collapse
...
Home / క్రీడలు / బ్యాడ్మింటన్ / కిదాంబి శ్రీకాంత్ సంచలనం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

కిదాంబి శ్రీకాంత్ సంచలనం

2021-12-19  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

jswsports
Courtesy: twitter.com/jswsports

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో సంచలనం నమోదయింది. తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్స్ చేరుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. సెమీస్ లో లక్ష్య సేన్ ను ఓడించాడు. తొలి సెట్ ఓడినప్పటికీ సహనంతో ఆడుతూ తర్వాతి రెండు సెట్లను గెలిచాడు. ఫైనల్స్ లోకి దూసుకుపోయాడు.

1983లో ప్రకాశ్ పదుకొనె, 2019లో సాయి ప్రణీత్ ప్రపంచ ఛాంపియన్ షిప్ సెమీస్ లో ఓటమి పాలయ్యారు. ఫైనల్స్ ఆడే ఛాన్స్ మిస్ అయ్యారు. వీరిద్దరి తర్వాత సెమీస్ ఆడిన శ్రీకాంత్ తన సత్తా చాటి ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. 

శ్రీకాంత్ కు చెమటలు పట్టించిన సేన్

సెమీస్ పోరు చాలా ఆసక్తి కరంగా జరిగింది. 20 ఏళ్ల లక్ష్య సేన్ అద్భుతంగా ఆడాడు. శ్రీకాంత్ కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ ను గెలిచాడు. ఆ తర్వాత రెండు సెట్లలోనూ కూడా గట్టి పోటీ ఇచ్చాడు. నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాడు. తన సీనియర్ అయిన శ్రీకాంత్ ను ముప్పతిప్పలు పెట్టాడు. 



2021-12-19  Sports Desk