collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / కోహ్లీ-రోహిత్ వైరం.. ఇది ఏ తీరాలకు చేరేను... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

కోహ్లీ-రోహిత్ వైరం.. ఇది ఏ తీరాలకు చేరేను...

2021-12-15  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share linkRohit Virat
Courtesy: twitter/ICC

టీమిండియాలో గతంలో ఎన్నడూ లేని విపరీత పరిస్థితులు నెలకొంటున్నాయి. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీరోహిత్ శర్మల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉందన్న వార్తలు వస్తుండగా.. దానిని బలపరిచే సంఘటలు చోటు చేసుకుంటుండడం చూస్తుంటే అవి నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాలో విభేదాలు తలెత్తడం ఇటు బిసిసిఐకి అటు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంతో విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని  కథనాలు వెల్లువెత్తాయి. అంతేగాక వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమవుతున్నట్టు వార్తలు కూడా వినవచ్చాయి. రో హిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు కోహ్లి ఇష్టపడడం లేదని అందుకే అతను సౌతాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడని మంగళవారం పలు జాతీయ వార్తా సంస్థల్లో కథనాలు గుప్పుమన్నాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి భారత్ వెళ్లిపోతాడని అవి పేర్కొన్నాయి.

ఇద్దరి విభేదాలు ఎక్కడికి దారి తీస్తాయి..?

అంతేగాక భవిష్యత్తులో కూడా కోహ్లి వన్డేలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని మరికొన్ని వార్త సంస్థలు కథనాలు వెలువరించాయి. భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లి జీర్ణించుకోలేక పోతున్నాడనితనను ఉన్న ఫళంగా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అతను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసిం ది. అందుకే బోర్డుకు ఝలక్ ఇచ్చేందుకు కోహ్లి సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే విరాట్ కోహ్లి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాను వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్టు అతను వెల్లడించలేదు. అయినా కూ డా జాతీయ మీడియాలో అతను తప్పుకుంటున్నట్టు వార్తలు రావడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. రానున్న రోజుల్లో పలు కీలకమైన టోర్నమెంట్‌లు, సిరీస్‌లు జరుగనున్న నేపథ్యంలో ఇద్దరు సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలు తలెత్తడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సమస్య తీవ్రంగా మారక ముందే బిసిసిఐ పెద్దలు దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ నిర్ణయమే కారణం....?

బిసిసిఐ దక్షిణాఫ్రికా టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించడమే కాకుండా వన్డేలకు కూడా రోహితే కెప్టెన్సీ వహిస్తాడని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది కోహ్లీకి ఏ మాత్రం రుచించలేదని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు రోహిత్ కు కండరాలు పట్టేడయంతో మూడు టెస్టుల సిరీస్ కు అతడు దూరమయ్యాడు. వన్డే సిరీస్ లో తప్పకుండా ఆడాలన్న ఉద్దేశంతోనే రోహిత్ విశ్రాంతి తీసుకుని అప్పటికల్లా సిద్ధం కావాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ సీరిస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడనే వార్తలు రావడంతో ఇరువుని నడుమ విభేదాలు నిజమేననిఅసలు జట్టులో ఏం జరుగుతోందని అభిమానులను ప్రశ్నలు వేధిస్తున్నాయి. గతంలోనే రోహిత్ కు డిప్యూటీ పగ్గాలు అప్పజెప్పకుండా తనకు సన్నిహితులైన కెఎల్ రాహుల్రిషబ్ పంత్ లలో ఒకరిని ఆ స్థానంలో నియమించాలని కోహ్లీ పట్టుబట్టాడని కథనాలు వినిపించాయి. జట్టులో రోహిత్ ప్రాధాన్యాన్ని కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని అతని అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఏది ఏమైనా బోర్డు మాత్రం హిట్ మ్యాన్ రోహిత్ వైపే మొగ్గు చూపింది. 

వాటిల్లో నిజం లేదు.. కోహ్లీ ఆడతాడు : బిసిసిఐ

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్లు వస్తున్నవార్తలపై బిసిసిఐ స్పందించింది. ఆ వార్తలన్నీ నిరధారాలని కొట్టిపారేసింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. కోహ్లీ వన్డే సిరీస్ లో తప్పకుండా ఆడతాడని పేర్కొంది. అయితే ఈ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడతాడా లేడా అన్నది దానిపై ఇంకా స్పష్టత రాలేదని బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది. రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు కోహ్లీ ఇష్టపడడం లేదని వచ్చిన వార్తల్లో నిజాలు లేవని, దానికి సరియైన ఆధారాలు కూడా లేవని పేర్కొంది. కొన్ని మీడియా గ్రూపులు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నాయని ఆరోపించింది. కోహ్లీరోహిత్ నడుమ విభేదాలు ఉన్నాయన్నది కూడా నిరాధారమేనని బిసిసిఐ తెలిపింది. కోహ్లీ కూడా బిసిసిఐపై ఎలాంటి అసంత`ప్తిలో లేడని స్పష్టం చేసింది. దానికి సంబంధించి కోహ్లీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారికి ప్రకటన కూడా చేయలేదని గుర్తు చేసింది. 

 2021-12-15  Sports Desk