6tvnews

collapse
...
Home / బిజినెస్ / రిటైల్ / ఇన్ స్టోర్ కొనుగోళ్లలోనూ ఇ-కామర్స్

ఇన్ స్టోర్ కొనుగోళ్లలోనూ ఇ-కామర్స్

2021-12-11  Business Desk

flipkart-1

 

•రిటైలర్లు, కిరాణాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అందించేందుకు వీలు కల్పించేలా సాంకేతిక ఫీచర్లు  

 

•వేగవంతమైన చెకవుట్ తో వేగవంతమైన, సులభమైన రీతిలో షాపింగ్ అనుభూతిని అందించే ‘స్కాన్ 2 బై’  

 

•ఆవిష్కరించబడిన 10 రోజుల్లోనే, ఈ ఫీచర్ కిరాణా సభ్యులచే ఇ-కామర్స్ అనుసరించడాన్ని 30 % అధికం చేసింది  

 

భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఫ్లిప్ కార్ట్ గ్రూప్ కు చెందిన డిజిటల్ బి2బి మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్, కిరాణా వ్యాపారులు, రిటైలర్లకు అత్యున్నతస్థాయి షాపింగ్ అనుభూతిని అందించేందుకు తోడ్పడేలా తన ఇ-కామర్స్ యాప్ పై ‘స్కాన్ 2 బై’ ఫీచర్ ని ఆవిష్కరించింది.   

 ‘వ్యాపారం చేయడం ఎంతో సులభం’ అనేది ఈ వేదిక ఆశయం. అందుకు అనుగుణంగా వాక్ ఇన్ సభ్యులు ఇ-కామర్స్ ను అనుసరించేలా చేయడం ‘స్కాన్ 2 బై’ ఆశయం. దేశవ్యాప్తంగా 28 ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ బెస్ట్ ప్రైస్ స్టోర్స్ లో ఈ ప్లాట్ ఫామ్ యాప్ ద్వారా ఆవిష్కరించ బడిన ‘స్కాన్ 2 బై’ ఫీచర్ ఇప్పటికే, ఆవిష్కరించబడిన 10 రోజుల్లోనే, వాక్ ఇన్ సభ్యులలో ఇ-కామర్స్ అనుసరించే వారి సంఖ్యను 30% అధికం చేసింది. ఇ-కామర్స్ ను అనుసరించడంలో కిరాణాదారులకు ఉండే ఏ విధమైన సాంకేతిక అడ్డంకులనైనా పరిష్కరించడాన్ని ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ తన లక్ష్యంగా చేసుకుంది. స్టోర్ లో తమకు అనుకూలమైన వాతావరణంలో తమకు సౌలభ్యంగా ఉండేలా డిజిటల్ కార్ట్ కొనుగోళ్లు చేసేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది.  

ఇది ఎలా పని చేస్తుంది:   

చెకవుట్స్ కంటే ముందుగా తమ డిజిటల్ కార్ట్ ను క్రియేట్ చేసుకోవడంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్ళను ‘స్కాన్ 2 బై’ అనే ఫీచర్ పరిష్కరిస్తుంది. 25-50 వస్తువులతో ఉండే సగటు కార్ట్ కు సంబంధించి చేతితో ఆయా వస్తువుల పేర్లను టైప్ చేసి లేదా వాటి నెంబర్లను వేసి సెర్చ్ చేయడం అనేది కాస్తంత ఇబ్బంది కలిగించే అంశమే. అందుకు సమయం కూడా బాగానే పడుతుంది.  ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ సభ్యు లు ఇప్పుడు ఇ-కామర్స్ యాప్ లో స్కాన్ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు. ప్రోడక్ట్ డిటేల్స్ పేజ్ ను వేగంగా యాక్సెస్ చేసేందుకు గాను వారు ఐటంపై ఉండే బార్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు. దీంతో మాన్యువల్ గా కార్ట్ చేసుకోవడం, చెక్ చేసుకోవడంలో ఉండే ఇబ్బందులను తగ్గించుకున్నట్లు అవుతుంది. చెకవుట్ త్వరగా పూర్తవుతుంది. డిజిటల్ కార్ట్ రెడీ కాగానే, స్టోర్ లో ఉండే పికర్ ఫిజికల్ కార్ట్ లో మాది రిగానే ఆయా వస్తువులను పిక్ చేస్తారు. ఆర్డర్ పిక్ చేసుకోవడం పూర్తి కాగానే ఇన్వాయిస్ (ఆటో ప్రాసెస్) వస్తుంది. వస్తువుల ప్యాకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కస్టమర్ ఆ ఆర్డర్ తో వెళ్లిపోవచ్చు.   


 


2021-12-11  Business Desk