collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / బ్రేస్ లెట్స్ ధరిస్తే లాభాలా..? నష్టాలా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telu...

బ్రేస్ లెట్స్ ధరిస్తే లాభాలా..? నష్టాలా?

2021-12-19  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Bracelet-Jewelry (3)
 

ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్స్ తిరిగి మళ్లీ వస్తుంటాయి. పాతవే కొత్తగా సొబగులద్దుకుని తళుక్కుమంటాయి. ఒంటినిండా నగలు వేసుకోవడం సంప్రదాయంగా భావించే వాళ్లు అప్పుడు. ఇప్పుడు కూడా అదే ఫ్యాషన్. సాధారణంగా చాలా మంది బంగారం లేదా వెండితో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తుంటారు.    కానీ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తారు. రాగితో తయారు చేసిన కడియాలు , ఉంగరాలు , బ్రేస్ లెట్స్ ను ధరించడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది. చాలా మంది యువత మెటల్ బ్రేస్ లెట్స్   ను ఎక్కువగా ధరిస్తున్నారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈ మెటల్ బ్రేస్ లెట్స్ ను ధరించేందుకు ఇష్టపడుతున్నారు. మెటాలిక్ జ్యువెలరీని ధరిస్తే ఫ్యాషన్ తో పాటుగా శరీరంపై మంచి ఆరోగ్య ప్రభావం ఉంటుందని అంటారు. శతాబ్దాలకు పైగా ఇవి మన సంస్కృతిలో భాగమయ్యాయి.

పర్ ఫెక్ట్ గా ఉంటేనే ఎంచుకోవాలి.....

మణికట్టుకి బ్రేస్ లేట్ ధరించడమనేది యూనిసెక్స్ ఫ్యాషన్. వీటిని చేతికి పెట్టుకోవడానికి వయస్సుతో కానీ జెండర్ తో కానీ సంబంధం లేదు. ట్రెండీగా స్టైల్ గా కనిపించాలని కోరుకునేవారు ఎక్కువమంది చేతికి బ్రేస్ లెట్ ధరిస్తుంటారు. ఈ బ్రేస్ లెట్లో చాలా మోడల్స్ ఉంటాయి. గోల్డ్ , వెండి , రాగి ఇలా అభిరుచికి తగినట్లుగా మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని చూడగానే బాగుంది కదా అని ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోకుండా...మీకు ఫర్ఫెక్టుగా నప్పేలా ఉన్న బ్రేస్ లెట్ ను ఎంపిక చేసుకోవాలి.

బ్రేస్ లెట్ ఎంపిక చేసుకునే ముందు ఈ అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి

మణికట్టు సైజు..

మీ అభిరుచికి తగ్గట్లుగా బ్రేస్ లెట్ ఎంచుకోవడానికి ముందు మీ మణికట్టు సైజుకి ఎలాంటి బ్రేస్ లెట్ సరిపోతుందో తెలుసుకోవాలి. అంటే బ్రేస్ లెట్ సైజుతో పాటు దాని వెడల్పు , దాని డిజైన్...ఇతర హంగులు , బరువు కూడా మీ చేతికి సరిపోయేలా ఉండాలి. అందుకే మీ చేతి మణికట్టు సైజ్ తెలుసుకోవాలి. 

మణికట్టు సైజ్ ను ఎలా తెలుసుకోవాలి.. 

మీ కుడిచేతిబొటనవేలు ,చూపుడు వేలుతో ఎడమచేతి మణికట్టును పట్టుకోవాలి. బొటనవేలు , చూపుడు వేలు అలా కలిసినట్లయితే మీ చెయ్యి సన్నగా ఉన్నట్లు అర్ధం. రెండు వేళ్లు ఒకదానితో ఒకటి కల్సి మణికట్టుకు వేళ్లకు మధ్య కొంత ఖాళీ ఉంటే మీ మణికట్టు మీడియం సైజు. రెండు వేళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటే మీ మణికట్టు లావుగా ఉన్నట్లు అర్థం.మన మణికట్టును బట్టి బ్రేస్ లెట్స్ ను ఎంపిక చేసుకోవాలి.

బ్రేస్ లెట్స్ తో ఆరోగ్యానికి నష్టమా..లాభమా.. ?

ఇక భారత్ లోనే కాదు  అమెరికాలోనూ ఈ బ్రేస్ లెట్స్ ట్రెండ్ నడుస్తోంది. కాకపోతే వారు ఫ్యాషన్ కోసం కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కోసం బ్రేస్ లెట్స్ ను ఉపయోగిస్తారు. వీటి కోసం మిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తారు.సాధారణ వైద్య సంరక్షణకు ప్రత్యామ్నాయంగా చాలామంది తయారీదారులు వీటిని మార్కెట్లో విక్రయిస్తుంటారు. అయితే ఈ వాదనల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం.

మెటాలిక్ బ్రేస్ లెట్స్ అంటే ఏమిటి ?

మెటాలిక్ బ్రేస్ లెట్స్ను చేతి మణికట్టు లేదా చీలమండపై ధరించే ఆభరణం. ఇది మెటల్ తో తయారు చేస్తారు. ఉదాహరణకు పూర్తి మెటల్ బ్రేస్ లెట్స్ అంటే    రాగి , బంగారం , టైటానియం , వెండి. ఇవన్నీ కూడా ఫుల్ మెటల్ తో తయారు చేస్తారు. మాగ్నటిక్ ( ఆయస్కాంత) బ్రేస్ లెట్స్ మణికట్టు పట్టీలను కూడా మెటల్ తో తయారు చేస్తారు.

మెటాలిక్ బ్రేస్ లెట్స్ ఎందుకు ఉపయోగిస్తారు.. ?

కాపర్ లేదా మాగ్నెటిక్ బ్రేస్ లెట్స్ ...రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించగలవని బ్రేస్ లెట్స్    విక్రయించే కంపెనీలు చెబుతున్నాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

* మెరుగైన రక్తప్రసరణ

*టాక్సిన్ తొలగింపు

* నొప్పుల నివారిణి

* తక్కువ దృఢత్వం

*అదనపు శక్తి

* అనారోగ్యం నుంచి వేగవంతంగా కోలుకోవడం.

పలు రకాల మెటీరియల్స్ తో తయారు చేయబడిన ఈ బ్రేస్ లెట్స్ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని చెబుతుంటారు. ఉదాహరణకు బంగారు కంకణాలు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయని అంటారు.    వెండి కంకణాలు ఇన్ఫెక్షన్లను దూరం  చేస్తాయి , అంతేకాదు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి అని చెబుతారు. వీటన్నింటిలో కామన్ గా ఉండే విషయం ఏంటంటే...వాటిని నిరూపించడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.   

ఒక బ్రిటీష్ అధ్యయనం ప్రకారం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో నాలుగు రాగి కంకణాలతో పాటు మెగ్నటిక్ కంకణాలు నొప్పి నివారణ అంశాలపై పరీక్షించింది. ఐదు నెలల తర్వాత నాన్ మెటాలిక్ రిస్ట్ స్ట్రాప్ ని ఉపయోగించినప్పుడు వాటి కంటే మెటాలిక్ బ్రేస్ లెట్స్ ను ఉపయోగించిప్పుడు వారి ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఎలాంటి ఉపశమనం పొందలేదని అధ్యయనంలో తెలిపింది.

మెటాలిక్ బ్రేస్ లెట్స్...నిజాలు..!

మీరు మెటాలిక్ బ్రేస్ లెట్స్  కొనుగోలు చేసే ముందు  ఈ విషయాలను తెలుసుకోండి.

మెటాలిక్ బ్రేస్ లెట్స్ ధరించడం వల్ల శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. నొప్పి లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు కేవలం మీ మానసిక స్థితిని సర్దుబాటు చేయడంలో ప్లేసిబోలుగా మాత్రమే ఇవి పనిచేస్తాయి. అంతేకానీ అవి నొప్పి తీవ్రతను తగ్గించలేవు.

ఆర్థరైటిస్ తో బాధపడుతున్నతమ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని కొందరు గట్టిగా నమ్ముతారు. కానీ శాస్త్రీయ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. మీకు నమ్మకం ఉన్న వారి వద్ద నుంచే వీటిని కొనుగోలు చేయండి. అయితే ఈ మెటాలిక్ బ్రేస్ లెట్స్ వల్ల శరీరానికి హాని కలిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నకిలీ మెటాలిక్ బ్రేస్ లెట్ ను ధరించినప్పుడు మణికట్టుపై అలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

కొన్ని లోహాలతో తయారు చేసిన బ్రేస్ లెట్స్ మాత్రం మానసిక , శారీరక ప్రయోజనాలు కలిగి ఉంటాయాని చాలా తక్కువ అధ్యయనాల్లో నిరూపితమైంది.

మెటాలిక్ బ్రేస్ లెట్స్ చాలా వరకు ఎలాంటి హాని కలిగించవు. కానీ అవి అందరికీ నప్పవు. ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

మణికట్టుకి బ్రేస్ లేట్ ధరించడమనేది యూనిసెక్స్ ఫ్యాషన్. వీటిని చేతికి పెట్టుకోవడానికి వయస్సుతో కానీ జెండర్ తో కానీ సంబంధం లేదు. ట్రెండీగా స్టైల్ గా కనిపించాలని కోరుకునేవారు ఎక్కువమంది చేతికి బ్రేస్ లెట్ ధరిస్తుంటారు. ఈ బ్రేస్ లెట్లో చాలా మోడల్స్ ఉంటాయి. గోల్డ్ , వెండి , రాగి ఇలా అభిరుచికి తగినట్లుగా మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని చూడగానే బాగుంది కదా అని ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోకుండా...మీకు ఫర్ఫెక్టుగా నప్పేలా ఉన్న బ్రేస్ లెట్ ను ఎంపిక చేసుకోవాలి.



2021-12-19  Lifestyle Desk