మొదటి పాశురంలో గోపికలు తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారో , ఈ వ్రతానికి సాయపడువారు ఎవరో , ఆ వ్రతమును చేయడానికి తమకు ఏమి అధికారమో వివరించారు.ఆ. ఏ వ్రతం చేయాలనుకున్నా ఆ వ్రతం యొక్క నియమాలు తప్పనిసరిగా తెలుసు కోవాలి. ఆచరించాలి. తాము ఆ వ్రతాన్ని చేయగలమా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే నియమాలు కష్టంగా ఉన్నా యని మధ్యలో వ్రతాన్ని వదిలివేస్తే నలుగురిలో నవ్వుల పాలు కాక తప్పదు. అందుకని గోదాదేవిచెలులందరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత ఆ వ్రత నియమాలను రెండవ పాశురంలో వివరించింది.
మార్గళిత్తింగళ్మదినిఱైన్దనన్నాళాల్
నీరాడప్పోదువీర్పోదుమినోనేరిళైయీర్
శీర్మల్గుమాయ్ప్పాడిచ్చెల్వచ్చిఱుమీర్కాళ్
కూర్వేల్ - కొడున్దొళిలన్నన్దగోపన్కుమరన్
ఏరార్న్దకణ్ణియశోదైయిళశింజ్గమ్
కార్మేనిచ్చెంగళ్కదిర్మదియమ్బోల్ముగత్తాన్
నారాయణనేనమక్కేపఱైదరువాన్
పారోర్పుగళప్పడిన్దేలోరెమ్బావాయ్ !
భావం
సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైనగోపికలారా , మార్గశీర్షమాసం ఎంతో మంచిది .వెన్నెలలు కురిపిస్తుంది .చాలా మంచి రోజులివి . శూరుడైననందగోపుని కుమారుడు ,విశాలనేత్రుడగు యశోదకు బాలసింహమువంటివాడును , నల్లనిమేఘము వంటి శరీరమును కలిగిఉండి ,చంద్రునివలె ఆహ్లాదకరుడును , సూర్యునివలె తేజోమయుడునుయైన నారాయణునేతప్పు , యితరములను కోరని మనకు ఆస్వామి వ్రత మునకు కాలవసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు . కావునదానికి అనుకూల మైన మార్గళిస్నానము చేయుకోరికగలవారందరును ఆలసింప క తొందర గారండనిశ్రీగోదాదేవితోటిక న్నెలంద రినీ ఆ హ్వానిస్తోంది .
గోపికలు ఈవ్రతము చేయుటకు అనుకూలమగుకాలము మనకు లభించినదేఅని ,ఆకాలమునుముందుగాపొగుడుచున్నారు .ఈవ్రతము చేయుటకు తగినవారెవరో నిర్ణయించుకొంటున్నారు . ఈవ్రతముచేసి , తాము పొందదగిన ఫలమూమిటో , దానిని పొందడానికి కావలసిన సాధనా మేమిటో అని అనుకుంటూ ఈపాశురమునుపాడుచు ఆనందిస్తున్నారని భావం . .