collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / నొప్పి లేకుండా హైహీల్స్ ధరించడం ఎలా..? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

నొప్పి లేకుండా హైహీల్స్ ధరించడం ఎలా..?

2021-12-07  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link


hi heels..-2

 నొప్పి లేకుండా హైహీల్స్ ధరించడం ఎలా..ఈ చిట్కాల ఫాలో అవ్వండి!       

తప్పుడు వేషధారణలో అతి ముఖ్యమైనది హైహీల్స్.అందం కోసం,పదిమందిలో స్పెషల్ గా కనిపించేందుకు ధరించే ఈ చెప్పులు...పాదాన్ని రక్షించడానికి బదులుగా,సరిగ్గా ఉపయోగించనట్లయితే...పూర్తిగా శరీరానికే హాని కలిగిస్తాయి. అయితే హై హీల్స్ ను ధరించాలి...ఎంతవరకు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.హై హీల్స్ ఎందుకు తొడుగుతారు...నిటారుగా కనిపించే వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. హై హీల్స్ తొడిగిన వాళ్లలో మడమలు మరింత ఎత్తకు వెళ్లే సరికి పృష్టభాగం కొంచెం వెనకకు వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు మరింత నిటారుగా నిలబడతారు. ఇలా నిటారుగా ఉండటంతో అందం ఇనుమడించినట్లయితుంది. ఎదుటివారికి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ హైహీల్. కానీ పరిమితికి మించి హీల్ తొడిగినట్లయితే దీర్ఘకాలంలో పాదాలకు,  పాదాల్లోని     కండరాలకు జరిగే నష్టాలు ఎక్కువే అని చెప్పాలి.        
అయితే హై హీల్స్ తొడిగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. హై హీల్స్ తొడిగే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ పూయాలి. ఎందుకంటే నడుస్తున్నప్పుడు రాపిడి కాకుండా మాయిశ్చరైజర్ కాపాడుతుంది. లేదంటే కాళ్లకు బొబ్బలు ఏర్పడి...తీవ్రమైన నొప్పి వస్తుంది.       ఇక హైహీల్స్ ను సెలక్ట్ చేసుకునే ముందు మీ పాదాల సైజును గుర్తించండి. మీ పాదాలకు ఏ సైజు అయితే సరిపోతుందో అవే ఎంపిక చేసుకోండి. ఒకసారి పాదాలకు తొడిగిన తర్వాతే కొనుగోలు చేయండి. మీ పాదం సైజు ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకున్నాకో కొనుగోలు చేయండి.       

మీ పాదాల ఆకృతికి సరిపడే హీల్స్ ను తీసుకోండి       
మనలో ఒక్కోరి పాదాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొందరి పాదాలు చిన్నగా ఉంటే మరికొందరివి వెడల్పుగా ఉంటాయి. కొందరికి పొడవాటి వేళ్లు ఉంటాయి. ఒక్కోరి ఒక్కో వేరియేషన్స్ ఉంటాయి. ఒకవేళ మీ పాదాలు వెడల్పుగా ఉన్నట్లయితే...టేపర్డ్ బూట్లను ధరించవద్దు. ఫ్రంట్ క్లోజ్డ్ లేదా ఒపెన్ లో ఉన్న షూస్ ను సెలక్ట్ చేసుకోండి. చిన్న కాళ్ళు ఉన్నవాళ్లు క్లోజ్డ్ వైడ్ ఫ్రంట్ షూలను సెలక్ట్ చేసుకోండి. పాయింటెడ్ ఫ్రంట్ షూస్ మీ కాలి వేళ్లను అసౌకర్యంగా ఉంచేలా చేస్తాయి. ఈ షూస్ ను ఒక గంట లేదా అంత కంటే ఎక్కువ సమయం తొడగలేరు.       

బ్లాక్ హీల్స్ లేదా ఫ్లాట్ ఫారమ్ లు       
పాయింటెడ్ హీల్స్ కంటే బ్లాక్ హీల్స్ లేదా ఫ్లాట్ ఫారమ్ లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. పెన్సిల్ హీల్స్ తో ఇతర హీల్స్ ను పోల్చలేము. కానీ డిజైన్ ఇండస్ట్రీలో వస్తున్న క్రియేటివిటితో నచ్చిన డిజైన్లను కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ట్రెండీ గా మారుతోంది.       

సన్నని సోల్ ఉన్న షూస్ కు సాక్సులు వాడండి.       
సన్నని సోల్ ఉన్న షూస్...మీ పాదాలకు మరింత నొప్పిని కలిగిస్తాయి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి కాళ్ళకు సాక్సులు తొడగడం మంచిది.ఇక హై హీల్స్ వేసుకున్నప్పుడు మీ పాదాలకు కాస్తంత రెస్ట్ ఇవ్వడం మంచింది. ఎందుకంటే పాదాలకు కావాల్సిన  విశ్రాంతి లభిస్తుంది.       

షూస్ సపోర్టు       
ఎక్కువగా పైకి ఉన్న షూస్ లేదా చీలమండ పట్టీ లేదా ఈ రెండూ ఉన్న హీల్స్ ధరించినట్లయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవి పాదాలకు అదనపు సపోర్టును ఇస్తాయి.       
ముందు జాగ్రత్తలు       
మీరు హై హీల్స్ విడిచిన తర్వాత మీ పాదాలను ముందుకు సాగదీయండి.లేదంటే నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ తో మర్దన చేయండి. నొప్పి నుంచి ఉపశమనం పొందంవచ్చు.లేదంటే ఫుట్ మసాజ్ చేయడం ఇంకా మంచిది.               

 



2021-12-07  Lifestyle Desk