దేశంలోని అన్ని ఐఐటిల్లో ఈ ఏడాది రిక్రూట్మెంట్లు పెద్ద మొత్తంలో జరిగాయి. అయితే ఐఐటి ఖరగ్‌పూర్ మాత్రం ఈ ఏడాది రికార్డు బద్దలు కొట్టిం ది. మొత్తం 1,600 ప్లేస్మెంట్ల ఆఫర్ దక్కించుకుంది. అత్యధికంగా రూ.2.4 కోట్ల ప్యాకేజీ ఇక్కడి విద్యార్ధి దక్కింది. ఈ ఏడాది మొత్తం 245 కంపెనీలకంటే ఎక్కువ మొత్తంలో కంపెనీలు ఐఐటి ఖరగ్‌పూర్‌కు వచ్చాయి. ఈ ఏడాది మొదటి ప్లేస్మెంట్ సీజన్లో గ్లోబల్ టెక్ కంపెనీలు గూగు ల్, మైక్రోసాఫ్ట్, మిక్రాన్ టెక్నాలజీస్, ఊబర్, హానీవెల్, ఎక్స్‌ల్ లాంటి దిగ్గజాలు ఐఐటి ఖరగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులను రిక్రూట్ చేయడానికి వచ్చా యి.
ఈ ఏడాది ప్లేస్మెంట్ సీజన్లో ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థులు 1,600 కంటే ఎక్కువ జాబ్ ఆఫర్లు దక్కించుకున్నారు. అన్నీ ఐఐటిల్లో కంటే ఇదే ఎక్కువ అని ఐఐటి ఖరగ్‌పూర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ప్లేస్మెంట్ సీజన్ అనుకున్నలక్ష్యాన్ని కేవలం పది రోజుల్లో సాధించింది.
ఈ ఏడాది అత్యధిక ఆఫర్ రూ.2.4 కోట్లకు దక్కించుకుంది. మిగిలిన 22 మంది విద్యార్థులు రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్ల వరకు దక్కించు కున్నారు. ఈ ఏడాది మొదటి ఫేజ్ డిసెంబర్ 11వ తేదీలోగా పూర్తి చేయాలని ఐఐటి ఖరగ్‌పూర్ నిర్ణయించుకుంది. రెండవ ఫేజ్ వచ్చే ఏడాది జనవరి రెండవ వారం నుంచి మొదలవుతుంది.
ఐఐటి ఖరగ్‌పూర్ కేరీర్ డెవలెప్మెంట్ సెంటర్ (సీడీసీ) 400 కంటే ఎక్కువ ప్లేస్మెంట్ ఆఫర్లు (పీపీఓ) దక్కించుకోగా ఐఐటి కేజీపీ 1,500 కంటే ఎక్కువ విద్యార్థులు ఏడవ రోజు (డిసెంబర్7,2021) ను దక్కించుకున్నాయి. గతంలో నిర్వహించిన ప్లేస్మెంట్లతో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా ఎక్కువ స్థాయిలో విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకున్నారు. మొత్తం 22 ఆఫర్లలకు గాను రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్ల ప్యాకేజీ ఆఫర్లు సాధించారు. ఈ ఆఫర్ల విషయానికి వస్తే దేశీయ కంపెనీ లు పది కంటే ఎక్కువ కంపెనీలు ఈ ఆఫర్లు ఇచ్చాయి.
ఇక అంతర్జాతీయ ఆఫర్ల విషయానికి వస్తే 35 కంటే ఎక్కువ కంపెనీలున్నాయి. అలాగే సరాసరి ప్రతి కంపెనీ రిక్రూట్మెంట్ల సంఖ్యను కూడా పెంచాయి. ఈ ప్లేస్మెంట్ సీజన్లో సుమారు 245 కంపెనీల కంటే ఎక్కువనే పాల్గొని విద్యార్థులను తమ కంపెనీల్లోకి తీసుకున్నాయి.
ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఐఐటి ఖరగ్‌పూర్‌కు విచ్చేశాయి. వాటిలో సాఫ్ట్‌వేర్‌తో పాటు హైలెవెల్ కోడింగ్, ఎనలిటిక్స్, కన్సెల్టింగ్, కోర్ ఇంజినీరింగ్ కంపెనీలు, బ్యాంకింగ్/ ఫైనాన్స్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లాంటివి ఉన్నాయి. ఈ కంపెనీలు తమకు అవసరాలను కావాల్సిన విద్యార్థు లను ఎంపిక చేసుకున్నాయి.
ఈ ఏడాది మొదటిఫేజ్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, మిక్రాన్ టెక్నాలజీ, ఉబర్, హానీవల్, ఎక్స్‌ల్,తో పాటు పలు పెద్ద కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ లో పాల్గొన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రొఫెసర్ ఎ రాజకుమార్ చైర్మన్, కేరీర్ డెవలెప్మెంట్ సెంటర్ ఐఐటి ఖరగ్ రిక్రూట్మెంట్ చేసిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. భవి ష్యత్తులో కూడా మన సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.