collapse
...
Home / ఆరోగ్యం / కాస్మటిక్ / బట్టతలకు కాస్మొటిక్ చికిత్స - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telu...

బట్టతలకు కాస్మొటిక్ చికిత్స

2021-12-18  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Old-Bald-Back-M (3) (1)
 

సాధారణంగా స్త్రీ పురుషులలో జుట్టు ఊడిపోవడానికి జన్యు పరమైన కారణాలు ఉంటాయి. బట్టతల దాదాపు 95 శాతం మందిలో వంశపారంపర్యంగా వస్తుంటుంది. మిగిలిన 5 శాతం మందికి ఆహారం, మానసిక ఒత్తిడి, అనారోగ్యం వంటి పలు అంశాలు కారణమవుతాయి.

జుట్టు ఊడిపోవడానికి కారణాలు : 

ముఖ్యంగా మందులు, విటమిన్లు, ఇతర ఐరన్, ప్రొటీన్ల వంటి ఖనిజ సంబంధిత మందులు వాడడం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది. రక్త పోటు, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి, గౌట్ వంటి వ్యాధులకు వాడే మందులు వల్ల, కేన్సర్ పేషెంట్లకు చేసే రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. గర్భ నిరోధక మందులు వాడకం వల్ల  మహిళల్లో జట్టు ఊడిపోవడం జరుగుతుంది. అలాగే థైరాయడ్, మాడుపై తీవ్రమైన ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.  మహిళల్లో ప్రసవం తర్వాత  శరీరంలో వచ్చే  మార్పుల వల్ల కొంతకాలంపాటు జుట్టు ఊడిపోతుంది.  కొన్ని సందర్భాల్లో పెద్దల్లోనూ, చిన్న పిల్లల్లోనూ తలపైన, కనుబొమ్మలు, కంటి రెప్పలపైన కూడా జుట్టు ఊడిపోతుంటుుంది.

జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు చికిత్సలు : 

వంశపారంపర్యంగా వచ్చే బట్టతలకు(జుట్టు రాలకుండా ఉండేందుకు) ఎఫ్ డిఏ ఆమోదించిన కొన్ని మందులను ఉపయోగిస్తారు. రోగైన్ అనే సొల్యూషన్ ను బట్టతల ప్రదేశంలో రుద్దడం ద్వారా 10 నుంచి 14 శాతం మందిలో కొంతమేర ఫలితం కనబడిందని తెలుస్తోంది. అలాగే ప్రొపేసియా అనే మాత్రను డాక్టర్ పర్యవేక్షణలో  మాత్రమే వాడాలి. దీనిని కొంతకాలంపాటు మానకుండా వాడడం వల్ల మాత్రమే అనుకున్న ఫలితాలు వస్తాయి.

ఇవి గాక మైక్రో గ్రాఫ్టింగ్, స్లిట్, పంచ్ గ్రాఫ్టింగ్ విధానాల ద్వారా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తారు. అలాగే తలపై ఉన్న చర్మాన్ని తీసి అతికించడం వంటి ప్రక్రియల ద్వారా కూడా చికిత్స అందిస్తారు. అయితే పేషెంట్ ఆరోగ్య,మానసిక స్థితిని బట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు.

కొంతకాలంగా జుట్టు రాలడం వ్యాధికి పీఆర్పీ ( ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా)అనే విధానం వాడుకలో ఉంది.  ఈ విధానంలో రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్ లెట్స్ ను వేరు చేస్తారు. ప్లాస్మాను నెత్తిమీద జుట్టు లేని ప్రాంతలో ఇంజెక్ట్ చేస్తారు. దాదాపు రెండేళ్ళ పాటు చేయడం వల్ల  రక్త నాళాలు బలపడతాయి. ఈవిధానంలో తక్కువ దుష్ఫలితాలతో సురక్షితమైందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవే గాక మరికొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి.

జుట్టు మార్పిడి ( హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్) ఎవరు చేయించుకోవచ్చు : 

జన్యుపర కారణాలతో బాధపడే మహిళలు, సాధారణంగా  కనబడే బట్టతల  పురుషులు, తలపై గాయాలు, అగ్ని ప్రమాదాల్లో జుట్టు కాలిపోయినవారు ఈ చికిత్సను పొందవచ్చు.

ఎవరు చేయించుకునే వీలు లేదు : 

జుట్టు మార్పిడి చేసేందుకు తగినంత జుట్టు లేకపోవడం, విపరీతంగా జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు ఉన్న మహిళలు. రేడియేషన్, సర్జరీ, కాలిన మచ్చలు ఉన్న వాళ్ళు చికిత్స చేయించుకునే వీలు లేదు.

హెయిర్ గ్రాఫ్టింగ్ లేదా ట్రాన్స్ ప్లాంటేషన్ 

డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో అవుట్ పేషెంట్ గా ఈ విధానంలో చికిత్స చేస్తారు. మైక్రో గ్రాఫ్టింగ్ లో ఒకటి రెండు, స్లిట్ గ్రాఫ్టింగ్ లో నాలుగైదు, పంచ్ గ్రాఫ్టింగ్ లో 10, 15 వెంట్రుకల చొప్పున అతుకుతారు. ఇందులో 30 నుంచి 40 వెంట్రుకలు అతికించే విధానం కూడా ఉంది. ఈ చికిత్సా సమయంలో జుట్టు కింద ఉన్న చర్మం తీసేటప్పుడు, అతికించేటప్పుడు ఆ ప్రదేశంలో మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. పేషెంట్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా సాధారణంగా మత్తు ఇస్తారు.

చికిత్స ఎలా చేస్తారు : 

ముందుగా డెర్మటాలాజికల్ సర్జన్ జుట్టు ఉన్న ప్రదేశం నుంచి చర్మాన్ని తీసి ముక్కలుగా కత్తిరించి వాటిని ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ అతికిస్తారు. దీనివల్ల సహజసిద్దంగా జుట్టు ఉన్నట్టు కనబడుతుంది. ఆ తర్వాత చర్మం తీసిన ప్రదేశాన్ని కుట్టు వేసి గాయాన్ని మానుకునేలా  అవసరమైతే బ్యాండేజీ వేస్తారు.

ఈ చికిత్సా విధానానికి దాదాపు రెండు నుంచి నాలుగు నెలలు పడుతుంది.  దీని వల్ల ఏర్పడే చిన్నచిన్న దుష్ప్రభావాలు  ఒకటి నుంచి మూడు వారాల్లోపే తొలగిపోతాయి.  వాటిలో ముఖ్యంగా  కళ్ళ పరిసరాల నొప్పులు, వాపులు, నెత్తిమీద చర్మం తీసిన, అతికిన చోటు నొప్పితో పాటు స్పర్శ లేకపోవడం, దురద వంటి లక్షణాలు కనబడతాయి.  

నెత్తి మీద చర్మం తీయడం వల్ల దుష్ప్రభావాలు : 

పంచ్ గ్రాఫ్ట్టింగ్ విధానం తర్వాత కన్నా సర్జరీ (స్కాల్ప్ రిడక్షన్) జరిగిన తర్వాత కొద్దిగా నొప్పి వస్తుంది.  తలనొప్పి కూడా రావచ్చు.  నాన్ యాస్పిరిన్ ఆధారిత మందులను ఈ నెప్పి నివారణకు వాడొచ్చు.  కొంతకాలం పాటు నెత్తి మీద చర్మం పట్టేసినట్టు గా అనిపించడం కూడా కద్దు.
 2021-12-18  Health Desk