6tvnews

collapse
...
Home / ఆరోగ్యం / న్యూరో / Back Pain: ప్రయాణాలు చేయలేకపోతున్నారా ....ఇలా చేసి చూడండి

Back Pain: ప్రయాణాలు చేయలేకపోతున్నారా ....ఇలా చేసి చూడండి

2022-01-09  Health Desk


back pai (2) (1)

బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది         
మంచి సీటు కోసం సాధ్యమైనంత ముందుగానే    మీ విమాన ప్రయాణ టిక్కెట్ బుక్ చేసుకోండి.    విండో సీటు కాక దాని పక్క సీటును ఎంచుకోండి. దీనివల్ల మీరు తేలిగ్గా నిలబడడం , అటూ ఇటూ తిరగడానికి కానీ వీలుగా ఉండడమేగాక పక్కవారిపై వాలనవసరంలేకుండా ఉంటుంది.    

ప్రయాణాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. చెక్ ఇన్ పాయింట్లు , సెక్యూరిటీ వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లలో నిలబడనవసరం లేని సమయంలో ప్రయాణాలు చేయండి. వారాంతాల్లో కాకుండా వారం మధ్య రోజుల్లో రద్దీ తక్కువగా ఉండడం వల్ల క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండనవరం లేదు. ఫ్లైట్ నిర్ణీత సమయానికన్నా ముందుగానే ఎయిర్ పోర్ట్ కు చేరుకొండి.    రోడ్ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు రద్దీ సమయాలకంటే ముందే బయలుదేరండి. సౌకర్యవంతంగా , తేలిగ్గా సెక్యూరిటి చెక్ వంటి వాటిని దాటేందుకు ముందుగానే ఎయిర్ పోర్ట్ లో సహాయపడేందుకు ముందుగా    హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోంది. మీతోపాటు ఎవరైనా విమానాశ్రయంలో సహాయపడేందుకు వస్తే వారికి ముందుగానే పాస్ తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మీ డాక్టర్ నుంచి    ఒక రిపోర్ట్ వివరాలు దగ్గర ఉంచుకోండి.    

మీరు తరచూ ప్రయాణాలు చేసే వారైతే    ప్రీ చెక్ ను ఉపయోగించుకోవడం వల్ల ఎటువంటి అవాంతరాలు , ఇబ్బందులు ఉండవు.    సెక్యూరిటీ పాయింట్ లో మీరు షూ , బెల్ట్ , లైట్ జాకెట్ వంటివి విప్పకుండా ఫింగర్ ప్రింట్ వేయడం ద్వారా    ఎ యిర్ పోర్ట్ లో    సెక్యూరిటీ    చెక్ త్వరగా జరుగుతుంది. మీ ప్రయాణంలో బస చేసే హోటల్స్ లో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు , మీకు అవసరమైన సహాయానికి సంబంధించిన వివరాలు ముందుగా తెలుసుకోండి.    

ఎయిర్ పోర్ట్ లో అవసరమైతే వీల్ చెయిర్ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఇందుకు సహాయకులు    సేవలందిస్తారు. మీ లగేజీ అంతా ఒకే    పెద్ద బ్యాగులో కాకుండా    రెండు , మూడు చిన్నచిన్న బ్యాగుల్లో    సర్దుకోండి. దూర ప్రయాణాలు విసు గ్గా ఉండొచ్చు. రోడ్    ప్రయాణం చేసేటప్పుడు విశ్రాంతిగా ఉండేలా రెస్ట్ స్టాప్స్ లో ఆగండి. విమానంలో కానీ , రైలు , బస్సులోకానీ ప్రయాణిస్తే    ప్రతీ 20, 30 నిమిషాలకు లేచి నిలబడి అటూ ఇటూ తిరగండి. మీరు బ్యాక్ పెయన్ తో బాధ పడుతున్న విషయాన్ని ఫ్లైట్ అటెండెంట్ కు గానీ బస్    డ్రైవర్ కు గానీ తెలియజేయండి.    

ఏకబిగి ప్రయాణాలతో ఇబ్బందులు     

దూర ప్రయాణం చేసేటప్పుడు ఏకబిగిన ఒకే ఫ్లైట్ , రైలు , బస్ లో ప్రయాణం చేయడం వల్ల బ్యాక్ పెయిన్ మరింత బాధి స్తుంది. సాధ్యమైనంతవరకు కనెక్టింగ్ ఫ్లైట్స్ , రైళ్ళు , బస్సులు పట్టుకుని ప్రయాణించడం మేలు. బయలుదేరేటప్పుడు హీట్ రాప్స్ , కోల్డ్ ర్యాప్స్ , నెప్పి నివారణ క్రీములు వంటి వాటికి సంబంధించి కిట్ ను రెడీ చేసుకోండి. అలాగే ఒక చిన్న దిండును , దుప్పటిని వెంటతీసుకు వెళ్ళడం ఎంతో ఉపకరిస్తుంది.    పొట్టిగా ఉన్నట్టయితే మీకు ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ వల్ల కూర్చోవడం సౌకర్యంగా ఉంటుంది.    

వైద్య చిట్కాలు     

మీరు ప్రయాణం చేసే ప్రతీసారీ మీతో పాటు మీరు ఉపయోగించే మందులన్నింటినీ తీసుకెళ్ళండి. ఎక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ముందుగా తెలియదు కనుక అవసరమైన రోజుల కంటే మరికొన్ని రోజులకు సరిపడా మందులను తీసుకెళ్ళండి. వీటిని ఒరిజినల్ కంటైనర్లలో తీసుకెళ్ళడం వల్ల సెక్యూరిటీ వద్దకానీ కస్టమ్స్ చెకింగ్ పాయింట్ల    వద్ద ఎటువంటవి సమస్యలు ఉండవు. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంచాల్సిన మందులైతే ముందుగానే మీ రూమ్ లో ఫ్రిజ్ ఉండేలా ఏర్పాటు చేయాలని మీ హోటల్ వారికి ముందుగా చెప్పండి.    

మీ ప్రయాణానికి సంబంధఇంచి ముందగానే ఒక మ్యాప్ తయారుచేసుకోండి. ఒకరోజు ఎక్కువ కష్టపడాల్సి వస్తే మరు సటి రోజు విశ్రాంతి ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీ పర్యటన స్థలాలకు సంబంధించి బస్సులు , ఫ్లైట్ వివరాలు తెలుసు కోవడం వల్ల ఎక్కువ శ్రమలేకుండా ఉంటుంది.    
మీరు ప్రయాణం చేసే సమయానికి ఎటువంటి ఆలోచనలు , సమస్యలు లేకుండా చూసుకోండి. మీ పర్యటనలో ఆరోగ్య రీత్యా మీ అవసరాలను మీ హోటల్ వారికి ముందుగా చెప్పడి.    అవసరమైతే స్పా , మసాజ్ వంటి    ట్రీట్ మెంట్ ఏర్పాట్లు చేయాలని కోరండి. పుస్తక పఠనం , వీడియోలు చూడడం , సంగీతం వినడం ద్వారా నొప్పినుంచి మీ దృష్టిని మరల్చుకో వచ్చు.    

ప్రయాణంలో డీహైడ్రేట్ అవకుండా ఎక్కువగా నీరు తాగండి. మంచి నిద్రకు ఉపక్రమించండి. ఇందుకు సంబంధించి మీకు అవసరమైనవన్నీ తీసుకు వెళ్ళండి. మీ డాక్టర్ ముందుగానే మీ ఆరోగ్యానికి సంబంధించి సూచనలు చేసి ఉంటారు. వాటిని పాటించండి.రెంటల్ కార్ కంపెనీలు కూడా మనకు వీలుగా ఉండే వాహనాలను ఏర్పాటు చేస్తారు. ముందుగా వాకబు చేయండి.    

ఏ దేశం , రాష్ట్రం , నగరానికి సంబంధించిన సమాచారం అయినా వెబ్ సైట్లలో కావల్సినంత సమాచారం అందుబాటులో ఉంటోంది. అందువల్ల అవసరమైన వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే పూర్తి సమాచారం లభిస్తుంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల సుఖవంతమైన ప్రయాణం చేయగలుగుతారు.    

 


2022-01-09  Health Desk