శారీరక దారుఢ్యం కోసం వర్కౌట్లు చేయడం ఇష్టం లేదా ..? వాటితో విసిగి పోయారా? అయితే ఇలా ట్రై చేయండి. కొద్ది సేపు డ్యాన్స్ చేయండి,వర్చువల్ గా టెన్నిస్, బాస్కెట్ బాల్ వంటి ఇతర ఆటలు ఆడండి. ఒక అధ్యయనం ప్రకారం..వాకింగ్, రన్నింగ్, ప్రత్యేక మ్యాట్ పై ఫాంటసీ రోల్ గేమింగ్ వంటి ఎక్సర్ సైజులు చేస్తే అంతే సమయం ట్రెడ్ మిల్ పై గడిపిన దానికంటే ఎక్కువ ఎక్సర్ సైజ్ చేసినదానితో సమానమని తేలింది.
ఒకేసారి రెండు పనులు చేయడం ద్వారా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటున్నారా .. చాలా సులభం ఇలా చేసి చూడండి. మీ కారును కడిగి వాక్సింగ్ చేయడం, కాలవలు, నేలను శుభ్రపర్చడం వంటి మితంగా శారీరక వ్యాయామంగా పనులు చేయడం ద్వారా కారు, ఇల్లు శుభ్రంగా ఉండడమే గాక మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అలాగే దాదాపు అరగంట పాటు తోటపని చేయడం వల్ల కూడా చక్కటి వ్యాయామం చేసినట్టు అవుతుంది. దీనికి సొంత గార్డెన్ ఉండనక్కర్లేదు కమ్యూనిటీ గార్డెన్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
అలాగే ఒంటరిగా కానీ, లేక ఏదైనా ఫంక్షన్లలో కానీ మంచి సంగీతం వింటూ సరదాగా డ్యాన్స్ చేయడం వల్ల కూడా కండరాలకు మంచి వ్యాయామం జరిగి గుండె, ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. నీ తోటి వారితో నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత వ్యాయామం జరిగినట్టు అవుతుంది. అయితే ఒకరిద్దరి కంటే ఎక్కువైతే మాత్రం ఆశించిన ఫలితం ఉండదు.
మీ ఆసక్తి మేరకు ఏదైనా ఆటల పోటీలో పాల్గొనడం, టీం సభ్యులతో కలిసి ప్రాక్టీస్ చేయడం వంటి వాటిల్లో పాల్గొనడం ద్వారా ఎక్సర్ సైజ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోగలుగుతారు.
అవుట్ డోర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమ్స్
బయటికి వెళ్ళి ఏదైనా లీగ్ పోటీల్లో పాల్గొనడం ఇష్టం లేకపోతే పార్క్ కు, క్రీడా మైదానాలకు వెళ్ళి అక్కడ ఆటల్లో పాల్గొనండి.
వేడి లేక చల్లటి వాతావరణాలను భరించలేరా.. బాస్కెట్ బాల్,రాకెట్ బాల్,వాలీ బాల్ వంటి ఇండోర్ గేమ్స్ ఆటల ద్వారా కూడా చెమటోడ్చవచ్చు. అంతేగాక స్విమ్మింగ్, సాకర్, టెన్నిస్ ఆడడం వంటివి చేయడం వల్ల చక్కటి వ్యాయామం చేసినట్టవుతుంది.
మధ్యమధ్యలో 20 సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ పరుగుతీయడం, సైకిల్ తొక్కడం వల్ల దాదాపు 50 నిమిషాల పాటు జాగింగ్ చేసిన ఫలితం కనబడుతుంది. మీ డాక్టర్ సలహా మేరకు విశ్రాంతి తీసుకునే సమయాలను నిర్ణయించుకోండి. మీ యౌవన దశలో ఉత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ బ్యాటింగ్ కేజ్ లో ఆడవచ్చు. బంతిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. నీకు తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది. అయితే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి.
పార్క్ లో మీ తోటి వారితో నడుస్తూ మాట్లాడండి. మెయిల్స్ పంపడం కన్నా ఇది చాలా ఉత్తమం. రన్నింగ్ ఇతర స్పోర్ట్స్ కన్నా కరాటే, తైక్వాండ్, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మరక్షణకే గాక మెదడు ఎంతో చురుకుగా పనిచేస్తుంది. ఈ కళలు క్వాలిఫైడ్ ఇన్ స్ట్రక్టర్ వద్ద మాత్రమే ట్రైనింగ్ తీసుకోవాలని మర్చిపోవద్దు.