భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ తుది పోరులో తడబడ్డాడు. సింగపూర్ ఆటగాడి చేతిలో 15-21, 20-22 తేడాతో ఓటమి పాలయ్యాడు. సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. సింగపూర్ ప్లేయర్ కియాన్ యో శ్రీకాంత్ పై ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించాడు. రతజ పతకం సొంతం చేసుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
తొలి సెట్ లో ఒక దశలో 9-3 లీడ్ లో ఉన్న శ్రీకాంత్ జోరుకు కియోన్ యో అడ్డుకట్ట వేశాడు. అక్కడ నుంచి శ్రీకాంత్ తడబడ్డాడు. తొలి సెట్ 15-21 తేడాతో కోల్పోయాడు. రెండో సెట్ మరింత పోటా పోటీగా జరిగింది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు 20-22 తేడాతో శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు.
గతంలో భారత తరపున ఆడిన ప్రకాశ్ పడుకొనె(1983), హెచ్.ఎస్. ప్రణయ్(2019), లక్ష్య సేన్ (2021) కాంస్య పతకాలు సాధించారు. BWF పోటీల్లో రజత పతకం సాధించిన ఒకే ఒక్కడు కిదాంబి శ్రీకాంత్ మాత్రమే.