collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / Hot Topic: పెళ్లయింది … పిల్లలు లేరు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

Hot Topic: పెళ్లయింది … పిల్లలు లేరు

2022-01-12  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

couples (2)
కల్లు మానండోయ్ బాబూ.. కళ్లు తెరవండోయ్’ అని మన ఫ్రీడం స్ట్రగుల్ (అంటే మన దేశ స్వాతంత్య్రపోరాటం అని ఇప్పటివాళ్లకు చెప్పాలనుకుంటా) రోజుల్లో పాట పాడేవారు. అలా ఇప్పుడు కొందరు ‘పెళ్లి మానండోయ్ బాబూ, కళ్లు తెరవండోయ్’ అని రీమిక్స్ చేసి పాడుతున్నారు. ఈమధ్య దీనికే మరో ట్విస్ట్ కూడా యాడ్ అయింది. ఆస్ట్రేలియాలో, మన దేశంలో కొన్ని చోట్ల పెళ్లికాని ప్రసాద్ లు డే బై డే ఎక్కువవుతున్నారు. ఏ ముస్తఫా కూడా ఏం చేయలేడు. మగాళ్లు ఎక్కువ, అమ్మాయిల నంబర్ తక్కువ - ఇదీ ప్రాబ్లెం.

ఈ సమస్య ఇలా ఉంటే దక్షిణ కొరియాలో పెళ్లయినవాళ్లు ఓ వింత సమస్యతో బాధపడుతున్నారు. ఈమధ్య పెళ్లయిన కొత్త కపుల్ స్ లో (అంటే ఓ రెండేళ్లు గడిచినా) దాదాపు సగం మందికి పిల్లలు లేరు. ఈ సమాచారాన్ని అక్కడి ప్రభుత్వ డేటానే వెల్లడిస్తోంది. కొంతకాలంగా అక్కడ బర్త్ రేట్ తగ్గింది. పైగా సామాజిక జీవన విధానాల్లో మార్పులూ ఇందుకు కారణమంటున్నారు.

2020 కంటే అయిదేళ్ల ముందు పెళ్లి చేసుకున్న 1.18 మిలియన్ జంటల్లో (11 లక్షల 80 వేలు) 44.5 శాతం మందికి పిల్లలు పుట్టలేదట. అంత క్రితం ఏడాది వరకు ఏటా 42.5 శాతం ఉండే ఈ నంబర్ ఇప్పుడు 44.5 శాతానికి పెరిగిందని కొరియా  గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారిలో కొత్తగా పెళ్లయిన వాళ్లూ ఉన్నారు. అంతకు ముందు నుంచే దేశంలో ఉన్న నూతన దంపతులూ ఉన్నారు.  

కొత్తగా పెళ్లయిన జంటల్లో పిల్లలున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2015లో వీరి సంఖ్య 64.5 శాతం కాగా, 2016 లో 63.7, 2017లో 62.5, 2018లో 59.8 శాతం ఉంది. దక్షిణ కొరియా జననాల రేటు పడిపోతోంది. జనాభా పెరగడం ఓ సమస్యగా మారుతోంది. పెళ్లి చేసుకోవడం, లేదా పెళ్లి కావడం ఆలస్యం కావడం, పెళ్లయ్యాక ఏదోక కారణంతో విడిపోవడం, ఆర్థిక ఇబ్బందులు, మారుతున్న సామాజిక విధి విధానాలు ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు.

గత ఏడాది ఎన్నడూ లేనంతగా దేశంలో జననాల రేటు ( పిల్లలు కనే స్త్రీలు) 0.84 శాతానికి  కు పడిపోయింది. దక్షిణ కొరియా జనాభా నికరంగా 52 మిలియన్లు. ఇప్పుడది నిలకడగా లేదు. వరసగా మూడో ఏడు కూడా టోటల్ ఫర్టిలిటీ రేటు ఒక శాతం కన్నా తక్కువ ఉంది. స్వంత ఇంటి అంశం కూడా జననాల మీద ప్రభావం చూపుతోంది. కొత్త జంటల్లో పిల్లలు కనేవారిలో సొంత ఇల్లున్న వారు 0.76 శాతం కాగా ఇల్లు లేనివారు 0.62 శాతం. ఇల్లు ఉన్న వారిలో లోన్ తీసుకుని కట్టుకున్నవారు 87.5 శాతం. ఈ సంఖ్య ఏటా 18.3 శాతం పెరుగుతోంది. సొంత ఇంటికి పెరుగుతున్న రేట్లు కూడా ముఖ్య అవరోధంగా మారుతున్నాయి. కొత్తగా పెళ్లయిన జంటల్లో ఏడాది ఆదాయం తగ్గడం, కరోనా వల్ల ఉద్యోగాలు పోవడం కూడా జననాల సంఖ్య తగ్గడానికి కారణాలుగా మారాయి.



2022-01-12  Lifestyle Desk