భారత దేశానికి దక్షిణ దిక్కున సముద్రంలో ఏర్పడిన శ్రీలంక దీవి ఎన్నో విధాలుగా భారతీయ సంత్కృతిలో అంతర్భాగంగా శతాబ్దాల చరిత్ర సంపాదించుకున్న దేశం. చరిత్ర అనడం కన్నా మన జీవనంలోనే మేకమైన దేశం అనడం ఉత్తమం. భారతీయులకు ఆరాధ్య దైవమైన శ్రీ రాముని కథలో శ్రీలంక అత్యంత కీలకమైన ఘట్టాలకు కేంద్రం. చెడుపై మంచి సాధించిన విజయం చివరి ఘట్టం కాగా, లోకపావని అయిన సీతమ్మ తల్లి కంట కన్నీరు ఒలికించిన కారణం తరతరాలుగా ప్రజల కంట కన్నీరు కారడానికి కారణంగా నిలిచింది. ఇక ఆ తరువాత మన దేశం వలస పాల అగచాట్లు పడిన సమయంలోనూ, విముక్తి పొంది స్వేచ్ఛ పొందిన తరుణంలోనూ కూడా మన వారికి అండదండగా నిత్యం నిలిచింది. అలాంటి మన పొరుగు దేశం, మిత్ర దేశంలో దేశ విదేశాల నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
శ్రీలంకలో అనేకానేక స్థలాలు సందర్శనీయమైనవి కాగా వాటిలో కొన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. కొన్ని ఆహ్లాదం కలిగించేవి కాగా, మరి కొన్ని అందమైన కొండ ప్రాంతాలు, మరెన్నో అందమైన టీ తోటలు, బంగారు రంగులో మెరిసేపోయే సముద్ర తీర ప్రాంతాలలోని బీచ్ సౌందర్యాలు. ఇక మన పౌరాణిక గ్రంథాలలో ప్రముఖ స్థలాలైన వాటి సంగతి సరేసరి. ఆహా, ఓహో అనిపించే ప్రకృతి రూపాలు ఎన్నో ఎన్నెన్నో. ఒకదానికన్నా మరొకటి గొప్పగా కనిపిస్తుంది. కను విందు చేస్తుంది. ప్రకృతి సిద్ధమైన, చారిత్రిక విశేషాలున్న సౌందర్యం అంతా ఒకే చోట కనిపిస్తుంది. ముందుగా ఆయా స్థలాల పేర్లు తెలుసుకుందాం.
- ఎల్లా – పల్లె అందాలతో పరవళ్లు తొక్కుతుంది.
- నువారా ఎలియా – పచ్చని ప్రకృతి ప్రదర్శించే అందాలకు కేంద్రం
- పిన్నవాలా ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ – అందనంత ఎత్తులో గంభీరంగా అడుగులు వేస్తూ ఉండే ఏనుగుల మందలు ఇక్కడి ప్రత్యేకత.
- పోలోన్నరువా – చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన శిథిలాలు చెప్పే కథలు చూసి తెలుసుకోవలసినవే కాని మాటల్లో చెప్పలేం.
- ఆడమ్స్ పీక్ – యునెస్కో వారసత్వ సంపదగా పేరుగాంచిన గిరి శిఖరం
- మిరిస్సా – సముద్ర తీరంలో పెద్ద పెద్ద వేల్స్ (తిమింగలాలు) చూడగానే మన కళ్లు ఆశ్చర్యంతో ఇంత పెద్దవిగా మారిపోతాయి.
- యాల నేషనల్ పార్కు – వన్య ప్రాణుల నిలయం.
- కొలంబో – దేశ రాజధాని. అంతేకాదు పర్యాటకులకు స్వర్గధామం లాంటిది.
- జాఫ్నా – చారిత్రిక కట్టడాల కోటగుమ్మం
- ఉల్పోతా – ఆయుర్వేద వైద్య కేంద్రం
- ట్రింకోమలై – ఆధ్యాత్మిక ఆలయ సముదాయం
- కందాలమ – అపూర్వమైన ఊహాతీత గ్రామ పరిసరాలు
- తిస్సామహారామ – దృశ్య సౌందర్యానికి ఆలవాలం
- అనురాధాపురా – ఆకట్టుకునే బోధి వృక్షం
- హార్టన్ ప్లెయిన్స్ నేషనల్ పార్కు – సరస్సులు, పచ్చిట హరిత వనాల ప్రదేశం
- సింహరాజ ఫారెస్టు రిసర్వ్ – అసక్తి రేకెత్తించే అటవీ ప్రాంతం
- ఉడవలవ నేషనల్ పార్కు - వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం
- తవలాంటెన్నె – రోడ్డు మార్గంలో అద్భుత అందాలు ప్రదర్శించే ప్రాంతం
- ఆరుగం బే – ఆహ్లాదకరమైన సముద్ర తీరంలోని బీచ్ అందాలు
- కామన్ వెల్త్ వార్ సెమెట్రీ – వీర సైనికుల స్మారక కేంద్రం
- ఉనవతునే బీచ్ – ఇసుక తిన్నెల మధ్య చక్కని తీర సౌందర్యం
- సిగిరియా మ్యూజియమ్ – చారిత్రిక స్మృతుల ప్రదర్శన
- పెరండెనియా బొటానికల్ గ్రార్డెన్స్ – ప్రకృతి అందాలు చిందించే తోటలు
- డోండా లైట్ హౌస్ – చూసితీరవలసిన ప్రాంతం
- డంబుల్లా కేవ్ టెంపుల్ – కుడ్య చిత్రాలతో అద్భుత గుహలలోని అందాలు
- గాలె లోని ఓల్డ్ డచ్ ఫోర్టు – డచ్చ్ వారు నిర్మించిన దుర్భేద్యమైన కోట
- సిగిరియా రాక్ ఫోర్ట్రెస్ – చారిత్రిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం
- బైరా లేక్ – ఊహాతీతమైన సుందర సరస్సు
- టెంపుల్ ఆఫ్ ది టూత్ రెలిక్ – ప్రసిద్ధ ఆలయం
- బెనోటా బీచ్ – తీర సౌందర్యం ఉన్న బీచ్ ప్రాంతం
- నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ కొలంబో – చరిత్ర పాఠాలు తెలిపే కేంద్రం
- బహిరవోకందా విహార బుద్ధ విగ్రహం – కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే బుద్ధ విగ్రహం
- నైన్ ఆర్చి బ్రిడ్జి – చుట్టూ పచ్చని అందాల మధ్య ప్రయాణం ఎంతో ఆహ్లాదకరం
- గాల్ విహారయ – చరిత్రకు సాక్ష్యం
- రావణ ఫాల్స్ – అనూహ్యమైన ప్రకృతి సౌందర్యానికి నెలవు
- స్పైస్ గార్డెన్ – పర్యాటక యాత్రలో మరుపురాని అనుభూతినిచ్చే ప్రాంతం
- కెలానియా రాజా మహా విహారా – పవిత్రమైన ప్రార్థన స్థలం
- రువాన్ వెలిసియా – బౌద్ధ మత కేంద్రం
- సెయింట్ ఆంథోనీ చర్చి – కళాఖండం
- ఇంటర్నేషనల్ బుద్ధిస్టు మ్యూజియమ్ – బౌద్ధ మత ప్రాశస్త్యం ఉన్న కేంద్రం
- మహియాగనాయ సోరాబోరా లేక్, ఉవా ప్రావిన్స్ – అందమైన ప్రకృతికి కేంద్రం
- దెహివాలా జూ – వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం
- బంబార కంద ఫాల్స్ ఒహియా – కనులకు విందు చేసే ప్రదేశం
క్రమంగా ఒక్కో దాని గురించిన విశేషాలు తెలుసుకుందాం.