collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / దీపికా అందమంతా బ్లాక్ డ్రెస్సుల్లోనే. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

దీపికా అందమంతా బ్లాక్ డ్రెస్సుల్లోనే.

2021-12-05  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

deepika-black-dress

Courtesy: twitter 

ప్రత్యేకమైన వేదికలపై మిలమిలా మెరిసిపోయే బాలీవుడ్ హీరోయిన్స్ అందాలు పొగడాలంటే పదాలు చాలవు. లక్షలు ఖర్చు చేసి ప్రముఖ డిజైనర్స్ తో తమ స్టార్డంస్టేటస్ కు తగ్గట్లుగా రూపొందించిన దుస్తులతో నటీమణులు రెడీ అవుతుంటారు. అయితే బ్లాక్ బాడీకాన్ డ్రెస్సులలో తారల సోయగాల విందు మరింత ప్రత్యేకమనే చెప్పాలి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె బ్లాక్ డ్రెస్సులతో సెగలు రేపుతోంది.ఇక ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో జతకడుతోన్న విషయం తెలిసిందే. ఈ జోడి ఎప్పుడు మెప్పిస్తుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్స్ లో ఎంతో బిజీగా ఉండే ఈ బ్యూటీ..సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. లెటెస్టుగా బ్లాక్ డ్రెస్సులో తన అందాలను ఆరబోస్తూ...ఏంజెల్ లా రీగల్ లుక్ లో చూపు తిప్పుకోనివ్వడంలేదు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సప్యసాచి డిజైన్ చేసిన సారీలో దీపికా మెరిసిపోతోంది. డైమండ్ హియర్ రింగ్స్ తో లిపిస్టిక్ లేని పెదాలు ఆమె అందాన్ని మరింత పెంచేసాయి.   దీపిక బ్లాక్ కలర్ చీరలో అందాలను ఆరబోస్తూ కేక పెట్టిస్తుంది. దీపికను ఇలా చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. గ్లామర్ ప్రియులలో ఉత్సాహం నింపటంలో ఈ బ్యూటీ ముందుంటుంది.

అందం రెట్టింపు   

ఈ ఔట్ ఫిట్ లో దీపిక బుక్ మార్క్ చేయడానికి రెడ్ కార్పెట్ లుక్   లో అదరగొట్టింది. ఈ బ్లాక్ మెర్ మైడ్ కు సరిపోయే యానినా కోచర్ గౌను ఎద అందాలను రెట్టింపు చేస్తోంది. హెయిర్ లివ్ చేసి వజ్రాల నగలు ఈ గౌనుకు మరింత గ్లామర్ ను తెచ్చాయి. స్లీవ్ యాక్ససరైజ్ చేసిన ఈ ఎన్ సెంబుల్ ఇప్పటివరకు దీపిక అత్యుత్తమ రెడ్ కార్పెట్ లుక్ లో ఒకటిగా చెప్పొచ్చు.

దీపికా ధరించిన బ్లాక్ హీల్స్ ఆమె అందాన్ని మరింత స్టైలిష్ గా మార్చగా...మోడ్రన్ డ్రెసులో ఉన్న దేవతాలా కనిపిస్తోంది. ఈ బాల్ మైన్ డ్రెస్సులో దీపిక మరింత సెక్సీగా కనిపిస్తోంది.ఇక బి-టౌన్ దివాస్ లో క్లాసిక్ బంద్ గాలా ధరించడం తరచుగా చూస్తుంటాం. రాజేష్ ప్రతాప్ సింగ్ డిజైన్ చేసిన ఈ డ్రెస్సులో దీపికానుగౌచెరే బ్లేజర్ప్యాంట్ప్రాడా ఓవర్ కోట్లౌబౌటిన్ హీల్స్ ధరించిన దీపికా... మరింత అందంగా కనిపిస్తోంది. మెడలోని డైమెండ్ నెక్లెస్ఐలైనర్ స్టన్నింగ్ లుక్ లో అందరీ చూపు మళ్లేలా చేస్తోంది.

కొన్ని ఔట్ ఫిట్స్ ఎలాంటి యాక్ససరీస్ లో లేకున్నా అందంగా కనిపిస్తాయి. అచ్చం అలాంటి    గౌనులో దీపికా మరింత హొయలుపోయింది.ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తువులను ధరించడంలో దీపిక పదుకొనే ముందు ఉంటుందనే చెప్పాలి. ఆమె ఫ్యాషన్ ఛాయిస్    చాలా అద్భుతంగా ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈ లెదర్ ఔట్ ఫిట్. బ్లాక్ కలర్ ప్యాట్ షర్ట్   ధరించిన దీపికను చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

 2021-12-05  Lifestyle Desk