దిలీప్ టిర్కీ, ప్రమోద్ టిర్కీ, లాజరస్ టిర్కీ, జ్యోతి సునీతా కుల్లు, సునీతా లఖ్రా, అమిత్ రోహిత్ దాస్....పేరు మోసిన ఈ క్రీడా కారులందరూ ఒడిస్సాకు చెందిన వారే. అక్కడి ప్రభుత్వం ఆటలను ఎంతగా ప్రొత్సహిస్తున్నదనే దానికి వీరే ఉదాహరణ. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఆటల్లో దినదినాభివృద్ది చెందుతున్నదంటూ ఆ రాష్ట్ర మంత్రి తుషార్ క్రాంతి బెహెరా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సీఎం నవీన్ పట్నాయక్ స్వయంగా క్రీడా ప్రేమికుడు కావటం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ క్రమంలో ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన మన జాతీయ క్రీడ హాకీని ఆ రాష్ట్రంలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. దాంతోపాటు ఇతర ఆటలనూ అదేవిధంగా ప్రొత్సహించారు. నిధులు, మౌలిక సదుపాయాలు, స్టేడియాల నిర్మాణం, వాటి నిర్వహణ తదిరాంసాల్లో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని అంశాలను పరిశీలించి, స్వయంగా పరిశీలించేవారు. అందువల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆటల్లో, ముఖ్యంగా హాకీలో ఒడిశా దూసుకేళుతున్నది.
ఈ క్రీడ మన దేశంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో విశేష ఆదరణ పొందింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల మూలాల నుండి వచ్చింది కాబట్టి. ఈ క్రమంలో అక్కడి సుందర్గా జిల్లా నుంచి పదుల సంఖ్యలో హాకీ క్రీడాకారులు పుట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ క్రీడను ఎంతగానో ప్రొత్సహిస్తున్న నవీన్ పట్నాయక్ గారికి అభినందనలు వెల్లువెతుతున్నాయి.
జూనియర్ హాకీ ప్రపంచ కప్పు
హాకీ క్రీడను ఓ పక్క ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయ టోర్నీలను కూడా నిర్వహించేందుకు నవీన్ సర్కార్ ఆసక్తి చూపింది. ఇటీవల ఒడిషాలో కళింగ స్టేడియంలో జూనియర్ హాకీ ప్రపంచ కప్పు నిర్వహించింది.
స్మిమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం
హాకీ క్రీడను ఒక పక్క ప్రోత్సహిస్తూనే ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలని నవీన్ సర్కార్ భావించింది. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. స్విమ్మర్లకు ఆర్ధిక సాయం అందించడంతో పాటు వారికి కావలసిన సాంకేతిక సహకారాన్ని కూడా అందించేందుకు ఒప్పందం కుదిరింది.
నవీన్ పట్నాయక్ పై రాజ్యసభ ప్రశంసలు
హాకీ క్రీడను నవీన్ పట్నాయక్ అందిస్తున్నసహకారం పెద్దల సభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన రాజ్యసభ సమావేశాల్లో నవీన్ పట్నాయక్ పై రాజ్యసభ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నవీన్ సేవలను గుర్తుచేసుకున్నారు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడంతో పాటు అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో మహిళల జట్టు, పురుషలు జట్టు విజయాలు సాధించడం వెనుకు నవీన్ సర్కార్ కృషి ఎంతో ఉంది.
ఆగస్టులో అద్భుతం
టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. హోరా హోరీగా జరిగిన పోరులో భారత జట్టు 5-4 తేడాతో జర్మనీ జట్టును ఓడించింది. 1980 మాస్కో ఒలింపిక్స్ గోల్డ్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో పతకాన్ని అందుకుంది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.