6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / పుష్ప సినిమాలో 10 ప్లస్సులు 5 మైనస్సులు

పుష్ప సినిమాలో 10 ప్లస్సులు 5 మైనస్సులు

2021-12-17  Entertainment Desk

PUSHPA REVIEW
Courtesy : twitter.com/DirectorMaruthi

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సందడి చేస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. కేరింతలతో హోరెత్తుస్తున్నారు. పుష్ప సినిమాపై కొందరు సినిమా విమర్శకులు పెదవి విరుస్తున్నారు. హిట్ సినిమాయేగానీ బ్లాక్ బస్టర్ మూవీ కాదని చెబుతున్నారు.  పలు సినిమా వెబ్ సైట్లలో పుష్ప సినిమాపై వచ్చిన రివ్యూలను 6టీవీ వెబ్ సైట్ పరిశీలించింది. వాటి ఆధారంగా పుష్ప ది రైజ్ సినిమా గురించి పలువురు సినిమా విమర్శలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం.

పుష్ప ది రైజ్ సినిమాలో ప్లస్ పాయింట్లు     

(1) దర్శకుడు సుకుమార్ టేకింగ్ క్యారెక్టర్లను డిజైన్ తీరు చాలా బాగుందని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు.    యాక్షన్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు కొందరు ట్వీట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడని విజయదేవరకొండ ట్వీట్ చేశాడు.

(2) పుష్ప లో సమంత ఐటెమ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని దాదాపు అన్ని సినిమా వెబ్ సెట్లు తమ రివ్యూలలో పేర్కొన్నాయి. ఊ అంటావా అనే    ఈ సాంగ్ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ సాధించింది. ఆ పాట పాడిన అమ్మాయి ఇంద్రావతి చౌహాన్ చాలా అద్భుతంగా పాడితే..అదే రేంజ్ లో సమంత చేసిన డాన్సులు మంచి ఊపు తెప్పించేలా ఉన్నాయి. థియేటర్లలో ఈ సాంగ్ వచ్చే సమయంలో విజిళ్ల మోత మ్రోగుతూనే ఉంది. ఈ పాటతో పాటు దాక్కో దాక్కో మేక శ్రీ వల్లి పాటలు కూడా ఆకట్టుకున్నాయని దాదాపుగా అందరూ అంగీకరిస్తున్నారు. 

(3) కథానాయకుడిని ఎలివేట్ చూస్తూ తీర్చిదిద్దన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బన్నీ అభిమానులను మరింత విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

(4) ఓ సాధారణ కూలీగా ఉండే పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేటును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడని తెరకెక్కించిన    విధానం చాలా అద్భుతంగా వచ్చందని పలు సినిమా వెబ్ సైట్లు పేర్కొన్నాయి.

(5) ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా ఉందని దాదాపు అన్ని సినిమా వెబ్ సైట్లు పత్రికలు చెబుతున్నాయి.

(6) శ్రీవల్లిగా డీ గ్లామరైజ్ పాత్రలో రష్మిక యాక్టింగ్ చాలా సహజంగా ఉందని దాదాపు అన్ని వెబ్ సైట్లు పేర్కొన్నాయి.

(7) విలన్ క్యారెక్టర్ చేసిన సునీల్ అద్భుతంగా నటించాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మంగళం శ్రీను పాత్రను చాలా హార్డ్ వర్క్ చేసి తనను తాను మలుచుకున్నాడు. నటన  డైలాగ్ డిక్షన్ విషయంలో సునీల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

(8) పోలీసు అధికారి క్యారెక్టర్ చేసిన మళయాలం హీరో ఫహద్ ఫజిల్ తన నటనాకౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా సెకండ్ హాప్ లో వచ్చే ఈ క్యారెక్టర్ సినిమాను అలరించే అంశాల్లో ఒకటి. చివరి 20 నిమిషాల్లో అల్లు అర్జున్ ఫహద్ ఫజిల్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయని సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.

(9) టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా మరో లెవెల్ లో ఉందని పలు సినిమా వెబ్ సైట్లు చెబుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ కూబా పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఓ ప్రముఖ తెలుగు వెబ్ సైట్ పేర్కొంది.   

(10) సినిమా చూసిన తర్వాత    పుష్పరాజ్ పాత్రకు అల్లు అర్జున్ తప్ప మరింకెవరూ ఆ పాత్ర చేయలేరని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆ పాత్రలో అల్లు అర్జున్ అంతలా మమేకం అయ్యాడు. చిత్తూరు జిల్లా మాండలికంలో అల్లు అర్జున్ పలికిన డైలాగులు చాలా నేచురల్ గా ఉన్నాయి. పుష్ప సినిమా అల్లు అర్జున్ సినిమాలలో ది బెస్ట్ అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో మైనస్ పాయింట్ల గురించి చూస్తే..     

(1)       సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా ఉండగా..సెకండాఫ్ మాత్రం కొంత స్లో గా ఉంది.

(2)       అల్లు అర్జున్ రష్మికల మద్య చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు సరిగా ఆకట్టుకోలేకపోయాయని కొన్ని ఫిల్మ్ వెబ్ సైట్లు అభిప్రాయపడ్డాయి.

(3)       ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన  BGM ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొన్నిచోట్ల బాగుంటే చాలా చోట్ల ఆకట్టుకోలేకపోయిందని కొందరు                   చెబుతున్నారు.

(4)       అనసూయ క్యారెక్టర్ ఇంకా కాస్త బెటర్ గా ఉండాల్సిందని కొన్ని ఫిల్మ్ రివ్యూస్ పేర్కొన్నాయి.

(5)        ప్రేక్షకుడు ఊహించిన విధంగాగా సినిమా ఉంది. పెద్దగా ట్విస్టులు లేకపోవడం ఓ పెద్ద మైనస్ అని చాలా మంది భావిస్తున్నారు.

   

 


2021-12-17  Entertainment Desk