ఒమిక్రాన్ వెరియంట్ వల్ల ముందుగా అంచనా వేసిన దాని కంటే కూడా కూడా భారీ ఎత్తున దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభా వం పడుతుందన్న వార్తలు మార్కెట్లను నిలువునా వణించాయి. దీంతో పాటు ఇటీవల గ్లోబల్ సెంట్రల్ బ్యాంకర్లు ఉద్దీపన పథకాలను ప్రకటించే అవకాశం లేదని పరోక్ష సంకేతాలు ఇవ్వడం.. దీంతోపాటు మన దేశానికి వెన్నుదన్నుగా ఉండే ఎఫ్ఐఐలు క్రమంగా తప్పకుండా తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకుని బయటపడుతున్నాయి. ఈ అంశాలన్నీ కలిసి మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టాయి. సోమవారం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభయ్యాయి.
ఫైనాన్సియల్ రంగానికి చెందిన షేర్లు భారీ నష్టాలకు గురయ్యా యి. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడంతో ఇంట్రాడేలో బీఎస్ఈ ఏకంగా 1,879 పాయింట్లు పడిపో యింది. అయితే మార్కెట్లు ముగిసే నాటికి కాస్తా కోలుకున్నాయి. చివరకు బీఎస్ఈ 1,190 పాయింట్లు నష్టపోయి 55,822 వద్ద స్థిరపడింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ 3.6 శాతం లేదా 2,079 పాయింట్లు నష్టపో యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఇంట్రాడేలో 16,410 మార్కుకు పడిపోయింది. అటు తర్వాత కాస్తా కోలుకుని 371 పా యింట్లు క్షీణించి 16,614 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 10.7 శాతం లేదా 1,900 పాయింట్ల వరకు నష్టపోయింది. కాగా నిఫ్టీ అక్టోబర్ 19న రికార్డు స్థాయిలో 18,604 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు నేల చూపులు చూడ్డానికి ప్రధాన కారణం విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ)లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడం ఒక కారణమైతే.. రెండోది గ్లోబల్ సెంట్రల్ బ్యాంకు ఉద్దీపన పథకాన్ని వాయిదా వేయడం తో పాటు ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే భారత్ మార్కెట్లో షేర్ల ధర ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు తగ్గడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
కొన్ని షేర్ల విలువ ప్రస్తుతం వాస్తవ విలువకు దిగివచ్చాయని... అలాంటి షేర్లను దీర్ఘకాలికానికి పెట్టుబడులు పెట్టవచ్చునని .. ఇలాంటి సమయంలో నాణ్యమైన షేర్లు కొనుగోలు చేసుకోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వినోద్ నాయర్ చెప్పారు. బీఎస్ఈలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో టాటాస్టీల్ అగ్రస్థానంలోఉంది. దీని షేరు ధర ఏకంగా 5 శాతం క్షీణించింది. తర్వాత స్థానంలో ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంకుల షేర్లు భారీగా పడిపోయాయి. ఈ షేర్ల ధర 3-4 శాతం వరకు క్షీణించాయి. హెవీ వెయిట్ షేర్లు లార్సన్ అండ్ టర్బో,రిలయన్స్ ఇండస్ర్టీస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 2.5 శాతం వరకు నష్టపోయిన వాటిలో ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా లాభాలను నమోదు చేసిన షేర్ల విషయానికి వస్తే హిందుస్తాన్ యూనీలీవర్, 1.6 శాతం, డాక్టర్ రెడ్డీస్ ఒక శాతం వరకు లాభపడిన వాటిలో ఉన్నాయి. శ్రీరామ్ ప్రాపర్టీస్ షేరు ఇవాళ మార్కెట్లో కోట్ అయ్యింది. ఇష్యూ ధర రూ.118 కాగా రూ.90 వద్ద లిస్ట్ అయ్యిం ది. ఇష్యూ ధర కంటే 24 శాతం తగ్గింది. బీఎస్ఈలో దీని షేరు రూ.94.35వద్ద ట్రేడ్ అయ్యింది . ఇంట్రాటేలో రూ. 97 కోట్ కాగా రూ.91.75 కనిష్టానికి దిగి వచ్చింది. బీఎస్ఈ... ఎన్ఎస్ఈలో 58 లక్షల షేర్లు చేతులు మారా యి. కాగా శ్రీరామ్ ప్రాపర్టీస్ ఐపీవోలో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లకు మాత్రం నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.