collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / జుట్టు రాలుతోందా...? అయితే ఈ హెయిర్ మాస్క్ లు ప్రయత్నించండి.! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu...

జుట్టు రాలుతోందా...? అయితే ఈ హెయిర్ మాస్క్ లు ప్రయత్నించండి.!

2021-12-07  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

strong hair-1

జుట్టు రాలిపోతుంది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. చిన్న వయస్సుకే యువతీ యువకుల్లో జుట్టు రాలటం అధికమవుతోంది. జుట్టు రాలటం అధికంగా ఉంటే బాధాగా అనిపిస్తుంది. ఎలాంటి హెయిర్ స్టైల్స్ చేసుకోలేరు. జుట్టు రాలడాన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.   మీ జుట్టుకు హెయిర్ మాస్క్ లు  ఉపయోగించడం వల్ల జుట్టును ద్రుఢంగా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచే వివిధ రకాల హెయిర్ మాస్క్ లను ఓ సారి  చూద్దాం.   
హెయిర్ మాస్క్ లు అంటే ఏంటి?   
హెయిర్ మాస్క్ అంటే హెయిర్ ట్రీట్ మెంట్. వీటిని సహజమైన పోషక పదార్థాలతో తయారు చేస్తారు. ఈ మాస్క్ లు జుట్టు పొదుళ్లలోకి వెళ్లి..వాటిని బలంగా ఉంచేలా చేస్తాయి. షాంపూ కంటే హేయిర్ మాస్కులు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. జుట్టు చివర్ల చిట్లడం లేదా చీలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.   
హెయిర్ మాస్క్ ఎలా ఉపయోగించాలి?   
సాధారణంగా హెయిర్ మాస్కులు కండీషన్ లా పనిచేస్తాయి. హెయిర్ మాస్క్ ఉపయోగించడం చాలా తేలిక. మీ జుట్టు మోదళ్ల నుంచి చివరి వరకు హెయిర్ మాస్క్ ను అప్లై చేయండి. తర్వాత మీ జుట్టుకు షవర్ క్యాప్ కప్పి 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేసినట్లయితే మీ జుట్టు మృదువుగా మారుతుంది.   
1. ఎగ్ హెయిర్ మాస్క్...   
ఎగ్ హెయిర్ మాస్క్ రెడీ చేసుకునేందుకు ఒక గుడ్డురెండు కప్పుల పాలురెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంఆలివ్ ఆయిల్ తీసుకోండి. వీటన్నింటిని ఇక గిన్నెలో తీసుకుని బాగా కలపి జుట్టుకు అప్లై చేయండి. జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్లు అన్నీ కూడా గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.అంతేకాదు మీ జుట్టుకు మెరుపును కూడా తెస్తుంది. కర్లీ హెయిర్ నుంచి స్ట్రెయిట్ వరకు అన్ని రకాల జుట్టకు ఈ మాస్క్ పనిచేస్తుంది.   
2. యోగర్ట్ హెయిర్ మాస్క్   
ఈ హెయిర్ మాస్క్ తయారు చేసేందుకు ఒక కప్పు పెరుగుఒక టేబుల్ స్పూర్ ఆపిల్ సైడర్ వెనిగల్తేనె తీసుకోండి. వీటన్నింటి ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. తర్వాత జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ మాస్క్ జుట్టుకు తేమతో పాటు పోషణను అందిస్తుంది. ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీగా మారుతుంది.   

3. గ్రీన్ టీ హెయిర్ మాస్క్   
ఈ మాస్క్ తయారు చేయడానికి గుడ్డులోని పచ్చ సొన అవసరం. ఒక్క గుడ్డులోని పచ్చసొనరెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ తీసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. తర్వాత జుట్టుకు పట్టించండి. ఈ మాస్క్ జుట్టు చివర్ల పగుళ్లను తగ్గిస్తుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి.   
4. అరటి హెయిర్ మాస్క్   
ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిలో పొటాషియం ఉంటుంది. ఇది మీ జుట్టును ద్రుఢంగా ఉంచేలా చేస్తుంది. ఈ మాస్క్ తయారు చేయడానికి రెండు పండిన అరటిపండ్లుఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్కొబ్బరి నూనెతేనె తీసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించండి. జుట్టును బలంగా ఉంచడంతోపాటు చుండ్రు సమస్యను కూడా నివారిస్తుంది.   
5. అవకాడో హెయిర్ మాస్క్   
అవకాడోలో విటమిన్ సిబిఐరన్కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ఒక అవకాడోఒక కప్పు పాలుఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్బాదం నూనె తీసుకోండి. వీటన్నింటిని కలిపి జుట్టకు పట్టించండి. ఇలా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.   
6. దాల్చిన చెక్క హెయిర్ మాస్క్   
మీ జుట్టు వేగంగా పెరగాలంటే దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. ఈ మాస్క్ తయారు చేయడానికి తేనెదాల్చిన చెక్కహెయిర్ బాల్సమ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. దాల్చిన చెక్క ఘాటు పోవాలంటే జుట్టును చాలాసార్లు శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది.   
7. రోజ్మేరీ హెయిర్ మాస్క్   
ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేయడానికి మూడు టేబుల్ స్పూన్ల రోజ్మేరీఒక కప్పు నీళ్లు తీసుకోండి. రోజ్మేరీని కనీసం లేదా నిమిషాలపాటు నీటిలో ఉడకబెట్టండి. ఈ మాస్క్ జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.   
8. కాస్టర్ ఆయిల్ హెయిర్ మాస్క్   
ఈ హెయిర్ మాస్క్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఒత్తైన జుట్టు కావాలంటే ఆముదం హెయిర్ మాస్క్ మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ హెయిర్ మాస్క్ లో ప్రొటిన్లు పుష్కలంగా ఉంటాయి. డ్యామేజ్ జుట్టును తిరిగి మామూలు స్థితికి వస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది.   
9. కొబ్బరికరివేపాకు హెయిర్ మాస్క్   

కరివేపాకు హెయిర్ మాస్క్ జుట్టకు మంచి పోషణను ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బూడిద రంగులో వచ్చే వెంట్రుకలను నివారిస్తుంది. ఈ మాస్క్ ను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 కరివేపాకులురెండు టేబుల్ స్పూన్నల కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి వేడి చేయండి. రెండు నిమిషాల తర్వాత జుట్టుకు పట్టిచండి.   
హెయిర్ మాస్క్  ఎప్పుడు ఉపయోగించాలి. ?   
వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ లను ఉపయోగించవచ్చు. మీ జుట్టు పొడిగా కానీ జిడ్డుగా కానీ ఉన్నట్లయితే వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించిన తర్వాత మీ జుట్ట ఎలా ఉందో గమనించండి. ఫలితాన్ని బట్టి హెయిర్ మాస్కులను మార్చుకోవచ్చు.   
హెయిర్ మాస్క్ అప్లై చేశాక...ఎంత సమయం ఉంచాలి..?   
జుట్టుకు హెయిర్ మాస్క్ అప్లై చేశాక దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. మీ జుట్టు పొడిగా ఉన్నట్లయితే 20నిమిషాలు ఉంచుకోవచ్చు.   
హెయిర్ మాస్క్ ఎలా ఎంచుకోవాలి?   
మీ జుట్టును బట్టి హెయిన్ మాస్క్ ను సెలక్ట్ చేసుకోవాలి. మీ జుట్టు పొడిగా ఉన్నట్లయితే సహజ నూనెలతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోండి. కర్లీ హెయిర్ అయితే ప్రొటీన్ ఎక్కువగా ఉండే అవకాడో ఉన్న హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవడం మంచిది.   



2021-12-07  Lifestyle Desk