కేటలిస్ట్, గెట్ బెటర్ ఎట్ గెటింగ్ బెటర్ వంటి బెస్ట్ సెల్లర్ బుక్స్ రచించిన చంద్రమౌళి వెంకటేశన్ మూడో పుస్తకం ట్రాన్స్ ఫామ్ ఆయన పాంక్రియాటిక్ కేన్సర్ తో చనిపోవడానికి కొద్ది రోజుల ముందే పూర్తయింది. ప్రజలు తమ కెరీర్ లను మరింత మెరుగ్గా ఎంచుకునేందుకు, వాటిలో ముందుకు సాగేందుకు మార్గదర్శి గా ఉండాలనే కోరికతో ఒక సిరీస్ గా రాయదల్చుకున్న పుస్తకాల్లో భాగంగా తాజా పుస్తకం రూపుదిద్దు కుంది. పెంగ్విన్ ప్రచురించిన ఈ కొత్త పుస్తకంలో మౌలి – పీపుల్ మేనేజ్ మెంట్- అనే కీలక నైపుణ్యం గురించి వివరించారు. ఎదిగేందుకు, మెరుగుపడేందుకు అదెంతో ముఖ్యమో తెలిపారు.
ఏషియన్ పెయింట్స్, ఒనిడా, మాండలెజ్ (గతంలో క్యాడ్ బరీ), పిడిలైట్ వంటి వివిధ రకాల కంపెనీల్లో 29 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం కలిగిన మౌళి తన అనుభవాన్ని అంతా రంగరించి ఈ పుస్తకం రాశా రు.
చక్కటి నాయకులుగా ఉండాలి....
తన సుదీర్ఘ కెరీర్ లో మౌళి పరిశ్రమ ఏదైనా సరే, పీపుల్ మేనేజ్ మెంట్ నైపుణ్యాలు సార్వత్రిక ఆవశ్యకత అని, ఎదగడంలో అవెంతో కీలకమనే అంశాన్ని గుర్తించారు. ఉన్నత స్థానాల్లో ఉండాల్సిన వారు సాంకేతి కంగా సమర్థులుగా లేదా అత్యంత సృజనాత్మకంగా ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఆయన గుర్తించారు. కాకపోతే వారు చక్కటి నాయకులుగా, మేనేజర్లుగా ఉండడం వారిని పీపుల్ మేనేజ్ మెంట్ లో సమర్థులుగా చేస్తుందని అంటారు. జీవితంలో, పనిలో విజయం సాధించేందుకు అవసరమైన నాలుగు కీలక అంశాల్లో పీపుల్ మేనేజ్ మెంట్ ఒకటని ఆయన అంటారు.
మనం తరచుగా పీపుల్ మేనేజ్ మెంట్ ను ‘లీడర్స్’, ‘మేనేజర్స్’ తీసుకునే చర్యలుగా భావిస్తాం. మనంలో చాలా మందిమి ఏదో ఒక రోజుకు ‘లీడర్స్’ కావాలని కోరుకుంటాం. మౌళి రచనా శైలి మిమ్మల్ని పునరాలోచించేలా చేస్తుంది. నాయకత్వం, మేనేజ్ మెంట్ రెండూ కూడా స్వాభావికంగా ఒకటే కాదనే విషయం మీకు అర్థమయ్యేలా చేస్తుంది.
‘లీడ్ అండ్ మేనేజ్’
ఈ పుస్తకం మౌళి నిర్వహించే ‘లీడ్ అండ్ మేనేజ్’ అనే డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఆధారంగా రూపుదిద్దు కుంది. మనలో ఉన్న కొన్ని అపోహలను దూరం చేయడం దీని లక్ష్యం. ‘‘లీడర్లు’’ అంటే సీఈఓ వంటి నాయకత్వ స్థానాల్లో ఉండే వారు మాత్రమే లాంటి అపోహలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. మీ రోల్ ఎలాంటిదైనా కూడా లీడ్, మేనేజ్ రెండూ ఏకకాలంలో జరగాలని ఆయన సూచిస్తారు.
తన పాఠకుల కోసం మౌళి అభివృద్ధి చేసిన ప్రాక్టికల్ వర్క్ ప్లాన్ అనేది ట్రాన్స్ ఫామ్ ను ఒక వైవిధ్యభరిత, విశిష్ట పుస్తకంగా మార్చింది. పుస్తకంలో ఉన్న కొన్ని సరళమైన ఎక్సర్ సైజ్ లను చేయడం ద్వారా మీరు వివిధ ప్రవర్తనాపూర్వక, చర్య ఆధారిత మార్పు మీ కెరీర్ లో చోటు చేసుకోవడం చూస్తారు.
ఈ పుస్తకం గురించి ఈపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీ ఆనంద్ కృపాలుమాట్లాడుతూ, ‘‘నాకు గల అ త్యుత్తమ రిపోర్టీస్ లో మౌళి ఒకరు. పీపుల్ మేనేజ్ మెంట్ పై దృక్పథాలను అర్థం చేసుకునేందుకు ఇది తో డ్పడుతుంది. యువ మేనేజర్లు తమ కార్పొరెట్ నిచ్చెన మెట్లను వేగంగా ఎక్కేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ పుస్తకం మీపై దీర్ఘకాలం నిలిచి ఉండే ముద్ర వేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. దీన్ని చదివిన వారు తమ కెరీర్ ను వేగవంతం చేసుకుంటారని కూడా భావిస్తున్నాను’’ అని అన్నారు.
బిట్సోమ్ డీన్ డాక్టర్ రంజన్ బెనర్జీమాట్లాడుతూ, ‘‘మీ కింద పని చేసే వారు ఎదిగేలా చేస్తూ మీరు ఎలా ఎ దుగుతారు? సీఈఓగా, హెచ్ ఆర్ గా కూడా పని చేసిన మౌళి దీని గురించి చక్కగా వివరించారు. స్ప ష్టంగా, సరళంగా, పాటించేందుకు వీలుగా ఉండే సూచనలున్నాయి. ప్రస్తుత నాయకులకు, నాయకులుగా కావాలనుకునే వారికి ఇది ఒక తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం’’ అని అన్నారు.
నాయకత్వం, మేనేజ్ మెంట్ పై ఓ సమగ్ర పుస్తకం ట్రాన్స్ ఫామ్. కార్పొరెట్ విజయాలను సొంతం చేసు కునే అవకాశాలను అందించే ముఖ్యమైన భావనలెన్నో ఇందులో ఉన్నాయి.
స్టోర్స్ లో, ఆన్ లైన్ లో లభ్యం.
హార్డ్ కవర్ |నాన్ ఫిక్షన్ |వెల రూ.399