పేటీఎం మినీ యాప్ స్టోర్‌లోని కోవిడ్- 19 వ్యాక్సిన్ ఫైండర్ నుండి వినియోగదారులు WHO-DDCC: VS కంప్లైంట్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన , పేటీఎం కోవిడ్- 19 వ్యాక్సిన్ ఫైండర్ , ప్రజలు వారి టీకా స్లాట్లను బుక్ చేసుకోవడానికి భారతదేశంలోని 1,400 నగరాల్లోని 14,000 పిన్ కోడ్ల నుండి 32 లక్షల వ్యాక్సిన్ బుకింగ్‌లకు వీలు కల్పించింది.
వినియోగదారులు, వ్యాపారుల కోసం భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఎకోసిస్టమ్ పేటీఎం ఈరోజు తన మినీ యాప్ స్టోర్‌లో కోవిడ్- 19 వ్యాక్సిన్ ఫైండర్ ద్వారా పేటీఎం యాప్‌లో అంతర్జాతీయ ప్రయాణ ధ్రువీకరణ పత్రాలను అందించడం ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనితో , వినియోగదారులు WHO-DDCC: VS కంప్లైంట్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను పొందడానికి వారి పాస్‌పోర్ట్ వివరాలను అప్డేట్ చేయవచ్చు. కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ రెండింటి కోసం ప్రయాణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలలో ఆమోదించబడ్డాయి. అయితే , ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ఖరారు చేసుకునే ముందు దేశ-నిర్దిష్ట కోవిడ్- 19 మార్గదర్శకాల కోసం తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన పేటీఎం కోవిడ్- 19 వ్యాక్సిన్ ఫైండర్ వినియోగదారులకు స్లాట్ల లభ్యతను తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. ఇది పిన్ కోడ్లు లేదా జిల్లాల ఆధారంగా స్లాట్ల కోసం తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది. టూల్ ను ఉపయోగించి నేరుగా స్లాట్లను బుక్ చేసుకోవడానికి వినియోగదారులను వీలు కల్పిస్తుంది.ఇది 11 భాషలలో అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారులను 1వ, 2వ డోసులలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.అందుబాటులో ఉన్న టీకా రకం, దానికి విధించే రుసుము వంటి అన్ని రకాల టీకా సంబంధిత సమాచారం పొందేందుకు యాక్సెస్ కల్పిస్తుంది.
ఇప్పటివరకు , పేటీఎం కోవిడ్- 19 వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ద్వారా , భారతదేశంలోని 1,400 నగరాల నుండి 32 లక్షల వినియోగదారుల స్లాట్లు బుక్ చేయబడ్డాయి. పేటీఎం కోవిడ్- 19 వ్యాక్సిన్ ఫైండర్ 100 కోట్ల వ్యాక్సిన్ లభ్యత అలర్టులను అందించింది. 14 లక్షల సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వినియోగదారులకు వీలు కల్పించింది.
ప్లాట్‌ఫామ్‌లోని 85% మంది వినియోగదారులు 18-45 సంవత్సరాల గ్రూపుని ఎంచుకున్నారు. 40% కంటే ఎక్కువ మంది తమ టీకా అపాయింట్మెంట్ను సాయంత్రం 4 గంటల తర్వాత బుక్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ , “మేంఎల్లప్పుడూ మా వినియోగదారులకు ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తాం. అంతర్జాతీయ ట్రావెల్ సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేయడానికి సరికొత్త ఫీచర్ ను అందించడం ఈ దిశలో మరొక అడుగు మాత్రమే. అదనంగా , వినియోగదారులు పేటీఎంలో వారి డిజిలాకర్‌కు వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను కూడా జోడించవచ్చు. మహమ్మారి నుండి మన దేశం సురక్షితంగా మారడంలో సహాయపడటానికి అవసరమైన ఫీచర్లు, సేవలను అందించడానికి మేం మా ప్రయత్నాలను కొనసాగిస్తాం’’ అని అన్నారు.
కోవిడ్- 19 ఉపశమన చర్యల్లో భాగంగా పేటీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలలో కోవిడ్- 19 వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్ ఒకటి. దాని #OxygenForLife కార్యక్రమం కింద , పేటీఎం ఫౌండేషన్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తుంది.