స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి బాగం పూర్తయి ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సింగిల్స్ కు బ్రహ్మాండమన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ టేకింగ్, బన్నీ మాస్ మేకోవర్, రష్మిక గ్లామర్ అపీరెన్స్, దేవీశ్రీ సంగీతం.. ‘పుష్ప’ సినిమాకి మూలస్థంభాలుగా నిలవబోతున్నాయి.
యూ / ఏ సర్టిఫికెట్ జారీ
మరో రెండు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ కోలాహలం మొదలవబోతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు గురవడం గమనార్హం. ‘పుష్ఫ’ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలకి కోత విధిస్తూ కొన్ని అభ్యంతరకర సంభాషణల దగ్గర మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు వారు సూచించారు. ఇంతకీ పుష్పలో అలాంటి సన్నివేశాలు, సంభాషణలు ఏమున్నాయో తెలుసుకుందాం..
ప్రతీ సినిమా ప్రారంభంలో మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఓ యాడ్ వస్తుంది. ఇది ప్రతి సినిమాకి సర్వసాధారణం. అయితే సినిమాలో అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ వార్నింగ్ తో కూడిన టెక్స్ట్ ని డిస్ ప్లే చేస్తూ కొన్ని మధ్యం బ్రాండ్స్ ను బ్లర్ చేయాలి. ఓ సీన్ లో వినిపించే ఒక బూతు డైలాగ్ ను మ్యూట్ చేయమన్నారు. మరో సీన్ లో ఇంకో బూతు డైలాగ్ దగ్గర మ్యూట్ చేయాల్సి వచ్చింది.
ఓ సన్నివేశంలో ఒకరి చెయ్యి కట్ అయ్యే సన్నివేశాన్ని కూడా బ్లర్ చేయాలని సూచించారు. ఒక హింసాత్మక సన్నివేశంలో ఎక్కువ బ్లడ్ కనిపించకుండా బ్లర్ చేయమన్నారు. పుష్పరాజ్ ఓ పోలీసాఫీసర్ తో డ్రగ్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చే లం... క అనే డైలాగ్ ను మ్యూట్ చేయమన్నారు. మొత్తం మీద ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ.. అవసరం మేరకు సుకుమార్ కొన్ని సన్నివేశాల్లో రక్తం చిందించి.. హింసాత్మక సన్నివేశాల్ని రాసుకోక తప్పలేదు. అనసూయ, ఫహద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, శత్రు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
సెస్సార్ కత్తెర
మొత్తానికి ఈ పుష్ప చిత్రం రక్తచందనమే అన్న రేంజ్ లో సుకుమార్ తెరకెక్కించినట్లు సెన్సార్ బోర్డ్ వారు కొన్ని మ్యూట్లు చెప్పక తప్పలేదు. మరి ఫస్టాఫ్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి సుకుమార్ సెకండాఫ్ పై ఆధారపడి ఉంటుంది. కానీ సెకండాఫ్ తీయాలని ఆల్రెడీ సుక్కు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు. కాకపోతే ఈ సారి సెకండాఫ్ తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కేర్ తీసుకుని మరి సెకండాఫ్ తెరకెక్కిస్తారు.