collapse
...
Home / చదువు / ఉచితంగా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం ఎలా ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Te...

ఉచితంగా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం ఎలా ?

2021-12-13  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Machine_Learning-1
 

తక్కువ ప్రాతినిథ్యం కలిగిన, తక్కువ అవకాశాలు కలిగిన విద్యార్థులను మెషిన్ లెర్నింగ్ లో కెరీర్స్ కోసం సన్నద్ధులుగా చేసేందుకు కొత్తగా 10 మిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ఏడబ్ల్యూఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను రూపొందించిన ఏడబ్ల్యూఎస్   

ఎలాంటి వ్యయం లేకుండానే నేర్చుకునేందుకు, ప్రయోగాలు చేసేందుకు అవసరమైన మెషిన్ లెర్నింగ్ డెవలప్ మెంట్ వాతావరణాన్ని వేగంగా ఏర్పరచుకోవడాన్ని సులభం చేస్తున్న అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్    

అమెజాన్.కామ్ ఇన్ కార్పొరేషన్ కంపెనీకి చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఏడబ్ల్యూఎస్ ఆర్టిఫిషియెల్ ఇంటెలి జెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను నేర్చుకోవడాన్ని, వాటితో ప్రయోగాలు చేయడాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందుకు వీలు కల్పించేలా రెండు నూతన ఇన్షియేటివ్స్ ను ప్రకటించింది. ఎడబ్ల్యూఎస్ ఎఐ &     ఎంఎల్ స్కాలర్ షిప్ అనేది ఒక నూతన విద్య, స్కాలర్ షిప్ ప్రోగ్రామ్. ప్రపంచవ్యాప్తంగా కూడా తక్కువ ప్రాతినిథ్యం కలిగిన, తక్కువ అవ కాశాలు కలిగిన వర్గాలకు చెందిన విద్యార్థు లను మెషిన్ లెర్నింగ్ లో కెరీర్స్ కోసం సన్నద్ధులుగా చేయడం దీని లక్ష్యం. విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక భావనలను బోధించేందుకు ఈ ప్రోగ్రామ్స్ ఏడబ్ల్యూఎస్ డీప్ రేసర్, ఏ డబ్ల్యూఎస్ డీప్ రేసర్ స్టూడెం ట్ లీగ్ లను ఉపయోగిస్తాయి. తద్వారా వారికి అటానమస్ రేస్ కార్లకు సంబంధించి మెషిన్ లెర్నింగ్ మోడ ల్స్ పై శిక్షణ ఇస్తాయి. అంతేగాకుండా మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ కేంద్రంగా రూపుదిద్దుకున్న విద్యాత్మక కంటెంట్ ను అందిస్తుంది. అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ ద్వారా నేర్చుకునే అవకాశాలను అధికం చేస్తోంది. ఇది ఎవరికైనా కూడా అమెజాన్ సేజ్ మేకర్ నో కాస్ట్ వెర్షన్ కు    యాక్సెస్ కల్పిస్తుంది. ఇది ఏ డబ్ల్యూఎస్ సర్వీస్. కస్టమర్లు మెషిన్ లెర్నింగ్ మోడల్స్    ను నిర్మించేందుకు, ట్రైన్ చేసేందుకు, ఉపయోగించేం దుకు తోడ్పడుతుంది.

ఈ సందర్భంగా ఏడబ్ల్యూఎస్ లో అమెజాన్ మెషిన్ లెర్నింగ్ వైస్ ప్రెసిడెంట్ స్వామి శివసుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘‘ఈ రోజున మేం ప్రకటిస్తున్న రెండు కార్యక్రమాలు కూడా మెషిన్ లెర్నింగ్ లో చదువుకునే అవకాశా లను అందించేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. సాంకేతికతలో ఆసక్తి కలిగిన వారికెవరికైనా విస్తృతంగా యాక్సెస్ చేసేందుకు వీలుగా డిజైన్ చేయ బడ్డాయి’’ అని అన్నారు.    

 10 మిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు చదువు, స్కాలర్ షిప్ ప్రోగ్రామ్    

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం సాంకేతిక అధునాతనలు, ఆటోమేషన్ 2025 నాటికి 97 మిలియన్ల నూతన సాంకేతి కతల ఉద్యోగాలను అందిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ విభాగాల్లోకి మరింత మంది విద్యార్థులు వచ్చేలా చేసేందుకు ఏ   డబ్ల్యూఎస్ ఈ నూతన కార్యక్రమాలను ప్రవేశ పెట్టింది.       

ఉచిత మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైనింగ్ కు, విద్యాత్మక మెటీరియల్స్ కు డజన్ల గంటల కొద్దీ ఉచిత యాక్సెస్ ను పొందడంతో పాటుగా ఆయా వర్గాల నుంచి 2000 మంది అర్హత కలిగిన విద్యార్థులు ఏఐ ప్రోగ్రామింగ్ కోసం పైతాన్ ఉడాసిటీ నానో డిగ్రీ ప్రోగ్రామ్ కోసం ఒక స్కాలర్ షిప్ కూడా గెలుచుకోగలుగుతారు. స్కాలర్ షిప్ పొందిన వారికి మెషిన్ లెర్నింగ్ కు అవసరమైన ప్రోగ్రామింగ్ టూల్స్, టెక్నిక్స్ ప్రాథమికాంశాలు అందించేలా నానో డిగ్రీ ప్రోగ్రామ్ రూపొందించబ డింది. మొదటి నానోడిగ్రీ ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్లు టెక్నికల్ అసెస్ మెంట్ కు ఆహ్వానించబడుతారు. ఈ అసెస్ మెంట్ లో అత్యధిక స్కోర్లు సాధించిన 500 మంది విద్యార్థులు డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీ రింగ్ లలో రెండో ఉడాసిటీ నానో డిగ్రీ ప్రోగ్రామ్ స్కాలర్ షిప్ పొందుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లలో కెరీ ప్రారంభించేందుకు వారిని సన్న ద్ధుల్ని చేయడంలో ఇది తోడ్పడుతుంది. ఈ 500 మంది విద్యార్థులు వారి కెరీర్ ఇన్ సైట్స్, సలహాలకు సంబంధించి టెన్యూ ర్డ్ అమె జాన్, ఇంటెల్ టెక్నాలజీ నిపుణుల నుంచి మెంటర్ షిప్ అవకాశాలను కూడా యాక్సెస్ చేయగలుగుతారు. 

ఇంటెల్ సహకారంతో, టాలెంట్ ట్రాన్స్ ఫార్మేషన్ వేదిక ఉడాసిటీ మద్దతుతో ఏడబ్ల్యూఎస్ ఏఐ, ఎంఎల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్    ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు డజన్ల గంటల పాటు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, దాని నిజజీవిత వి నియోగాలపై ఉచిత ట్రైనింగ్ మాడ్యూల్స్, ట్యుటోరియల్స్ యాక్సెస్ చేసేందుకు అవకాశం పొందగలుగుతారు.  విద్యార్థులు తాము నేర్చుకున్న థియరీని, వర్చువల్ రేస్ కార్ కు శక్తిని అందించేందుకు మెషిన్ లెర్నింగ్ మో డల్స్ కు శిక్షణ ఇవ్వడం ఎలానో నేర్చుకోవడం ద్వారా కార్యాచరణలోకి మార్చుకునేందుకు ఏడబ్ల్యూఎస్ డీప్ రేసర్ ను ఉపయోగించవచ్చు. నాలెడ్జ్ – చెక్ క్విజ్ లు వంటి వాటిలో నెగ్గడం ద్వారా ఎడ్యుకేషనల్ మాడ్యూ ల్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు నిర్దిష్ట ఏడబ్ల్యూఎస్ డీప్ రేసర్ ల్యాప్ టైమ్ పర్ ఫార్మన్స్ టార్గెట్స్ ను సాధించవచ్చు. వారు ఉడాసిటీ నానోడిగ్రీ పోగ్రామ్ స్కాలర్ షిప్స్ కోసం ఒక వ్యాసాన్ని రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ వర్చువల్ రేస్ కార్లను నూతన ఏడబ్ల్యూఎస్ డీప్ రేసర్ స్టూడెంట్ లీగ్ లో టెస్ట్ కోసం కూడా ఉంచవచ్చు. మెషిన్ లెర్నింగ్ చే డ్రైవ్ చేయబడే ఫుల్లీ అటానమస్ 1/18th స్కేల్ రేస్ కార్, 3డి రేసింగ్ సిమ్యులేటర్, అంతర్జాతీయ పోటీతోఏడబ్ల్యూఎస్ డీప్ రేసర్ స్టూడెంట్ లీగ్ అనేది అన్ని నైపుణ్యాల స్థాయిలకు చెందిన వారికి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను ఎలా రూపొందించాలనే అనే అంశంపై తోడ్పడుతుంది. క్యాపిటల్ వన్, బీఎండబ్ల్యూ, డెలాయిట్, జేపీ మోర్గాన్ చేస్, యాక్సెంచర్, లిబర్టీ మ్యూచువల్ వంటి సంస్థలచే అవి తమ సిబ్బందికి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను నిర్మిం చేందుకు, ట్రైన్ చేసేందుకు, వినియోగించేందుకు గాను ఏడబ్ల్యూఎస్ డీప్ రేసర్ ను ఉపయోగిస్తున్నాయి.    

మెషిన్ లెర్నింగ్ ను ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉంచేందుకోసం మెషిన్ లెర్నింగ్ డెవలప్ మెంట్ ఎన్వి    
రాన్మెంట్ కు ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్     

మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను వేగంగా నిర్మించేందుకు, ట్రైన్ చేసేందుకు, వినియోగించేందుకు వీలుగా అమెజాన్ సేజ్ మేకర్ ఉచిత వెర్షన్ ను అందిస్తుంది అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్. ప్రపంచవ్యాప్తంగా పరిశోధ కులు, డేటా సైంటిస్టులు దాన్నే ఉపయోగిస్తుంటారు.    ఏడబ్ల్యూఎస్ పై మెషిన్ లెర్నింగ్ ను రన్ చేసేందుకు ఒ క ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కలిగి ఉండడం లేదా బిల్లింగ్ వివరాలు అందించడం వంటి అవసరాలను అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ తొలగిస్తుంది. యూజర్లు ఓ వెబ్ బ్రౌజర్ ద్వారా ఇ-మెయిల్ చిరునామాతో సైనప్ చేస్తే చాలు. మెషిన్ లెర్నింగ్ డెవలప్ మెంట్ ఎన్విరాన్ మెంట్ కు   యాక్సెస్ ను అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ అందిస్తుంది. అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ అపరిమిత యూ జర్ సెషన్స్ ను అందిస్తుంది. మె షిన్ లెర్నింగ్ మోడల్స్ కు ట్రైనింగ్ ఇచ్చేందుకు వీలుగా, ప్రాజెక్టులను స్టోర్ చేసుకు నేందుకు 15 గిగాబైట్స్ ప ర్సిస్టెంట్ స్టోరేజ్ ను, 12 గంటల సీపీయూను, 4 గంటల జీపీయూ కంప్యూట్ ను ఎలాంటి వ్యయం లేకుండానే అందిస్తుంది. అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ తో ఉంటే, ఏ విధమైన క్లౌడ్ రిసోర్సెస్ ను బిల్డ్, స్కేల్, లేదా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల యూజర్లు మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టులపై పని చేయడం అనేది ఓ ల్యాప్ టాప్ ను ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అన్నంత సులభంగా ఉంటుంది. యూజర్లు   ప్రయోగాలు చేసేటప్పు డు, ఏడబ్ల్యూఎస్ పై తమ మోడల్స్ ను డిప్లాయ్ చేసేందుకు, అవి ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వారు తమ మెషిన్ లెర్నిం గ్ ప్రాజెక్టులను అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ కు ఎక్స్ పోర్ట్ చేయగలుగుతారు. అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో ల్యాబ్ ను విద్యార్థులు వ్యయ రహిత లెర్నింగ్ ఎన్విరాన్ మెంట్ గా ఉపయోగించుకోవచ్చు. డేటా సైంటిస్టులు దీన్ని నో – కాస్ట్ ప్రొటొటైపింగ్ ఎన్విరాన్ మెంట్ గా వాడుకోవచ్చు. ఇక్కడ ప్రతీ ఒక్కరూ వేగంగా, సులభంగా మెషిన్ లెర్నింగ్ మోడ ల్స్ ను నిర్మించడం, ట్రైన్ చేయడం ప్రారంభించవచ్చు. ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేదా దీర్ఘకాలిక కమిట్ మెంట్స్ లేకుండానే. 



2021-12-13  Education Desk