collapse
...
Home / అంతర్జాతీయం / న్యూజిలాండ్ లో త్వరలో సిగరెట్ అమ్మకాలపై బ్యాన్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

న్యూజిలాండ్ లో త్వరలో సిగరెట్ అమ్మకాలపై బ్యాన్

2021-12-16  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

cigar
 

‘పొగతాగడం హానికరం’ అని అన్నిచోట్లా చెబుతుంటారు. టీవీలో సినిమా చూస్తుంటే, ఆ మూవీలో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే వెంటే స్క్రీన్ కిందివైపు -ఈ నినాదం కనబడుతుంది. థియేటర్లలో, రైళ్లల, బస్సుల్ల, బయట కొన్ని చోట్లా, సిగరెట్ ప్యాకెట్ల మీద … ఇలా అన్నిచోట్లా ఇదే స్లోగన్. కానీ సిగరెట్ తాగడం మానేస్తున్నారా? తాగేవాళ్లు ఎక్కువవుతున్నారు. సేల్స్ పెరుగుతున్నాయి. వద్దన్నది చేయడం అందరికీ అలవాటుకదా. అందుకే న్యూజిలాండ్ ప్రభుత్వం ఏకంగా స్మోకింగ్  అమ్మకాలపై నిషేధం విధించబోతోంది.

కఠిన చర్యలు 

ప్రస్తుతం న్యూజిలాండ్ లో 15 ఏళ్లు పైబడిన వారిలో 11.6 శాతం మంది సిగరెట్లు తాగుతున్నారు. అలాగే మావోరీ అనే ప్రాంతంలో పొగతాగే పెద్దవాళ్ల సంఖ్య 29 శాతం పెరిగిందని ప్రభుత్వ ఫిగర్స్ చెబుతున్నాయి. దాంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలనుకుంటోంది. యువకులు తమ లైఫ్ టైంలో ఎప్పుడూ కూడా సిగరెట్లు కొనకుండా నిషేధం విధించాలని అనుకుంటోంది. సిగరెట్ పరిశ్రమను దెబ్బతీసే ఈ నిర్ణయం  ప్రపంచంలోనే కఠినమైన అణచివేతల్లో ఒకటి కావచ్చు. పొగ తాగడం తగ్గించడానికి తీసుకునే మరే చర్య అయినా సుదీర్ఘకాలంలో మాత్రమే ఫలితమిస్తుందని అంటున్నారు.

 అమ్మకాలపై ఉక్కుపాదం 

50 లక్షల మంది జనాభా ఉండే ఈ పసిఫిక్ దేశంలో 2027లో 14 ఏళ్లు, అంతకు తక్కువ వయసున్న పిల్లలు ఎన్నడూ సిగరెట్లు కొనేందుకు అనుమతించకూడదనేది ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఒకటి.అలాగే అనుమతి పొందిన రీటైలర్లు కూడా పొగాకు వస్తువులను అమ్మకూడదు. తయారీదారులు తమ ఉత్పత్తుల్లో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించాలి. ‘యువకులు పొగతాగడానికి అలవాటు పడకూడదని మా ఉద్దేశం. కాబట్టి యుక్తవయసులోకి అడుగుపెట్టేవారికి పొగాకు ఉత్పత్తుల్ని అమ్మడం లేదా సప్లై చేయడాన్ని నేరంగా పరిగణించే చట్టం చేస్తాం’ అని న్యూజిలాాండ్ అసోసియేట్ ఆరోగ్యమంత్రి ఆయేషా వెరల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా చేయకపోతే మావోరీలో పొగతాగేవారి సంఖ్య 5 శాతం కంటే తక్కువ కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. చూస్తూ చూస్తూ  ప్రజల్ని అలా గాలికి వదిలేమలేమని కూడా చెప్పారు.

2022లో పార్లమెంట్ లో బిల్లు 

వచ్చే ఏడాది అంటే 2022లో పార్లమెంటులో బిల్లు తెచ్చే ముందు ప్రభుత్వం రాబోయే నెలల్లో మావోరి హెల్త్ టాస్క్ ఫోర్స్ ను సంప్రదిస్తుంది. 2022 చివరినాటికి చట్టం తీసుకురావాలని అనుకుంటోంది. క్రమంగా 2024 నాటికి అథరైజ్ డ్ సెల్లర్స్ సంఖ్యను దశలవారీగా  తగ్గించడం, 2025 నాటికి నికోటిన్ అవసరాల్ని తగ్గించడం, 2027 నుంచి పొగాకు నుంచి దూరంగా ఉంచే తరాన్ని తయారు చేయడం న్యూజిలాండ్ ప్రభుత్వ ఆలోచన. ఈ చర్యలు న్యూజిలాండ్ పొగాకు పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్నే చూపుతాయి. పొగాకుపై కఠిన ఆంక్షలున్న దేశాల్లో భూటాన్ తో పాటు న్యూజిలాాాాాాండ్ కూడా చేరిపోతుంది. భూటాన్ లో సిగరెట్ అమ్మకాల్ని పూర్తిగా నిషేధించారు. సిగరెట్స్ ను ప్లెయిన్ ప్యాకింగ్ చేసే విధానాన్ని న్యూజిలాండ్ పొరుగున ఉన్న ఆస్ట్రేలియా 2012లో ప్రవేశపెట్టింది. అయితే, ప్లెయిన్ ప్యాకింగ్, అమ్మకాలపై లెవీ విధించడం వంటి చర్యల వల్ల పొగాకు వాడకం తగ్గిందే కానీ, అనుకున్న లక్ష్యం సాధించాలంటే కఠిన చర్యలు తప్పవని న్యూజిలాండ్ ప్రభుత్వం చెప్పింది. స్మోకింగ్ వల్ల ప్రతి ఏటా న్యూజిలాండ్ లో 5,000 మంది చనిపోతున్నారు. అయిదు మంది స్మోకర్స్ లో నలుగురు 18 ఏళ్ల కంటే ముందే స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
 2021-12-16  News Desk