collapse
...
Home / జాతీయం / నేను హిందువును అవుతా - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

నేను హిందువును అవుతా

2021-12-12  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link


Ali akbar..-1
ఉత్తరప్రదేశ్ లో ఆ రాష్ట్ర షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ సయ్యద్ వాసీమ్ రజ్వీ డిసెంబర్ 6న ఇస్లాం వీడి సనాతన ధర్మం స్వీకరించారు. అది జరిగి వారం కూడా తిరక్కముందే కేరళకు చెందిన ప్రముఖ దర్శకుడు అలీ అక్బర్ ఇస్లాం వదిలేసి తన మాతృధర్మమైన సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు. సనాతన ధర్మానికి అత్యంత వైరిపక్షాలుగా పరిగణించే విదేశీ మతాల్లో ఉండే వారు ఎందుకిలా తిరిగి సనాతన స్వధర్మాన్ని స్వీకరిస్తున్నారనేది కూడా అత్యంత ఆసక్తిదాయక ప్రశ్నగా మారింది.                                 

ఇప్పటి వరకూ         ‘ నేను హిందువునెట్లవుతా ? ’  అనే ఆగ్రహ కథనాలు మాత్రమే చూశాం. ఇప్పుడు మాత్రం  ‘ నేను         హిందువునౌతా ’   అనే పశ్చాత్తాప వేడుకోళ్లు ఒక పరంపరగా చూస్తున్నాం. నిజమే పశ్చాత్తాపాన్ని మించింది        లేదు. పశ్చాత్తాపం చెందిన వారిని ప్రభువైన ఈశ్వరుడు కరుణిస్తాడనడంలో సందేహం లేదు. అందుకే నేడు దేశంలో స్వధర్మ పునరాగమన సంఘటనలు అధికమవుతున్నాయి.                                  

మతం మార్చుకుంటే వర్ణమేది ?                

ఇతర మతాల్లోకి చేరిన వారు తిరిగి సనాతన ధర్మంలోకి చేరుతున్నారు. ఇక్కడే ఓ చిక్కు ప్రశ్న ఎదురవుతోంది... రేపటినాడు వారికి హిందూమతంలో దక్కే స్థానం ఏంటి వారిని ఏ వర్ణం వారిగా పరిగణిస్తారని. అదీ నిజమే...దాని గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అది ఇక తప్పించుకోలేని సందర్భం అవుతోంది. చాతుర్వర్ణ వ్యవస్థలో                 వారి వర్ణం ఏంటో కూడా ఆలోచించాలి.                                 

యూపీకి చెందిన సయ్యద్ వాసీమ్ రజ్వీ కావచ్చు...లేదా కేరళకు చెందిన ప్రముఖ దర్శకుడు అలీ అక్బర్ కావ చ్చు...వీరంతా సనాతన మతం లోకి చేరారు సరే...మరి వారి వర్ణం ఏదవుతుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతోం ది. సయ్యద్ వాసీజ్ రజ్వీ కాస్తా జితేంద్ర త్యాగిగాస్వధర్మ పునరాగమనం చేసిన సందర్భంగా ఈ ప్రశ్నకు కొంత సమాధానం లభించింది. ఇస్లాం మతంలో (వర్ణం పరంగా) ఆయన అనుభవించిన హోదా తో దాదాపు సమానమైన                 హోదా ఆయనకు సనాతన ధర్మంలో లభించింది. అంటే ఒక నిర్దిష్ట కులంలో ఉంటూ....ఏవో కారణాల వల్ల విదేశీ మతాల్లో చేరిన వారు తిరిగి స్వధర్మంలోకి చేరినప్పుడు తిరిగి తమ పాత వర్ణాల్లోకే వెళ్లవచ్చు.                               

సయ్యద్ లు బ్రాహ్మణులతో సమానం                

 ముస్లిం వ్యవస్థలో సయ్యద్ అనేది అత్యున్నత స్థానంలో ఉంటుంది. మన దేశంలో అది బ్రాహ్మణ వర్గానికి సమానమైంది. ఆ లెక్కన చూస్తే సయ్యద్ వాసీమ్ రజ్వీకి బ్రాహ్మణ వర్ణమే ఇవ్వాల్సి ఉండింది. అయితే....ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. స్వధర్మ పునరాగమన విషయంలో ఒక్క బ్రాహ్మణ కులాన్ని మాత్రం మినహాయింపుగా చెబుతున్నారు. అంటే బ్రాహ్మణులు గతంలో విదేశీ మతం స్వీకరించిన సందర్భంలో....వారు సనాతన ధర్మంలోకి ప్రవేశించినాతిరిగి బ్రాహ్మణ వర్ణంలోకి చేరడం మాత్రం సాధ్యపడదు. ఇతర వర్ణాలకు చెందిన వారు సైతం తమ కఠోర తపస్సు లాంటి వాటితో బ్రాహ్మణత్వాన్ని సాధించిన సంఘటనలు ప్రాచీన కాలంలో ఎన్నోఉన్నా...ఇప్పుడు అలా తపస్సు చేయడం లాంటివి సాధ్యపడవు. ఇక మిగిలింది బ్రాహ్మణ వర్ణం కంటే కాస్త దిగువన ఉన్నవర్ణాల్లో వారికి స్థానం కల్పించడం. యూపీకి చెందిన సయ్యద్ వాసీమ్ రజ్వీ విషయంలో జరిగింది అదే.                                 

Wasim Rizvi-1
         

బ్రాహ్మణవర్ణంతో సమానంగాత్యాగి                

సయ్యద్ వాసీమ్ రజ్వీ కివర్ణం నిర్ణయించాల్సి వచ్చినప్పుడుఆయనను బ్రాహ్మణ వర్ణంలో చేర్చనప్పటికీదానితో సమానమైందిగా భావించే మరో వర్ణమైనత్యాగిలోకి చేర్చారు. యతి నరసింహానంద సరస్వతి ఈ నిర్ణయం తీసుకున్నారు.                 సయ్యద్ వాసీమ్ రిజ్వీ            పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా ధర్మాచార్యులు నిర్ణయించారు. ఈ విధంగా సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు తనకంటూ ఓ వర్ణాన్ని పొందగలిగారు. యూపీలో త్యాగి వర్ణంను బ్రాహ్మణ వర్ణంతో దాదాపుగా సమానమైందిగా భావిస్తారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. యతి నరసింహానంద సరస్వతి కూడా త్యాగి వర్ణానికి చెందిన వారే. ఆయనే స్వయంగా ఆమోదముద్ర వేశారంటే...త్యాగి వర్ణంలోని వారంతా కూడా సయ్యద్ రిజ్వీ తమ వర్ణంలోకి రావడాన్ని ఆమోదించినట్లే లెక్క.                                 

ఆ ముస్లింలది కశ్మీరీ పండిట్ సంస్కృతి                

దేశంలోకి విదేశీ మతాలు వచ్చి మరీ ముఖ్యంగా ఇస్లాం విషయానికి వస్తే...అది మతమార్పిళ్లను ప్రారంభించి ఏడెనిమిది వందల ఏళ్లు అవుతోంది. అప్పట్లో కశ్మీర్ నుంచి ఈ మత మార్పిళ్లు మొదలయ్యాయి. అందుకే కశ్మీరీ పండిట్ సంస్కృతి అంటే అది తమ సంస్కృతి అని అక్కడి ముస్లింలు కూడా భావిస్తారు. క్రైస్తవం విషయానికి వస్తే... అది దేశంలో మత మార్పిళ్లు చేయడం ప్రారంభించి రెండుమూడు వందల ఏళ్లు                 మాత్రమే అయింది. అందుకే నేటికీ క్రైస్తవంలో వర్ణ వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. రెడ్డి క్రైస్తవులు....బ్రాహ్మణ క్రైస్తవులు....ఇలా సనాతన ధర్మం లోని ప్రతీ వర్ణం కూడా క్రైస్తవంలోనూ ఉంది. క్రైస్తవం నుంచి తిరిగి స్వధర్మంలోకి రావాలనుకునే                 సందర్భాల్లో ఆయా వర్ణాల వారు తిరిగి తమ పూర్వ వర్ణాల్లోకి చేరవచ్చు.                                 

వర్ణం తెలిసిన సందర్భాల్లో...అందుకు ఆధారాలు ఉన్న సందర్భాల్లో ఘర్ వాపసీసులభం కావచ్చు...మరి వర్ణం తెలియకపోతే ఎలా...వారిని ఏ వర్ణంలో చేర్చుకోవాలి...అలా చేర్చుకుంటే ఆ వర్ణానికి చెందిన వారు ఆమోదిస్తారా ....లేదంటే ఇలా చేర్చుకునే వారి కోసం ఓ ప్రత్యేక వర్ణాన్ని సృష్టించాలా...అలా చేస్తే సమస్యలు మరింత అధికమవు తాయా ...ఇలా ఎన్నో ప్రశ్నలు. అలా అని మతాన్ని వర్ణరహితం చేసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. ఎందుకంటే సనాతన ధర్మం ఏర్పడిందే వర్ణం మీద. చాతుర్వర్ణాలను తాను స్వయంగా ఏర్పరచినట్లు శ్రీకృష్ణ పరమా త్మ చెప్పాడు. అందుకే ఆర్యసమాజ్ఆరెస్సెస్ లాంటివి చేపట్టిన ఘర్ వాపసి కార్యక్రమాల్లో భారీ ఎత్తున సామూహి క పునరాగమనం చోటు చేసుకున్న దాఖలాలు లేవు.                                 

అన్ని మతాల్లోనూ వర్ణాలు                                 

నిజానికి వర్ణం అనేది సనాతన ధర్మానికి మాత్రమ పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ వర్ణాలను మరో పేరుతో చూడవచ్చు. క్రైస్తవంఇస్లాం...ఇలా                 ప్రతీ మతం లోనూ ఎన్నో శాఖోపశాఖలు ఉన్నాయి. అవన్నీ కూడా వర్ణాలతో సమానమైనవే. అందుకే హిందూ మతంలో ఉన్నవర్ణాలను పనిగట్టుకొని విమర్శించాల్సిన అవసరం లేదనే వారూ ఉన్నారు. కాకపోతే స్వధర్మ పునరాగమన సందర్భాల్లో వర్ణం సమస్యను ఎలా పరిష్కరించాలనే సమస్య ఇప్పుడు తెరపైకి వస్తోంది.                                 

మందను చేరుతున్నగొర్రెపిల్లలు                

 మొత్తం మీద మంద నుంచి తప్పిపోయిన గొర్రెపిల్లలు తిరిగి మందను చేరుకుంటున్నాయి. వాటి తప్పులను మన్నించిన                 కాపరి ఇకపై తప్పులు చేయవద్దంటూ వారిని తిరిగి మందలో చేర్చుకున్నాడు. ఇలా మందలో చేర్చుకున్న క్రమంలో ఒకటి, రెండు వర్గాలకు (ఇతర మతాల్లో బ్రాహ్మణమతంతో సమానమైనవి) వాటికి పూర్వస్థానం కన్నా కొంచెం                 దిగువ స్థానం దక్కవచ్చు. అంతమాత్రానా డీలా పడాల్సిన అవసరం కూడా లేదు. కింది కులాలు సైతం ఉన్నత కులాలుగా మారిన దాఖలాలు వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇలా మందలో చేరినవి ఇప్పుడు కాపరి నుంచి మాత్రమే కాదు....యావత్ మంద నుంచి కూడా విశేష ప్రేమాభిమానాలను అందుకుంటున్నాయి. ఇక్కడ గొర్రెల మంద అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన సనాతన ధర్మం.                                 

గతంలో ఒక్కో కారణంతో విదేశీయుల భయాలకో...వంచనలకో...నయానభయాన                 సనాతన ధర్మాన్ని వీడిపోయిన వారంతా తిరిగి స్వచ్ఛందంగా స్వధర్మాన్నిస్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటివి ఒకటిఅరాగా మాత్రమే జరుగుతున్నాయి...కానీ అతి త్వరలోనే ఇవి సామూహిక స్వధర్మ పునరాగమనాలుగా మారినా ఆశ్చర్యం లేదు. సనాతన ధర్మం అత్యంత ప్రాచీనం...అదే సమయంలో అత్యంత అధునాతనం. మారుతున్న కాలానికి తగినట్లుగా మారే శక్తి కూడా దానికి ఉంది. అదే సమయంలో మూలాలను మాత్రం ఎప్పటికి అంటిపెట్టుకునే ఉంటుంది.                2021-12-12  News Desk