Courtesy: twitter/PushpaMovie
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తయారైన మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనాన్ని స్మగుల్డ్ చేయడం అనే కాన్సెప్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పార్ట్ 1 పుష్ప: ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న విడుదలైంది.వరల్డ్ వైడ్ గా ఏడు లాంగ్వేజెస్ లో పుష్ప రిలీజైంది. బిగ్గెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజైన బన్నీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. సౌత్ లోనే కాక, అమెరికాలో కూడా పుష్ప బిగ్ హిట్. కలెక్షన్లతో పరుగులు తీస్తోంది. పుష్ప ప్రపంచ బాక్సాఫీసు రికార్డ్స్ క్రియేట్ చేయవచ్చని సినీ పండితులు అంటున్నారు.
2022లో పుష్ప అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.. థియేటర్లో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత పుష్ప ఓటీటీ ప్లాట్ ఫాం పైకి రావచ్చు. ఒకవేళ నాలుగు వారాల తర్వాత అయితే జనవరి 14న, ఆరు వారాల తర్వాత అయితే జనవరి 28న ఓటీటీలో స్ట్రీమ్ కావచ్చని అంటున్నారు. ఈ మూవీ ఓటీటీకి అమెజాన్ ప్రైం మంచి రేటుకు అగ్రిమెంట్ కుదుర్చుకుందని తెలుస్తోంది.