collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / మ‌హిళా జ‌ట్టుకో న్యాయం.. ? పురుషుల జ‌ట్టుకు మ‌రో న్యాయ‌మా ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu Ne...

మ‌హిళా జ‌ట్టుకో న్యాయం.. ? పురుషుల జ‌ట్టుకు మ‌రో న్యాయ‌మా ?

2021-12-18  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

PlayBoldVk18

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) తీసుకున్న ఓ నిర్ణ‌యం ఇప్పుడు యావ‌త్ క్రికెట్ అభిమానుల‌ను నివ్వెర పోయేలా చేసింది. ప్ర‌పంచ అత్యుత్త‌మ క్రికెట‌ర్ల‌లో ఒక‌డైన విరాట్ కోహ్లీని అటు వ‌న్డేఇటు టీ 20 జ‌ట్టు కెప్టెన్‌గా తొల‌గించ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో బీసీసీఐ పాత్ర కంటే కోహ్లీ స్వ‌యంకృతాప‌రాధ‌మే ఆయ‌న కొంప‌ను ఎక్క‌వ‌గా ముంచింద‌నే వాద‌నా విన‌బడుతున్న‌ది. టీ 20 జ‌ట్టు కెప్టెన్‌గా తాను కొన‌సాగ‌లేన‌నీకుటుంబానికి ఎక్కువ స‌మ‌యం ఇచ్చేందుకే తానీ నిర్ణ‌యం తీసుకున్నానంటూ విరాట్ ప్ర‌క‌టించాడు కూడా. కాగా అతడు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌గానే. టీ 20 ఒక్క‌టే కాదువ‌న్డే ఫార్మాట్ నుంచి కూడా త‌ప్పుకోండంటూ బీసీసీఐ చెప్ప‌టంతో అతడు అవాక్కయ్యాడు. త‌న‌కు మాట మాత్రం కూడా చెప్ప‌కుండా బీసీసీఐ ఇలాంటి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌టం ప‌ట్ల ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొద్ది గంట‌ల ముందే త‌న‌ను పిలిచి. ఈ నిర్ణ‌యాన్నిప్ర‌క‌టించేస‌రికి అత‌డు తీవ్ర నిరాశ‌కు గురైన మాట వాస్త‌వం.


దాదాపై విమర్శల వాన

ఈ ఎపిసోడ్ మొత్తంలో మీడియా ఆసాంతం. బీసీసీఐ అధ్య‌క్షుడుమాజీ కెప్టెన్దాదా సౌర‌వ్  గంగూలీపై దుమ్మెత్తి పోసింది. కావాల‌నేఉద్దేశ‌పూర్వ‌కంగానే విరాట్‌నుగంగూలీ ప‌క్క‌న పెట్టారంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పించారు. దాదా మాత్రం ఈ వ్య‌వ‌హారంలో త‌న పాత్రేమీ లేద‌నీసెల‌క్ష‌న్ క‌మిటీ అభిప్రాయం ప్ర‌కార‌మే కోహ్లీని. వ‌న్డేటీ 20 నుంచి ప‌క్క‌న బెట్టార‌ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి నేను ఈ అంశంపై విరాట్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడాను. వైట్ బాల్ ఫార్మాట్లు (వ‌న్డేటీ 20) రెండింటికీ అనేక అంశాల్లో సారూప్య‌త ఉంటుంది. ఈ రెండింటికీ ఎక్కువ దేశాల జ‌ట్ల‌లో ఒక‌డే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తారుఎక్క‌వ మంది ఆట‌గాళ్లు రెండు జ‌ట్ల‌లోనూ ఉంటారు. ప‌రిమిత ఓవర్లే రెండింటిలోనూ ఉంటాయిఅందువ‌ల్ల నువ్వు వ‌న్డేతోపాటు టీ 20లోనూ కొన‌సాగ‌టం ఉత్త‌మమంటూ గంగూలీ స‌ల‌హానిచ్చారు. కానీ ఆ సూచ‌న‌న ప‌ట్టించుకోని కోహ్లీ... టీ 20 బాధ్య‌త‌ల నంచి త‌ప్పుకొన్నాడుదీంతో అనివార్యంగా వ‌న్డే కెప్టెన్సీ నుంచి కూడా అత‌డిని త‌ప్పించారు. టెస్టు జ‌ట్టుకు మాత్రం  కోహ్లీయే కెప్టెన్‌గా ఉంటారంటూ ప్ర‌క‌టించారు.

 

కానీ ఇక్క‌డే ఒక ట్విస్టు దాగుంది. బీసీసీఐ పురుషుల క్రికెట్ ప‌ట్ల ఒక తీరుగామ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ప‌ట్ల వేర్వేరుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు స‌ర్వత్రా విన‌బ‌డ‌తున్నాయి. ఎందుకంటే పురుషుల వ‌న్డేటీ 20 జ‌ట్ల‌కు వేర్వేరు కెప్ట‌న్లుండాలంబూ చెబుతున్న బీసీసీఐ... అందుకు భిన్నంగా మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్ల‌కు మాత్రం పూర్తి వెసులుబాలు నిచ్చింది. ఈ క్ర‌మంలో వారికి సంబంధించిన ఒక జ‌ట్టుకు హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌మ‌రో్ జ‌ట్టుకు మిథాలీ రాజ్ ను కెప్టెన్లుగా నియ‌మించారు. వారి సార‌ధ్యంలోనే ఇప్పుడా జ‌ట్లు న‌డుస్తున్నాయి. అలాంట‌ప్పుడు పురుష‌ల క్రికెట్ టీమ్‌కే ఎందుకిలాంటి నియ‌మ‌నిబంధ‌న‌లు పెడుతున్నారంటూ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా బీసీసీఐ ఈ కోణంలో ఆలోచిస్తే మంచింది.

                2021-12-18  Sports Desk