దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటిలో చదువుతున్న విద్యార్థులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అంతర్జాతీయ కంపెనీలు వీరిని రిక్రూట్ చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ ప్యాకేజీ ఇవడ్డానికి సిద్దంగా ఉన్నాయి. కోటి రూపాయల కంటే ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి.దేశంలోని నాలుగు ఐఐటిలు కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ, వారణాసీల్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వూల్లో 80శాతం పూర్తయిపోయాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది విద్యార్థులను హాట్‌కేకుల్లా తన్నుకుపోతున్నాయి అంతర్జాతీయ కంపెనీలు. గత ఏడాది కోవిడ్-19తో పోల్చుకుంటే ఈ ఏడాది అంతర్జాతీయ ఆఫర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఏడాది దేశంలోని ఆరు ఐఐటిలు కాన్పూర్, మద్రాస్, ఖరగ్‌పూర్, రూర్కీ, గువాహతి, బీహెచ్‌యూ (బనారస్ హిందూ యూనియవర్శిటీ) విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు 220కంటే ఎక్కువగానే వచ్చాయి. గత ఏడాది కంటే ఇది ఎక్కువే.ఐఐటి మద్రాస్ విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 181శాతం పెరిగింది. గత ఏడాది 16నుంచి ఈ ఏడాది 45మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నాయి. గువాహతి విషయానికి వస్తే ఆరు నుంచి 28మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకుంది. ఏకంగా 336శాతం పెరిగింది. ఐఐటి కాన్పూర్‌నే తీసుకుంటే గత ఏడాది 19ఉంటే ఈ ఏడాది 47కు చేరింది 147శాతం పెరిగింది. ఐఐటి బీహెచ్‌యూ విషయానికి వస్తే గత ఏడాది రిక్రూట్మెంట్లు నిల్ కాగా ఈ ఏడాది 35కు పెరిగింది.
ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఈ ఏడాది అత్యుత్తమమని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కారాన్దికర్ చెప్పారు. తమ ఇన్సిస్టిట్యూట్ ఈ ఏడాది అత్యధిక ఆఫర్లను దక్కించుకుందన్నారు. దేశీయంగాను.. అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయన్నారు. అన్నీ రంగాలకు చెందిన విద్యార్థులకు డిమాండ్ ఉందని, అయితే ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి విపరీతంగా ఉందన్నారు. అటు తర్వాత వ్యవసాయం, రిటైల్, ఇన్ఫ్రాస్ర్టక్చర్ రంగాలని ఆయన వివరించారు. ప్రతి రంగం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నందు వల్ల డిమాండ్ పెరిగిందని వివరించారు. గత ఏడాది కోవిడ్-19వల్ల కాస్తా తగ్గడం వల్ల ఈ ఏడాది రిక్రూట్మెంట్లు బాగా పెరిగిపోయాయని ఆయన అన్నారు.
ఐఐటి బీహెచ్‌యూ విషయానికి వస్తే 75శాతం మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారని ప్రొఫెసర్ ఇన్చార్జి అనిల్‌కుమార్ అగర్వాల్ చెప్పారు. ఐఐటీ బీహెచ్‌యూ విషయానికి వస్తే 1,142ఆఫర్లు 307కంపెనీల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వచ్చాయని ఆయన తెలిపారు.ఐఐటి కాన్పూర్ విషయానికి వస్తే నాలుగో రోజు 940ఆఫర్లు వచ్చాయి. ఈ ఏడాది అన్నీ రంగాలకు చెందిన విద్యార్థులకు మంచి ఆఫర్లు దక్కాయని ప్రొఫెసర్ ఇన్చార్జీ వినయ్ర్శర్మ చెప్పారు. ఐఐటి రూర్కీ విషయానికి వస్తే 84గంటల్లో వెయ్యి ఆఫర్లు వచ్చాయని చెబుతున్నారు. ఐఐటి ఖరగ్‌పూర్ విషయానికి వస్తే 1,300ఆఫర్లు. ఐఐటి గువాహతి విషయానికి వస్తే 625కంటే ఎక్కువ ఆఫర్లు రాగా.. ఐఐటి మద్రాసుకు1,208ఆఫర్లు వచ్చాయి. 231ప్లేస్మెంట్లు జరిగిపోయాయి. ఇక వీరి వేతనాల విషయానికి వస్తే అంతర్జాతీయ కంపెనీలు ఏడాదికి రెండు కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేస్తుండగా.. దేశీయ కంపెనీలు రూ.1.8కోట్లు ఆఫర్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది ఐఐటి విద్యార్థుల పంట పండిందని చెప్పుకోవచ్చు.