collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / వెంట్రుకవాసిలో వెనుకబడిన అదానీ ర్యాంకు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

వెంట్రుకవాసిలో వెనుకబడిన అదానీ ర్యాంకు

2021-12-19  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Gautam_Adani_Net_Worth (1)
ప్రపంచంలోని బిలియనీర్ల సరసన భారతీయ సంపన్నులు కూడా చేరిపోతున్నారు. టాప్‌ 10ర్యాంకు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేరు పడిపోయిందా ఆ సంపన్నుడు ర్యాంకు కాస్తా వెనక్కి పోయినట్లే.       

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ రోజు వారి ర్యాంకింగ్‌ ప్రకటిస్తుంది. తాజాగా శనివారం (డిసెంబర్‌18)న విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీని చైనాకు చెందిన బిలియనీర్‌ హోంగ్‌షాన్‌షాన్‌ వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం వెంటుక్రవాసిలో అదానీ ఒక్క ర్యాంకు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. గ్లోబల్‌ బిలియనీర్‌లలో అదానీ 14వ స్థానం ఆక్రమించారు.    అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు అయిన గౌతమ్‌ అదానీ సంపద 1.53బిలియన్‌ డాలర్లు క్షీణించి 76.3బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరపడింది. అదే సమయంలో షాన్‌షాన్‌ నికర సంపద కూడా తగ్గింది ఆయన సంపద 116మిలియన్‌ డాలర్లు క్షీణించి 77.5బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది.       

దీంతో ఆసియాలో ముఖేష్‌ అంబానీ తర్వాత స్థానం షాన్‌షాన్‌ది రెండవ స్థానం ఆక్రమించారు. మూడో స్థానంలో అదానీ నిలబడ్డారు. అంతకు ముందు ఆసియాలో భారత్‌కు చెందిన ముఖేష్‌ అంబానీ.. తర్వాత స్థానం గౌతమ్‌ అదానీలుండేవారు. స్టాక్‌ మార్కెట్లో షేరు క్షీణించడం వల్ల గౌతమ్‌ అదానీ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అంబానీ విషయానికి వస్తే ఆయన సంపద కూడా 2.14బిలియన్‌ డాలర్లు క్షీణించినా 87.1బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరపడింది. ఆసియాలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని సొంత చేసుకున్నారు.   

తాజా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీయర్‌ ఇండెక్స్‌ ప్రకారం అమెరికాకు చెందిన దక్షిణాఫ్రికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానం అమెజాన్‌కు చెందిన జెఫ్‌బెజోస్‌,ఇక వరుసగా బెర్నాడ్‌ అర్నాల్డ్‌బిల్‌గేట్స్‌ల్యారీ పేజ్‌లు వరుసగా ఒకటి నుంచి ఐదు స్థానాలు ఆక్రమించారు. ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆరవ స్థానంలోసెర్గీ బ్రిన్‌స్టీవ్‌ బల్మార్‌ల్యారీ ఎల్లిసన్‌ తొమ్మిదివారెన్‌బఫెట్‌ పదవ స్థానాన్ని ఆక్రమించారు.       

బ్లూమ్‌బర్గ్‌ జాబితాలో టాప్‌ 20స్థానాల్లో 13మంది అమెరికన్‌లు స్థానాన్ని ఆక్రమించారు. 9వ స్థానంలో ఉన్న అర్నెల్టా ఫ్రెంచికు చెందిన వారు కానీ అమెరికాలో స్థిరపడ్డారు. టాప్‌ 20లో ముఖేష్‌ అంబానీషాన్‌షాన్‌అదానీలతో పాటు ఇతర అమెకరికన్‌యేతరులు ఉన్నారు. వారిలో ఫ్రాన్స్‌కుచెందిన ఫ్రాంకోయిస్‌ మేయర్స్‌ (11)వ స్థానం. మెక్సికోకు చెందిన కార్లోస్‌స్లిమ్‌ (15),స్పెయిన్‌కు చెందిన అమెనికో ఓర్టెగాలున్నారు.       

ఇక మన భారత్‌ విషయానికి వస్తే బ్లూమ్‌బర్గ్‌ జాబితాలో అజీమ్‌ ప్రేమ్‌జీ 33వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంపన్నుల్లో ప్రేమ్‌జీ మూడవ స్థానాన్ని ఆక్రమించారు. అటు తర్వాత స్థానం శివనాడార్‌ 49వ స్థానం. రాధాకృష్ణ దమానీ 64వ స్థానంలక్ష్మి మిట్టల్‌ 91వ స్థానం ఆక్రమించగా.. సెరమ్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు వ్యవస్థాపకుడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సైరస్‌ పూనావాల్‌ 133వ ర్యాంకులో ఉన్నారు. అయితే భారతీయ సంపన్నుల్లో పూనావాలా మాత్రం 20వ స్థానం ఆక్రమించారు. ఇక పూనా వాలా విషయానికి వస్తే కోవిడ్‌ సమయంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి చూస్తే    గ్లోబల్‌ సంపన్నుల జాబితాలో భారతీయులు కూడా తమ సత్తా చాటుతున్నారు. మేరా భారత్‌ మహాన్‌ అని నినదించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.       



2021-12-19  Business Desk