collapse
...
Home / ఆరోగ్యం / ఆర్థో / వెన్ను భాగంలో నొప్పి.. ఉపశమన చిట్కాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

వెన్ను భాగంలో నొప్పి.. ఉపశమన చిట్కాలు

2021-12-07  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

cat stretch exercise
 

నొప్పిమొద్దుబారినట్లు అనిపించడంలేదా జలదరించడం వంటి లక్షణాలు ముఖ్యంగా వెన్ను దిగువ భాగంలో కనిపిస్తే చాలా బాధగా ఉంటుంది. ఈ సమస్యకు చాలా కారణాలే ఉండవచ్చు. కండరాలపై ఒత్తిడిలేదా సరైన శారీరిక కోణంలో కాకుండా తప్పుడు కోణంలో కూర్చోవడం లేదా పడుకోవడం లేదా నిలబడడం ఇందుకు ప్రధానమైన కారణాలుగా చెప్పాలి. వయసుతో వచ్చే సమస్యగా కూడా దీన్ని గుర్తించాలి. దీనిని క్రానిక్ లేదా ఆక్యూట్ తరహాలుగా వైద్యులు పరిగణిస్తారు. అక్యూట్ పెయిన్ సమస్య కొద్ది రోజులు లేదా కొద్ది వారాల పాటు మాత్రమే ఉంటుంది. క్రానిక్ పెయిన్ అయితే 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే ఈ సమస్య వేధిస్తుంది. రెండు సందర్భాలలోనూ కారణాలు ఒకే విధంగా ఉండవచ్చు.    

ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం కొన్ని చిట్కాల వంటి వ్యాయామాలను పరిశీలించవచ్చు. వీటిని అనుసరిస్తే ముందు ముందు మళ్లీ ఇలాంటి సమస్య రాకపోవచ్చు కూడా. వాటిని స్థూలంగా… స్ట్రెచింగ్ అండ్ ఫోకస్డ్ బ్యాక్అబ్డామినల్ స్ట్రెంగ్తనింగ్ అని చెప్పుకోవచ్చు. ఇవి వెన్నుకింది భాగంలో నెప్పులను తగ్గించడంలో తోడ్పడతాయి.     పొట్ట ప్రాంతంలోనూతొడల వెనుక భాగంలోని కండరాల వల్ల నిలబడేందుకుకూర్చునేందుకు అనుకూలమైన సామర్థ్యం పెంచుతాయి. పిరుదులకండరాలు బలంగా ఉంటే నడనడంనిలబడడం కూర్చోవడంలో సరైన స్థితిలో సాధ్యమవుతుంది. కండరాల సంకోచవ్యాకోచాలు సవ్యంగా ఉంటే శారీరిక కదలికలు సమర్థవంతంగా సాగుతాయి.     

కండరాల సత్తువ పెంచే విషయంలో దిగువ సూచించిన ఎక్సర్ సైజులు సహకరిస్తాయి. ఇవి రోజు చేయడం మంచిది.     

మోకాళ్ల నుంచి ఛాతీ వరకు స్ట్రెచింగ్(ఇవి వర్క్ అవుట్ కు సరైన వార్మ్ అప్ లుగా ఉపకరిస్తాయి.)    

స్టెప్ 1 – వెల్లకిలా పడుకుని మోకాళ్లను వంచిపాదాలను నేలపై ఆనించి ఉంచాలి.    

స్టెప్ 2 – రెండు చేతులూ ఉపయోగించి ఒకటి తరువాత పట్టి ఛాతీకి దగ్గరగా లాక్కోవాలి.         

స్టెప్ 3 – పొట్ట దగ్గరి కండరాలను బిగపట్టివెన్ను భాగాన్ని గట్టిగా నేలకు అదిమిపట్టాలి. ఈ విధంగా కనీసం సెకన్లు     వెన్ను నేలకు నొక్కి ఉంచాలి.    

స్టెప్ 4 – మొదటి స్థితికి వచ్చేసిన తరువాత అయిదు సెకన్ల తరువాత రెండో వైపు చేయాలి.         

ఈ విధంగా ఉదయంరాత్రి కూడా ఖాళీ కడుపున రెండు మూడు సార్లు చేయాలి.    

నడుము భాగం గుండ్రంగా తిప్పడం    

స్టెప్ 1 - వెల్లకిల పడుకుని మోకాళ్లను ముడుచుకునిపాదాలు నేలపై ఆనించి ఉంచాలి.    

స్టెప్ 2 – చేతులను నేలపై చాచి ఉంచాలి. దగ్గరగా ముడుచుకున్న     మోకాళ్లను కుడి వైపుఎడమ వైపు బాగా వంచాలి . ఇలా వంచిన మోకాలిని అదే స్థితిలో కనీసం నుంచి 10 సెకన్లు నిలిపి ఉంచాలి.         

స్టెప్ 3 – మళ్లీ మొదటికి వచ్చి రెండో వైపు కూడా ఇలాగే చేయాలి.    

వీటిని కూడా ఉదయంసాయంకాలం రెండు మూడు సార్లు చేయాలి.    

 

పిరుదుల భాగంపొట్ట కండరాల శక్తివంతం కోసం         

స్టెప్ 1 – వెల్లకిలా పడుకునిమోకాళ్లు ఛాతీకి దగ్గరగా ముడుచుకుని పాదాలు నేలపైనే ఆనించి ఉంచాలి.         

స్టెప్ 2 – భుజాలుమెడ బిగించి ఉంచకుండాపొట్ట కండరాలనుపిర్రల భాగాన్ని గట్టిగా నొక్కి పట్టాలి. ఆ స్థితిలో పిరుదులను పైకి లేపాలి. ఇబ్బందికరంగా ఉండే స్థాయి వరకు పిర్రల భాగం పైకి లేపకూడదు. జాగ్రత్త.    

స్టెప్ 3 – ఈ స్థితిలో ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండాలి. ఆ సమయంలో కనీసం మూడు సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. మెల్లిగా పెంచడానికి ప్రయత్నించాలి. ఆ తరువాత సాధారణ స్థితికి వచ్చేయాలి.    

ఇలా ప్రారంభంలో అయిదు సార్లు చేస్తూ క్రమంగా 30 సార్లు చేయడానికి ప్రయత్నించాలి.    

 

వెన్ను కింది భాగానికి వంగే గుణం పెంచడం    

ఇది కొంత వరకు సులువైనది. వెన్నుపొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది.    

స్టెప్ 1 – వెల్లకిల పడుకుని మోకాళ్లను ఛాతీ దిశగా వంచి పాదాలను నేలపై ఆనించి ఉంచాలి.    

స్టెప్ 2 – పొట్ట కండరాలను బిగపట్టి ఉంచాలి. ఛాతీకి దూరంగా పొట్ట భాగం ఉబ్బి ఉండేలా చూసుకోవాలి. సెకన్ల పాటు అలాగే నిలిపి ఉంచాలి.         

స్టెప్ 3 – రిలాక్స్ కండి. మళ్లీ వెనకటి స్థితికి చేరిబొడ్డు భాగాన్ని నేలవైపునకు లోపలికి బిగించి ఉంచండి. ఇలా సెకన్లు ఉండాలి. రిలాక్స్ అవండి.    

ప్రారంభంలో అయిదు సార్లు చేస్తూమెల్లిగా ఆ సంఖ్యను 30 సార్లకు పెంచండి.    

పిల్లిఆవు తరహాలో స్ట్రెచింగ్    

ఈ తరహా వ్యాయామం వెన్ను కింది కండరాలను పటిష్టం చేస్తుంది. ఉదయంరాత్రి వేళ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.    

స్టెప్ 1 – వెల్లకిలా పడుకునే ఉండాలి. చేతులుకాళ్లు నేలపై ఆనించి ఉంచాలి. చేతులు భుజాల కన్నా ఎక్కువ ఎడంగా కానీకాళ్లు హిప్ వెడల్పును కానీ దాటి ఉండకూడదు.    

స్టెప్ 2 – వెన్ను భాగం పైకి వంచుతూ పొట్ట భాగాన్ని పైకి లేపాలి.         

స్టెప్ 3 – మెల్లిగా వెన్నుపొట్ట భాగం కండరాలు బిగించకుండా చేతులను వెనక్కి సాగదీసి చూపులను పైకి నిలబెట్టాలి.         

స్టెప్ 4 – మొదటి పొజిషన్ కు వచ్చేయాలి.         

రోజుకు రెండు సార్లు, 3 నుంచి సార్లు ఇలా చేస్తూ ఉండాలి.    

కూర్చుని ఉండి నడుమును చుట్టూ తిప్పడం    

ఈ ఎక్సర్ సైజు చేసేప్పుడు మరీ ఎక్కువగా తిప్పడానికి ప్రయత్నించవద్దు. అతిగా తిప్పితే వెనుక భాగం ఇబ్బంది పడవచ్చు.    

స్టెప్ 1 – చేతులు లేని కుర్చీలో కానీస్టూల్ మీద కానీనేల మీద కానీ కూర్చోవాలి. ఎడమ కాలిపై కుడి కాలు వెలుకోవాలి.         

స్టెప్ 2 – ఎడమ మోచేతిని కుడి మోకాలి చుట్టూ బిగించిశరీరాన్ని ఆ దిశగా సాగదీయాలి. అలా సాగదీసిన స్థితిలో 10 సెకన్లు ఉండగలగాలి.         

స్టెప్ 3 – ఇదే విధంగా రెండో వైపు కూడా 10 సెకన్లు చేయాలి.         

ఇలా రెండు వైపులా నుంచి అయిదు సార్ల చొప్పున రోజూ రెండు సార్లు చేస్తూ ఉండాలి.         

ఈ ఎక్సర్ సైజులు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించినవే కానీ పూర్తిస్థాయిలో తగ్గించడానికి కాదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అవసరమైన వైద్యసలహాలు తీసుకోవాలి. 2021-12-07  Health Desk