
అందాలలో అహో మహోదయం...భూలోకమే నవోదయం..అని ఓ కవి అన్నట్లుగా.. భూలోక స్వర్గంగా కీర్తించబడుతోంది జమ్ముకాశ్మీర్. హిమాలయాల సొగసులు, ఎత్తైన శిఖ రాలు, లోతైన లోయలు, జలపాతాల సవ్వడులు ఎటు చూసినా... పచ్చటి తివాచీ పరిచి నట్లుగా కనువిందు చేసే ప్రకృతి అందాలు. ఈ దృష్యాలు అందరిని మంత్ర ముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి లేదు. అందుకే జమ్ము కాశ్మీర్ సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో అక్కడి టూరిస్ట్ డిపార్ట్మెంట్ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే జమ్ము లో మొట్ట మొదటి టూరిస్ట్ విలేజ్ ను లాంచ్ చేసింది పర్యటక శాఖ.
ఆకర్షించే పంచారి అందాలు:
చుట్టూ పచ్చిక భూములు, అందులో పొడవాటి పైన్, కైల్ చెట్లు. జమ్ము నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉధంపూర్ జిల్లాలోని ఈ పంచారి టూరిస్ట్ విలేజ్. కేవలం పర్యాటకరంగం అభివృద్ధి కోసమే కాకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకులు మధురమైన అనుభూతులతో తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లాలన్నఉద్దేశంతో వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు. సంప్రదాయ స్వాగతాలు, సకల సౌకర్యాలను కల్పిస్తూ ఇంట్లో ఉన్న అనుభూతిని పొందే వీలుగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జమ్మూకు వచ్చే టూరిస్టులకు బెస్ట్ డెస్టినేషన్ గా పంచారి ని తీర్చిది ద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్నేహితులతో వెళ్లినా, కుటుంబ సభ్యుతతో వెళ్లినా, ఎవరితో కలిసి వెళ్ళినప్ప టికీ అందరి అభిరుచులకు తగిన ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం వెబ్సైట్ ను అందుబాటులో ఉం చారు.
ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు, హిందూ దేవాలయాలు:
జమ్మూ ప్రాంతంలోని ఉధంపూర్ సందర్శించదగిన ప్రదేశం. ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు ఇక్కడ పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. ఎన్నో పురతన ఆలయాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ టూరిస్ట్ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ దేవికా అని స్థానికులు పిలుస్తుంటారు. ప్రకృతి, చరిత్ర , తీర్థయాత్రల ప్రాశస్త్యం, సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రాంతం యొక్క ప్రతికగా నిలుస్తాయి.చదునైన ప్రదేశంలో ఉన్న ఈ ఉధంపూర్ నగరంలోని చాలా భాగం ఎత్తైన పర్వతాలతో ఉంది. రాజా ఉధమ్ సింగ్ చేత నిర్మించబడిని ఈ నగరం అతని తరువాత ఈ నగరానికి ఆయన పేరే పెట్టారు. ఈ ప్రాంతంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఉధంపూర్‌లో ఇస్కాన్ ఆలయం ప్రధా న పర్చాటక ఆకర్షణంగా నిలుస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని అతిపెద్ద రాధా కృష్ణ దేవాలయంగా గుర్తింపు పొందింది. ఉధం పూర్ నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సంక్రి దేవతా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జాతర జరుగుతుంది.
చరిత్ర ప్రేమికులకు బెస్ట్ డెస్టినేషన్:
మౌంగ్రి గుహ పుణ్యక్షేత్రం, సుధ్ మహాదేవ్, మంటాలై ఉధంపూర్‌లోని హిందూ భక్తులు సందర్శించదగ్గ ముఖ్యమైన ప్రదేశాలు. రియాసి టౌన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీనాబ్ నది ఒడ్డున ఉన్న సియార్ బాబా ఆలయం ఒక ప్రసిద్ధ మైన మతపరమైన ప్రదేశం. ఇవే కాకుండా రాంనగర్ కోట చరిత్ర ప్రేమికులకు మంచి టూరిస్ట్ ప్లేస్ గా ఉంది. ఇక ధామ్ పూర్లోని పట్నిటాప్, సనాసర్ ప్రదేశాలు జమ్మూ ప్రాంతంలో మంచి హాలిడే డెస్టినేషన్లుగా మారాయి.