Courtesy : twitter.com/Paul Everitt
జంతువులు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.. కానీ ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినట్లు, వాణిశ్రీ కోసం అక్కినేని ప్రేమనగర్ కట్టినట్లు, జంతువుల కోసం ఓ గ్రామాన్నే నిర్మించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే నేనున్నాను అంటూ ముందుకు వస్తాడు పాల్.. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ పౌరుడు తనకు అత్యంత ప్రియమైన ఉడతలు, ఇతర జంతువుల కోసం ఓ గ్రామాన్నే నిర్మించాడు. వాటిని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటూ మురిసిపోతున్నారమురిసిపోతున్నాడు. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..
ముచ్చటేసి.. మురిసిపోయి..
ఇంగ్లాండ్ దేశంలోని గ్రీమ్స్ బీ ప్రాంతానికి చెందిన పాల్ మొదటినుంచి జంతు ప్రేమికుడు. ఈ మూగ జీవి ని చూసిన తన నేస్తం గా భావించి మురిసిపోతుంటాడు. వాటితో సరదాగా ఆడుకుంటూ సందడి చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల తాను నివాసం ఉండేందుకు మూడు పడక గదులు ఉన్న ఓ బంగళాను కొనుక్కున్నాడు. అక్కడ ఏపుగా పెరిగిన చెట్లను తొలగించే క్రమంలో అక్కడ ఉడతలు నివాసం ఉండడం గమనించాడు. 10 ఉడతల తో పాటు, 8 నక్కలు, పలు పక్షులతో పాటు ఒక బ్యాడ్ జర్ అక్కడ నివాసం ఉండడం ప్రత్యక్షంగా చూశాడు. దీంతో వాటిని అక్కడే స్వేచ్ఛగా నివాసం ఉండేలా చూడాలని తీర్మానించుకున్నాడు. తీర్మానించు కోవడమే కాదు దానిని వెంటనే ఆచరణలో పెట్టాడు.
రక్షణే లక్ష్యంగా..
జంతువులను పెంచుకోవడమే కాదు.. వాటిని రక్షించుకోవడం కూడా ముఖ్యమే. అందుకే తనకు ఉన్న ఖాళీ స్థలంలో జంతువుల కోసం ఒక గ్రామాన్ని నిర్మించాలని సంకల్పిం చుకున్నాడు. ఇందులో భాగంగా ఉడతలు నివాసం ఉండేందుకు చిన్న చిన్న గదులు, అవి స్వేచ్ఛగా తిరిగేందుకు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేశాడు. 18 నెలల పాటు శ్రమించి వాటి కోసం ఒక మినీ గ్రామాన్నే ఏర్పాటు చేశాడు. అవి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లేందుకు ఓ టవర్ నిర్మాణం కూడా ఏర్పాటు చేశాడు. మొదటినుంచి జంతు ప్రేమికుడైన పాల్ అడవిలో జంతువులతో స్నేహం చేసి స్వేచ్ఛగా జీవించే వాడు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు వాటికి దూరంగా ఉన్నాడు.
జంతువుల ప్రియనేస్తం పాల్
తాజాగా అతని ఇంట్లోనే జంతువులకు స్థిరనివాసం ఏర్పాటు చేసి తన మమకారాన్ని చాటుకున్నారచాటుకున్నాడు. తన పెరటిలో ఒక అందమైన తోట ని ఏర్పాటు చేసి జంతువులను స్వేచ్ఛగా తిరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాడు. వాటికి అన్ని రకాల వసతులు కల్పించాడు. ప్రస్తుతం అతని నీడలో జంతువులు స్వేచ్ఛగా తన జీవితాన్ని గడుపుతూ ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. మూగ జీవుల పై అతనికి ఉన్న ప్రేమ అతని సన్నిధిలో ఉన్న జంతువులకు స్వర్గసీమగా మారింది.