Courtesy: twitter.com/i_tweetu
పరుగుల రాణిపై చీటింగ్ కేసు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉషపై చీటింగ్ కేసు నమోదయింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ఉష తనను మోసం చేసిందని కేరళలోని మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కోజికోడ్ ప్రాంతంలో ఓ బిల్డర్ నుంచి జెమ్మా జోసెఫ్ 46 లక్షలు విలువచేసే ఫ్లాట్ పిటి ఉష హామీ మేరకు ఆ కొనుగోలు చేసింది. వాయిదాల రూపంలో డబ్బులు మొత్తం చెల్లించింది. మొత్తం చెల్లించినా ఇంకా ఆ ఫ్లాట్ తనపేరిన రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో ఆమె పిటి ఉషను సంప్రదించింది. ఆమెకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. వీరిద్దరూ పట్టించుకోక పోవడంతో పోలీసులను ఆశ్రయించింది.