collapse
...
Home / ఆరోగ్యం / డైట్ & న్యూట్రిషన్ / ఆరోగ్యాన్ని అందించేలా మధ్యధరా అలవాట్లు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

ఆరోగ్యాన్ని అందించేలా మధ్యధరా అలవాట్లు

2021-12-08  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

EATING HABITS

మధ్యధరా ప్రాంతపు జనజీవితంలో హృదయ సంబంధమైన సమస్యలు చాలా స్వల్పమనే విషయం తెలిసిన తరువాత వారి జీవన విధానాలుఆహారపు అలవాట్లపై పరిశోధనలు జరిగాయి. ఫలితంగా మధ్యధరా ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి పూర్తి రక్షణ ఇస్తాయని నిపుణులు గుర్తించారు. అయితే కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు. అక్కడి ప్రజల జీవన శైలి కూడా అందుకు కారణమై ఉంటుందని అందువల్ల గుడ్డిగా వారి ఆహారపు అలవాట్లు మాత్రమే అనుకరణ సరికాదని కూడా వారు చెబుతున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజలు తమ ఆహారంలో పండ్లుకూరగాయలుహోల్ గ్రెయిన్స్దుంపలుగింజలుఆలివ్ ఆయిల్ ప్రధానంగా నిత్యం చేరుస్తారు. మాంసాహారం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకుంటారు. పాల ఉత్పత్తులను మోతాదుకు మించకుండా తీసుకుంటారు.    

1. కేలరీల భయమే లేదు    

 

వీరి ఆహారంలో కేలరీల సంఖ్య గురించి లెక్కించవలసిన అవసరమే ఉండదు. ఆరోగ్యవంతమైన జీవితానికి ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాటిని దూరంగా పెట్టడమే వారి లక్ష్యం. అందుకే వారు ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడతారు. తాజా పండ్లుకూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఆడంబరమైన డెసెర్ట్స్ లేదాతీపి పదార్థాల జోలికి వెళ్లరు.     కావలసినన్ని కూరగాయలుపండ్లుబీన్స్వంటివి తీసుకుంటారు. గింజలు రోజు కొద్ది పరిమాణంలో తీసుకోవడం మాత్రం మంచిది. పరిమితంగా హోల్ గ్రెయిన్స్ ఉండే బ్రెడ్డు తీసుకోవచ్చు.    

 

2. తాజా పండ్లుకూరగాయలకే పెద్ద పీట    

                

ఫాస్టు ఫుడ్ సెంటర్లుప్రోజెన్ ఫుడ్ కోసం ఎగబడరు. సీజన్ లో తాజాగా దొరికే పండ్లు లేదా ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. అది కూడా నోరూరించే స్థానిక రుచులకు ప్రాధాన్యం. పాలకూరదోస కాయటమోటాలతో సలాడ్ బాగా ఇష్టపడతారు.         

 

3. బ్రెడ్ పరిమితంగానే    

                

హోల్ గ్రెయిన్స్ తో చేసిన బ్రెడ్ ముక్కలు మంచివి. ప్రోటీన్లుమినరల్స్ హెచ్చు మోతాదులో ఉండే బ్రెడ్ శ్రేష్టం. వైట్ ప్లోర్ బ్రెడ్ మంచిది కాదు. ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల గింజలతో లేదా స్థానికంగా వాడుకలోని కొన్ని మిశ్రమాలను ఉపయోగించి సిద్ధం చేసిన బ్రెడ్ మంచిది.         

 

4. ఫ్యాట్ … పరిమితంగానే    

                

ఫ్యాట్ ఉన్న ఆహారం పూర్తిగా మంచిది కాదని అనుకోరు. అయితే సరైన వాటిని ఎపిక చేసుకోవాలి. గింజలుఆలివ్స్ఆలివ్ ఆయిల్ లో తగుమాత్రంగా ఫ్యాట్ ఉంటుంది. అవి మేలు చేస్తాయి. అంతేకానిశాచ్యురేటెడ్ లేదా ట్రాన్స్ ఫ్యాట్ మంచిది కాదు. కొవ్వు ఎక్కువ లేని ఆహారం తీసుకుంటే మధుమేహం సమస్య పరిష్కారం అవుతుంది. తులసి ఆకులు చేర్చిన ఆహారం ఆరోగ్యదాయకం.    

 

5. ఆహారంలో పదార్థాలు ఎక్కువే కానీ     

గ్రీకు లేదా ఇటాలియన్ తరహా ఆహారంలోని పదార్థాలకన్నా మధ్యధరా ప్రాంత మెనూ అధికమే. మాంసం లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్ కొద్దిగా మాత్రమే. తాజా పండ్లుకూరగాయలుఆలివ్ ఆయిల్హోల్ గ్రెయిన్స్ ఎక్కువ. చిక్కుడు గింజలుఓక్రా గింజలుసుగంధ ద్రవ్యాలతో మిశ్రమాలు ఆరోగ్యవంతమైనవి.         

 

6. రుచికరమైన ఆహారం    

ఆకు కూరలుకొత్తిమీరరోస్ మేరీ ఆకులువెల్లుల్లిమిరియాలుదాల్చిన చెక్క చేర్చిన ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. ఉప్పు వేసుకోవలసిన అవసరమే ఉండదు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మష్రూమ్స్ కు వీటిని జతచేస్తే మరింత మేలు. యాంటాక్సిడెంట్సున్యూట్రియెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.    

 

7. తయారీ సులభం    

గ్రీకు దేశంలోని ఆహారం వడ్డించడంతయారీ చాలా సులభం. చిన్న ప్లేట్లలోనే వడడ్డించవచ్చు. చీజ్ ఆలివ్గింజలు విడివిడిగా ఇస్తారు.         

 

8. వైన్ తప్పనిసరి    

ఆహారంతో పాటు గ్లాసుతో వైన్ సరఫరా సర్వసాధారణం. మనం మంచి నీరు తాగుతాం. వారు వైన్ తీసుకుంటారు. అయితే మగవారు రోజుకు రెండు గ్లాసులుఆడవాళ్లు ఒక్క గ్లాసు మాత్రమే తీసుకుంటారు.    

 

9. ఆకలి వేయడం ఆలస్యం    

స్వీట్ బంగాళా దుంపలుశెనగ గింజలు వంటివి అంత తేలికగా జీర్ణం కావు. కాబట్టి వెంట వెంటనే ఆకలి సమస్య ఉండదు. గింజలుఆలివ్స్వంటివి మధ్య మధ్యలో తీసుకోవడం వల్ల ఆకలి బెడద ఉండదు.    

 

10. బరువు తగ్గుతుంది    

ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అధిక బరువు తగ్గుతుంది.         

 

11. గుండెకు మంచిది    

ఈ తరహా ఆహారం తీసుకోవడం గుండెకు చాలా మేలు చేస్తుంది. ఆలివ్గిండల కారణంగా బ్యాడ్ కొలెస్టరాల్ సమస్య ఉండదు. పండ్లుకూరగాయలుబీన్స్ వంటివిరక్త నాళాలను శుభ్రం చేస్తాయి. చేపలు ట్రైగ్లిసిరైడ్స్ నుబీపీని నియంత్రిస్తాయి. గ్లాసు వైన్ కూడా మంచిదే.         

 

12. ఎక్కువ కాలం ఉత్సాహంగా     

మధ్యధరా ప్రాంత ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం ఆనందంగా గడపడం సాధ్యమవుతుంది. బ్రెయిన్ కు మంచిది .ఫ్యాట్ ఆహారంప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు.         

 

 2021-12-08  Health Desk