collapse
...
Home / చదువు / ఏడబ్ల్యూఎస్ స్కాలర్ షిప్స్ పై ఎవరేమంటున్నారు ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

ఏడబ్ల్యూఎస్ స్కాలర్ షిప్స్ పై ఎవరేమంటున్నారు ?

2021-12-12  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

AWS

 

ఈ ఏడాది మొదట్లో అమెజాన్ నూతన లీడర్ షిప్ సూత్రాన్ని ప్రకటించింది. అదే... సక్సెస్ అండ్ స్కేల్ బ్రింగ్ బ్రాడ్ రెస్పాన్సిబిలిటీ. దీని గురించి మాట్లాడుకునేందుకు ఓ కారణం ఉంది. అమెజాన్ కు చెందిన ఏడబ్ల్యూ ఎస్ ఉన్నతస్థాయికి చేరుకుంటోంది. దాంతో, నూతన లీడర్ షిప్ సూత్రానికి తగినట్లుగా అది వివిధ కార్య క్ర మాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. 2025 నాటికి 29 మిలియన్ల ప్రజలకు ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాల శిక్షణ ను అందుబాటులోకి తీసుకురావాలన్న అమెజాన్ కట్టుబాటును కూడా ఇది తన కార్యక్రమాల్లో చేర్చింది. యువ అభ్యాసకుల కోసం అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ తో పాటుగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథ్స్ (స్టెమ్) ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఏడబ్ల్యూఎస్ గర్ల్స్ టెక్ డే, ఏడబ్ల్యూఎస్ గెట్ ఐటీ కార్యక్రమాలను కూడా చేపట్టింది. అదే విధంగా కాలేజీలు, యూనివర్సిటీలతో కూడా కలసి పనిచేస్తోంది. 

తగినంత ప్రాతినిథ్యం లేని వర్గాలు, అంతగా అవకాశాలు పొందని వారికి ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ తో కెరీర్ ప్రారంభించుకోడాన్ని ఏడబ్ల్యూఎస్ మరింత సులభం చేసింది. ఉచిత విద్య, స్కాలర్ షిప్స్ అందిస్తోంది. అంతే గాకుండా ప్రపంచ అగ్రగామి స్టార్టప్ లు, పరిశోధన సంస్థలు, ఎంటర్ ప్రైజ్ లు ఉపయోగించే మెషిన్ లెర్నింగ్ సాంకేతికతకు యాక్సెస్ కూడా కల్పిస్తోంది. నేడు ప్రకటించిన ఈ రెండు కార్యక్రమాలు కూడా చదువు, శిక్షణ అవకాశాలను మరింత మందికి అందుబాటు లోకి తీసుకురావాలన్న అమెజాన్ ప్రయ త్నాలను మరింత ముందుకు తీసుకెళ్తాయి.   

కాస్ట్, కాంప్లెక్సిటీని మేనేజ్ చేసే, వ్యాపార ఫలితాలను వేగవంతం చేసే క్లౌడ్ సర్వీసెస్ డెవలపింగ్, బిల్డింగ్, స పోర్టింగ్ లకు సంబంధించి, ప్రస్తుత, భవిష్యత్ కంప్యూటింగ్ ఆవశ్యకతలను తీర్చడంలో ఎడబ్ల్యూఎస్, ఇంటె ల్ 15 ఏళ్ల అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంటెల్ సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ గ్రూ ప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మైఖేల్ జాన్ స్టన్ హొల్తస్ మాట్లాడుతూ, ‘‘ఒక పరిశ్రమగా, వైవిధ్య భరిత, చేకూర్పు టెక్ సిబ్బందిని రూపొందించడంలో మనం చేయాల్సింది మరింకెంతో ఉంది’’ అని అన్నారు. ‘‘ఏడబ్ల్యూఎస్ ఎఐ, ఎంఎల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నం దుకు మేమెం త గానో గర్విస్తున్నాం. అంతగా ప్రాతినిథ్యం లేని వర్గాలకు చెందిన వారికి స్టెమ్ అవకాశాలను మరింతగా అందు బాటులోకి తీసుకువచ్చేందుకు, మెషిన్ లెర్నింగ్ ప్రాక్టీషనర్స్ భావి తరాన్ని వైవిధ్యీకరించడంలో తోడ్ప డేందుకు మాకు గల కట్టు బాటుకు అనుగుణంగానే అది ఉంది. ఈ ఎడ్యుకేషన్, స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను మరింత ప్రత్యేకమైందిగా చేసే అంశం ఏమిటంటే, ఎంతో సమగ్రంగా ఉండే లెర్నింగ్ మెటీరియల్స్ కు ఉచితం గానే యాక్సెస్ కల్పించడం. మనం ముందుకు కదిలేందుకు ఇదెంతో ముఖ్యమైన అంశం. అభ్యసనం అంటే ప్రక్రియలో పాలుపంచుకోవడం’’ అని అన్నారు. 

గర్ల్స్ ఇన్ టెక్ అనేది ఒక అంతర్జాతీయ లాభాపేక్షరహిత సంస్థ. సాంకేతికరంగంలో లింగవివక్షను తొలగించే ఆశయంతో ఏర్పడింది. ఈ సందర్భంగా గర్ల్స్ ఇన్ టెక్ వ్యవస్థాపకులు, సీఈఓ అడ్రియానా గ్యాస్కోగ్నె మా ట్లాడుతూ, ‘‘మెషిన్ లెర్నింగ్ లో వైవిధ్యతను ముందుకు తీసుకెళ్లేందుకు, అవకాశాలను అందించే, అడ్డంకు లను తొలగించే నూతన ఏడబ్ల్యూఎస్ ఏఐ, ఎంఎల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ లాంటి అంతర్జాతీయ కార్యక్రమాలు అవసర మవుతాయి’’ అని అన్నారు. ‘‘వైవిధ్యత అంతరాన్ని పూడ్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసిపని చేస్తేనే మెషిన్ లెర్నింగ్ రంగంలోకి మరింత మంది మహిళలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మెషిన్ లె ర్నింగ్ ఎడ్యుకేషన్ లో అంతరాలను భర్తీ చేసేందుకు, ఈ వర్గాల వారికి కెరీర్ అవకాశాలు అందించేందుకు ఏ డబ్ల్యూఎస్ ఏఐ, ఎంఎల్ స్కాలర్ షిప్ వంటి బహుముఖ ప్రోగ్రామ్ లు రావడం గర్ల్స్ ఇన్ టెక్ కు ఎంతో ఆనందదాయకం’’ అని అన్నారు. 

హగ్గింగ్ ఫేస్ అనేది మెషిన్ లెర్నింగ్ లో రెఫరెన్స్ ఓపెన్ సోర్స్ శక్తివంతమైన అత్యాధునిక మోడల్స్ ను ని ర్మించేందుకు, ట్రైనింగ్ కు, వినియోగించేందుకు సంబంధించిన ఏఐ కమ్యూనిటీ. ‘‘మెషిన్ లెర్నింగ్ ను ప్రజాస్వామీకరించడం మా ఆశయం’’ అని అంటారు ఆ సంస్థ ప్రోడక్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ జెఫ్ బౌడియెర్. ‘‘అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ తో ఏడబ్ల్యూఎస్ అధిక శక్తివంతమైన పీసీ లేకుండా లేదా ప్రారంభిం చేందుకు క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా, ఒక్క వెబ్ బ్రౌజర్ తో మాత్రమే ప్రతి ఒక్కరికీ ఎంఎల్ ను నేర్చు కునే, ప్రయోగాలు చేసే అవకాశాన్ని కల్పించడం ఎంతో సమంజసమైంది. ఇది ఎంఎల్ ను మరింత గా యాక్సిస బుల్ చేస్తుం ది. కమ్యూనిటీతో షేర్ చేసుకోవడాన్నిసులభం చేస్తుంది. ఈ ఆవిష్కరణలో భాగం కా వడం మాకెంతో సంతోష దాయకం. దీన్ని మరింత యాక్సిసబుల్ గా చేసేందుకు హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ ఫార్మ ర్స్, ఎగ్జాంపుల్స్, రిసోర్సెస్ తో తోడ్పాటు అంది స్తాం’’ అని అన్నారు. 

ఫైనాన్స్ విభాగం ద్వారా సాంటా క్లారా యూనివర్సిటీ ఆశయం ఏంటంటే, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిల్లో విద్యార్థులను విద్యావంతులుగా చేసి, వారు తమ సంస్థలకు, సమాజానికి సేవలందించే వారిగా తీర్చిదిద్దడం. ఈ సందర్భంగా సాంటా క్లారా యూనివర్సిటీ ఫైనాన్స్ అండ్ డేటా సైన్స్ ప్రొఫెసర్ సంజీవ్ దాస్ మాట్లాడుతూ, ‘‘అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ మా విద్యా ర్థులు క్లౌడ్ కాన్ఫిగరేషన్ దశలు లేకుండానే మెషిన్ లెర్నింగ్ లోని బిల్డింగ్ బ్లాక్స్ ను నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు నా నేచు రల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తరగతుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు మరింత సమయం పొందగలుగు తారు’’ అని అన్నారు.

‘‘అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ అనేది విద్యార్థులు ఏడబ్ల్యూఎస్ ను కొద్ది గంటల పాటు వేగంగా యాక్సెస్ చేసేందుకు, పని చేసేందుకు, ప్రయోగాలు చేసేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా వారు తాము ఎక్కడైతే ఆపేశారో, అక్కడి నుంచి తిరిగి మొదలెట్టేందుకూ వీలవుతుంది. అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్మెషిన్ లెర్నింగ్ చదువుకునే విద్యార్థులకు (బిగినర్స్, అడ్వాన్స్ డ్) క్లౌడ్ లో జూపిటర్ నోట్ బుక్స్ ను వినియోగించడాన్ని సులభతరం చేస్తుంది’’ అని అన్నారు. 

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇంజినీరింగ్ అనేది ఆధునిక కంప్యూటర్ కు జన్మస్థానం. 1946లో ప్రపం చపు మొట్ట మొదటి ఎలక్ట్రానిక్, భారీ స్థాయి, జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్ENIACడెవలప్ చేయబ డింది అక్కడే. 70 ఏళ్లుగా పెన్ లో కంప్యూ టర్ సైన్స్ రంగం ఉద్వేగభరిత వినూత్నతలకు నిలయంగా మా రింది. ‘‘మెషిన్ లెర్నింగ్ తో ప్రోగ్రామింగ్ చేయడంలో కష్టతర మైంది బిల్డ్ చేసేందుకు అనువైన ఎన్విరాన్ మెంట్ ను ఏర్పరచుకోవడం. సాధారణంగా విద్యార్థులు కంప్యూట్ ఇన్ స్టాన్సెస్, సెక్యూరిటీ పాలసీలు ఎంచుకోవాలి, క్రెడిట్ కార్డు వివరాలు అందించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్ డాన్ రోత్ అన్నారు. ‘‘నా విద్యార్థులకు అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ అవసరం ఉంది. ప్రయో గాలు చేసేందుకు అవసరమైన ఉచిత శాండ్ బాక్స్ ను అది అందిస్తుంది. సంక్లిష్టతలను తొలగిస్తుంది. అది వారు ఎంఎల్ ఎన్వి రాన్ మెంట్ ను కాన్ఫిగరింగ్ చేసేందుకు సమయం వెచ్చించకుం డానే వెంటనే కోడ్ రాసేందుకు ఉపకరిస్తుంది’’ అని అన్నారు. 2021-12-12  Education Desk