Courtesy: twitter.com/barandbench
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 24న కృష్ణా జిల్లాలో తన స్వగ్రామం పొన్నవరంలో పర్యటించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత రమణ తన స్వగ్రామంలో పర్యటించనుండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ జస్టిస్ రమణ డిసెంబర్ 25న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. డిసెంబర్ 26న జరిగే ఏపీ న్యాయాధికారుల రెండవ సదస్సుకు చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు.