collapse
...
Home / అంతర్జాతీయం / ఒయ్యారి ఒంటెల అందాల తంటాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telug...

ఒయ్యారి ఒంటెల అందాల తంటాలు

2021-12-11  International Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

camel
 

అందాల పోటీలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. భామల చుట్టుకొలతలతో పాటు ఆమె అందచందాలు విజేతగా నిలపడంలో ఎంత దోహదపడతాయో చాలా మందికి తెలియంది కాదు. అయితే న్యాయనిర్ణేతలను మెప్పించి గెలుపు తీరాన్ని తాకాలంటే అదొక్కటే సరిపోదు.. అందంగా కనిపించాలంటే లోకంలో ఎక్కడెక్కడ అత్యుత్తమ కాస్టూమ్స్ ఉన్నాయో వెతికి.. వేటాడి మరీ తెచ్చుకొని ఇంతులు ఎంతో శ్రద్ధగా టచప్ చేసుకుంటారు. అనుకున్న రూపం అగుపించే వరకు వెనక్కి తగ్గేదేలేదంటారు. తుదకు నిబంధనల మేరకు పోటీల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం సింగారించుకోవడం బెడిసికొట్టింది. నిబంధనలు తుంగలో తొక్కి మితిమీరిన టచప్ చేసుకున్నందుకు ఏకంగా ఫైనల్ పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ అందాల పోటీల నుంచి నిష్క్రమించింది సుందరాంగులు కాదు... ఒయ్యారి ఒంటెలు. ఔను మీరు చదువుతున్నది నిజమేనండి. నమ్మకపోతే ఒక్కసారి దుబాయ్ వెళ్లొద్దాం పదండి.    

అందాల పోటీల ఆనవాయితీ   

దుబాయిలో ప్రతి ఏటా ఒంటెల పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. సౌదీ అరేబియా రాజు కింగ్ అబ్దుల్ అజీత్ ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఒంటెల అందాల పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ నెలారంభంలో సౌదీ అరేబియా ఈశాన్యాన ఉన్న ఎడారి నగరం రియాద్ లో ఒంటెల ఫెస్టివల్ మొదలైంది. దానికి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తునఒంటెల బ్రీడర్లను ఆహ్వానించారు.    విజేతకు 66మిలియన్ డాలర్ల భారీ బహుమతిగ కూడా ప్రకటించారు. ఒంటెల తల ఆకారంమెడమూపురండ్రెస్సింగ్అవి ఇచ్చే ఫోజుల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. విజేతలను నిర్ణయించడంలో జ్యూరీదే తుది నిర్ణయం. పైన చెప్పిన ఆకారాలు కనిపించేందుకు పోటీదారులు పొరపాటునోకావాలనో ఒంటెలకు అసహజమైన కాస్మొటిక్స్ వాడినట్లయితే నిషేధాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని నిర్వహకులు హెచ్చరించారు. అంతటితో ఆగకుండా వారిపై చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే కొందరు పోటీదారులు ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టి తమ ఒంటె ఎలాగైనా తుది పోటీల్లో విజేతగా నిలవాలన్న అత్యుత్సాహంతో బొటాక్స్ అనే ఇంజెక్షన్(బొటులిన్ అనే బ్యాక్టీరియాతో తయారు చేసే ఈ ఔషధాన్ని సాధారణంగా కండరాల చికిత్సలో ఉపయోగిస్తారు. ముఖంపై ముడతలను తాత్కాలికంగా కనిపించకుండా ఇది తోడ్పతుంది) ఒంటెలకు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఒంటె అందంగా కనిపించేందుకు అసహజమైన కాస్మొటిక్స్టచప్ లను వాడినట్లు పరీక్షల్లోతేలింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఫైనల్ పోటీల నుంచి 40 ఒంటెలపై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. డజన్ల కొద్దీ బ్రీడర్లు ఈ సారి తమతమ ఒంటెల పెదాలుముక్కులను సాగదీయడంకండరాలు ధ`డంగా కనిపించేలా వాటి తలలుపెదాల్లోకి బొటాక్స్ ఇంజెక్షన్లు ఇప్పించారని ఇదంతా తాము జరిపిన అత్యాధునిక పరీక్షల్లో తేటతెల్లమైందని నిర్వహకులు ప్రకటించడం విస్మయానికి గురిచేసింది. ఒంటెల ముఖాలుబాడీ పార్టులు గంభీరంగా కనిపించేందుకు రబ్బర్ బ్యాండ్లను వాడారని గుర్తించారు.       

అత్యంత ప్రతిష్టాత్మకం   

సౌదీలో జరిగే ఒంటెల కార్నివాల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ ఒంటెల రేసులుఅమ్మకాలుబ్రీడింగ్ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. ఎడారి దేశం సౌదీ అరేబియా సంస్క`తిసంప్రదాయాలకు ఈ ఫెస్టివల్ అద్దం పడుతుంది. ఇక ఒంటెల బ్రీడింగ్ మల్టీ మిలియన్ డాలర్ల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా సంబంధిత పరిశ్రమ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది.       

భారత్ లోనూ ఒంటెల ఉత్సవం   

భారతదేశంలో కూడా ప్రతి ఏటా ఒంటెల ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఎడారి రాష్ర్టంగా పేరుగాంచిన రాజస్థాన్ లోని పుష్కర్ పట్టణంలో దీనిని నిర్వహించడం పరిపాటి. అక్కడికి వివిధ రాష్ర్టాల నుంచి ముఖ్యంగా గుజరాత్మధ్యప్రదేశ్రాజస్థాన్ ల నుంచి ఒంటెల కాపరులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఒంటెలను అందంగా ముస్తాబు చేసుకుని తీసుకొస్తారు. ప్రత్యేక అనుమతుల ద్వారా పొరుగుదేశం పాకిస్థాన్ నుంచి వ్యాపారులు వస్తుంటారు.    ప్రధానంగా ఇక్కడ ఒంటెల అమ్మకాలుకొనుగోళ్లు సాగుతుంటాయి. దేశీయఅంతర్జాతీయ పర్యాటకులను ఈ ఒంటెల కార్నివాల్ విపరీతంగా ఆకర్షిస్తుంది. నవంబర్ నుంచి ప్రారంభమైన ఈ ఫెస్టివల్ 13 రోజుల పాటు నిర్వహించారు.       2021-12-11  International Desk