collapse
...
Home / ఆరోగ్యం / కండరాల పట్టేస్తున్నాయా ఇవీ కారణాలు కావచ్చు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Tel...

కండరాల పట్టేస్తున్నాయా ఇవీ కారణాలు కావచ్చు

2021-12-07  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

PAIN IN THE MUSCLES

ఒక వయస్సు వచ్చిన తరువాత కండరాల బలహీనత సర్వసాధారణం. కుర్చీలోంచి లేచి నిలుచోడంలో ఇబ్బంది. మెట్లు ఎక్కుతుంటే సమస్య. మోకాళ్లు పట్టేసినట్లు ఉండడం అందరికీ తెలిసిన సమస్యలే. అందుకు ముఖ్యమైన కారణం మాత్రం కండరాల బలహీనత అని చెప్పాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకొక్కప్పుడు ఉన్నట్లుండి ఇలా సమస్య ఎదురు కావచ్చు. వయసుతో పాటు ఈ సమస్య పెరగడం సాధారణమే. ఇక్కడ గుర్తించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే కండరాల బలహీనత వేరుఅలసి పోవడం లేదా నెప్పిగా అనిపించడం వేరు.         

వయో ప్రభావం    

వయసు పెరిగే కొద్దీ కండబలం క్షీణించిఅవి బలహీనం కావడం మామూలే. దీనిని వైద్యులు సార్కోపెనియా అంటారు. అరవైడెబ్బయ్ ఏళ్లు వచ్చే వరకు సమస్యగా అనిపించకపోవచ్చు. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కండరాల బలహీనతకు దారితీయవచ్చు. అది నిర్థారించేందుకు మీరు ఎంత వేగంగా నడవగలరో వైద్యులు పరీక్షించి నిర్ధారించుకుంటారు.    

కొన్ని మందుల ప్రభావం    

కొన్ని మందులు వాడినప్పుడు కండరాలు బలహీనం కావచ్చు. ముఖ్యంగా కార్టికో స్టెరాయిడ్స్ (అంటే ప్రెడ్నిసోన్ వంటివి)లేదా కొలెస్టరాల్ నియంత్రణకు వాడే మందులు కారణమవుతాయి. బలహీనంగా అనిపించినాఅందుకు కారణం ఏమిటో అర్థం కాకపోయినామీరు వాడుతున్న మందుల వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని వైద్యుల ద్వారా కానీ ఫార్మాసిస్టుల ద్వారా కాని నిర్ధారించుకోవాలి.         

జలుబు లేదా ఫ్లూ ప్రభావం    

జలుబు చేసినప్పుడుఫ్లూ సోకినప్పుడు లేదా కొన్ని రకాలైన బగ్ ప్రభావం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఫ్లూ ప్రభావం రెండు వారాలపాటు కొనసాగితే కొద్దికాలం తరువాత ఈ కండరాల బలహీనత కూడా తగ్గిపోవాలి. కొన్ని వైరస్ లు కండరాల్లో ప్రవేశించి వాటి బలహీనతకు కారణమవుతాయి. అన్ని విధాలా ఆరోగ్యవంతమైన వారిలో ఇలాంటి ప్రభావం ఉండదు.         

కోవిడ్ 19 ప్రభావం    

కోవిడ్ 19 లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలు చాలా సందర్భాలలో ఒకేలా ఉంటాయి. దగ్గుజ్వరంఅలసట రెండు సందర్భాలలో కనిపిస్తాయి. అయితే కోవిడ్ ప్రభావం ఇతర శరీర భాగాలపై కూడా ఉండవచ్చు. వాటిలో కండరాలను బలహీనం చేయడం కూడా ఒకటి. ఏ కారణంగా అయినా సరే రోజుల తరబడి లేదా వారాల తరబడి ఆస్పత్రి పాలయిన పక్షంలో కండరాలు నిస్సత్తువగా మారిపోతాయి. ఫిజియో థెరాపీ లేదా ఇంట్లో చేయడానికి వీలైన వ్యాయామం పరిష్కారం కావచ్చు.         

కండరాలకు గాయాలు    

ఏవైనా బరువైన వాటిని మోసినప్పుడు లేదా ఒకే పని మళ్లీ మళ్లీ చేయవలసిన సందర్భాలలో కండరాలు బిగిసిపోవచ్చు. ఒకొక్కప్పుడు కండరాలు గాయపడవచ్చు. అలాంటప్పుడు మరీ సమస్య తీవ్రంగా లేనప్పుడు ఆర్ ఐ సీ ఈ ( అంటే రెస్ట్ తీసుకోవడంఐస్ తో కాచడంకండరాలను బిగించడం (కంప్రెషన్) లేదా ఎలివేషన్ (వాలుగా ఉంచడం) విధానంలో ఇంట్లోనే ఉండి చేసే ఎక్సర్సైజులు ఉపకరిస్తాయి. గాయం మానిపోతుంది. సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.         

మల్టిపుల్ సెలోరొసిస్    

ఒక రకంగా చెప్పాలంటే కండరాల బలహీనత అతి పెద్ద ఆరోగ్య సమస్యకు సూచన అని చెప్పాలి. ఆ సమస్యనే మల్టిపుల్ సెలోరొసిస్ అంటారు. మనలోని రోగనిరోధక శక్తి నరాలలోని సూక్ష్మ కణాలపై దాడిచేయడం అని గుర్తించాలి. అంటే     బ్రెయిన్ నుంచి శరీర అవయవాలకు సరైన సూచనలు సరైన సమయానికి చేరక పోవడం అని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.         

గుండె పోటు (స్ట్రోక్)    

కండరాల బలహీనత అకస్మాత్తుగా ఎదురయితే అది గుండె పోటుకు సూచన అనుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి బలహీనత శరీరంలో ఏదో ఒక వైపు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో తల తిరగడంచూపు మసక బారడంనడవడం లేదా మాట్లాడడంలో ఇబ్బందిశరీరం అదుపులో లేకపోవడంఅయోమయమైన మానసిక స్థితితల నెప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తే తక్షణం వైద్య సహాయం అందించాలి.         

మరి కొన్ని సందర్భాలు    

కండరాల బలహీనతకు మరెన్నో కారణాలు కూడా ఉండవచ్చు. సరిగా నిద్ర పట్టకపోవడంథైరాయిడ్ సమస్యక్రానిక్ గా మారిపోయిన అలసట సమస్యగుండె పనిచేయని సమయంమధుమేహంఇంకా డెర్మాటోమియోసిటిస్పోలీమియోసిటిస్ఇతర మియోపతీ సమస్యలు వాటిలో కొన్ని.    

ప్రెగ్నెన్సీ సమయంలో ...    

గర్భధారణ సమయంలో కండరాల బలహీనత కనిపించవచ్చు. దీనితో పాటు అలసట కూడా ఉంటుంది. మియ్థేనియా వంటి సమస్య కూడా జత చేరితే ఇది ప్రమాదకరం కావచ్చు. అనుమానం రాగానే వైద్యులను కలుసుకోవాలి.     సమస్య స్వరూపం ఎలా ఉన్నా తీవ్రతను బట్టి వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.         2021-12-07  Health Desk