలగించడంలో సహాయపడుతుంది. కానీ చాలా మందికి పులియబెట్టిన ఆహారం ప్రాముఖ్యత గురించి తెలియదు. రెగ్యులర్ గా మీ డైట్ లో ఈ ఆహారాన్ని తీసుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.



2021-12-05  Lifestyle Desk