collapse
...
Home / ఆధ్యాత్మికం / ప్రత్యేక పూజలు / తిరుప్పావై రెండ‌వ పాశురం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

తిరుప్పావై రెండ‌వ పాశురం

2021-12-17  Spiritual Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Statue-Hinduism-Figure-Indian-Krishna-Spirituality-3045554 (3) (1)
 

మొదటి పాశురంలో గోపిక‌లు తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారోఈ వ్ర‌తానికి సాయపడువారు ఎవరోఆ వ్రతమును చేయ‌డానికితమకు ఏమి అధికారమో వివరించారు.ఆ. ఏ వ్ర‌తం చేయాల‌నుకున్నా ఆ వ్రతం యొక్క నియ‌మాలు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. ఆచరించాలి. తాము ఆ వ్ర‌తాన్ని చేయ‌గ‌ల‌మా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే నియ‌మాలు క‌ష్టం గా ఉన్నాయ‌ని మ‌ధ్య‌లో వ్ర‌తాన్ని వ‌దిలివేస్తే న‌లుగురిలో న‌వ్వుల‌పాలుకాక త‌ప్ప‌దు.అందుక‌ని గోదాదేవి చెలులం దరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత ఆ వ్రత నియమాలను రెండ‌వ‌ పాశురంలో వివరించింది. మ‌రి ఆ నియ‌మాల‌ను తెలుసుకోండి. 

పాశురం 2       

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు 

శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్ 

పైయత్తుయిన్ఱ పరమనడి పాడి 

నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి 

మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్ 

శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్ 

ఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి 

ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ 

భావ‌ము       

భగవంతుని దర్శించుటకు వెళ్ళేవాళ్లు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అని చెబుతోంది గోదాదేవి. శ్రీకృష్ణుడు అవతరించిన కాల‌ములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభవిస్తున్న‌ వారలారాఈ తిరుప్పావై వ్రతం కొరకు మేము ఏర్ప రుచుకున్న వ్రత నియమాలు వినండి. ముందుగా పాలసముద్రంలో నిద్రిస్తున్న‌ శ్రీహరి  పాదపద్మములకు మంగళము పాడుదాము. ఆ పాద‌ప‌ద్మాల‌ను స్తుతిస్తే చాలు క‌డుపు నిండిపోతుంది. ఇక నెయ్య‌పాలు మ‌న‌కు అక్క‌ర్లేదు. అందుచేత ఈ వ్రతం ఆచరించు సమ యంలో నేతినిపాలనుగాని తీసుకోము. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేసి కళ్లకు కాటుక ధరించక కేశములకు పరిమళా న్ని ఇచ్చేపూలను ధరింపకుండా ఉందాము. మా పెద్దలు విడిచిపెట్టమ‌ని చెప్పిన‌ చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలు కానీ అసత్యాలు ఎప్పుడు గానిఎక్కడా గానీ మాట్లాడము. ఇతరులకు హాని కలిగించేకష్టములు కలిగించే పను లనుగానిఆలోచనలు గాని చేయము. మహాత్ములైన వారిని సేవించి వారిని ధనధాన్యాలతో సత్కరిస్తాము. 

బ్రహ్మచారులకుబిక్షువులకు ఆహారాన్ని అందిస్తాము. ప్ర‌తిరోజు ఆ భగవంతుని గుణాల‌ను కీర్తిస్తూ ఈ సంసార బంధనాలనుండి విము క్తి పొంద‌డం ఎలా అనేదాని గురించి ఆలోచిస్తాం..శాస్త్రము కంటే కూడా ,  భక్తి ప్రధానమైంది. భగవంతుని కృప‌గురు కృప చాలా ముఖ్య మైన వని భావిస్తాము. అవి ఉంటే చాలు మ‌నం సుల‌భంగా ఈ వ్ర‌తాన్ని పూర్తిచేయ‌గ‌ల‌ము.  దేవతలు మనపై కోపించినప్పుడు గురువు మనకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాడు. కాని గురువుకు కోపం వస్తే మనను రక్షించేవాడు లేడు. అందుకే గురువును బ్రహ్మవిష్ణుమహేశ్వరులతో సమానంగా భావించాలని పెద్దలు చెప్పారు. కాబ‌ట్టి మ‌నం ఆ గురుకృప‌ను పొందుదాము. విశ్వానికంత‌టి కీ గురు వైన శ్రీకృష్ణుడిని శ‌ర‌ణువేడుదాము. శ్రీకృష్ణునిసేవకే అంకిత‌మైత‌న‌కు తాను ఆ శ్రీకృష్ణుడి సొంతమని భావించిన ఆండాళ్ తల్లి ఈ పాశు రంలో ఈవిధంగా వ్రత నియమాలు చెప్పింది. 2021-12-17  Spiritual Desk