Courtesy :https://www.instagram.com/p/CXaRK24rKzd/
విశ్వవేదికపై భారతీయ అందం తళుక్కుమంది. మరోసారి విశ్వ సుందరి కిరీటం భారత సుందరిని వరించింది. ఇజ్రాయెల్ లోని ఐలాట్ వేదికగా జరిగిన 2021 మిస్ యూనివర్స్ పోటీలో మన పంజాబీ ముద్దుగుమ్మ, 21 ఏళ్ల హర్నాజ్ సంధూ విజేతగా నిలిచింది. గతంలో లారా దత్తా 2000 సంవత్సరంలో విశ్వసుందరిని కిరీటం కైవసం చేసుకుంది. ఆ తర్వాత హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకోవడం విశేషం. ఐలాట్ లో జరిగిన ప్రత్యేక వేడుకలో గత ఏడాది విశ్వ సుందరి, మెక్సికో భామ ఆండ్రియా మెజా భారత భామ హర్నాజ్ తలకు అందరి హర్షధ్వానాల నడుమ కిరీటాన్ని అలంకరించింది. తాజా పోటీల్లో పరాగ్వే ముద్దుగుమ్మ రన్నరప్ గా నిలవగా, సెకండ్ రన్నరప్ గా దక్షిణాఫ్రికా సుందరి నిలిచింది. తుది రౌండ్ లో ఈ ముగ్గురు పోటీ పడ్డారు.
అద్భుతమైన సమాధానాలతో ఆకట్టుకున్న హర్నాజ్...
ఆధునిక యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని జయిచడానికి మీరిచ్చే సలహా ఏంటని జడ్జిలు అడిగిన ప్రశ్నకు... ‘ నేటి యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఒత్తిడి ఆత్మ విశ్వాసం. తమను తాము ఇతరులతో పోల్చి చూసుకోవడం అనేది ప్రపంచ వ్యాప్తంగా అధికమవుతోంది. దాన్ని అధిగమించి నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం మొదలు పెట్టు. ఎందుకంటే నీ జివితానికి నువ్వే లీడర్.. నీ గొంతుక నువ్వే. నాపై నేను ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాను కనుకే ఈ రోజు ఇక్కడ నిలుచున్నాను’ అని అద్భుతమైన సమాధానమిచ్చి హర్నాజ్ న్యాయనిర్ణేతలను మెప్పించారు. ‘తక్కువ మాట్లాడు.. ఎక్కువ పనిచేయి’ అన్న వ్యాఖ్యతో హర్నాజ్ టాప్ 3లోకి దూసుకెళ్లింది. టాప్ 5లో నిర్వహకులు... ‘చాలా మంది వాతావరన మార్పుల గురించి మాట్లాడుతూ అదో పెద్ద గాలివార్త అంటున్నారు. అలాంటి వారిని మీరెలా ఒప్పిస్తారు’ అన్ని ప్రశ్న సంధించారు. దానికి సంధూ..‘ ప్రక`తి ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తుంటే నా హ`దయం ధ్రవించుకుపోతోంది. దానికి కారణంగా మనమంతా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే కాకుండా అవలంభిస్తున్న చర్యలే ప్రధాన కారణం. అందుకే దీనిపై తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేయడమే సరియైనదిగా భావిస్తున్నాను. మనం చేయబోయే ప్రతి పని ప్రకృతిని రక్షించడానికో.. చంపేయడానికో మాత్రమే ఉంటున్నాయి. పశ్చాత్తాపానికి, మరమ్మత్తుకు బదులు నిరోధించడం, పరిరక్షించడమే మంచిదన్నదని యువతకు చెప్పదలుచుకున్నాను‘ అని స్ఫూర్తిదాయకమైన సమాధానాన్ని ఇచ్చి అందరిని అబ్బురపరిచింది.
అక్కడి నుంచి మొదలు...
మోడల్, నటి అయిన హర్నాజ్ సంధూ అందాల పోటీలను టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2017 నుంచి మొదలు పెట్టింది. అప్పటి నుంచి పోటీల్లో పాల్గొంటూ తన సత్తా చాటుతూనే వస్తోంది. అక్టోబర్ లో జరిగిన పోటీల్లో భారత్ తరపున మిస్ యూనివర్స్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. సంధూ పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. 2019లో పంజాబ్ లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో టైటిల్ దక్కించుకుంది. ఎన్నో పంజాబీ సినిమాల్లో నటించి తనదైన ముద్రవేసుకుంది.