collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / కార్పొరెట్స్ కు ఇక భారీ ప్రోత్సాహకాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

కార్పొరెట్స్ కు ఇక భారీ ప్రోత్సాహకాలు

2021-12-21  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

narendra modi (2) (1)
 

కేంద్రప్రభుత్వం  2021-22 బడ్జెట్‌కు ముందు వివిధ రంగాలకు చెందిన కార్పొరేట్‌ సీఈవోల సంప్రదింపులు మొదలుపెట్టింది.    నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే దేశంలోని ప్రయివేట్‌ రంగానికి చెందిన అతి పెద్ద కార్పొరేట్‌లతో సమావేశం అయ్యారు. బడ్జెట్‌కు సంబంధించిన వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు.    

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద కంపెనీలపై ఉన్న కొన్ని నిబంధనలు సడలిస్తామని హామీ ఇచ్చింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) స్కీం వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి మోదీ టాప్‌ కార్పొరేట్లతో మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి కార్పొరేట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు కల్పిస్తామని తెలిపారు.    గత వారం కూడా ప్రధాని మోదీ అతి పెద్ద ప్రయివేట్‌ ఈక్విటీ/ వెంచర్‌ క్యాపిటల్‌ రంగానికి చెందిన దిగ్గజాలతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడానికి సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరారు.    

కోవిడ్‌- 19 సమయంలో కూడా మనం బలంగా నిలబడ్డాం. మనదేశంలోని పరిశ్రమలు ప్రపంచంలోని టాప్‌- 5 సరసన నిలబడ్డానేది తమ లక్ష్యమని.. దీనికి అందరం కలిసి సమష్టిగా పనిచేద్దామన్నారు ప్రధాని.   

కార్పొరేట్లు ఇచ్చిన సలహాలు సూచనలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలను (పీఎల్‌ఐ)ను సద్వినియోగం చేసుకోవాలని దేశీయ పరిశ్రమ లీడర్లను ప్రధాని కోరారు. తయారీ రంగంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పీఎల్‌ఐ స్కీంను తీసుకువచ్చిందన్నారు.   

వ్యవసాయరంగంపై కార్పొరేట్‌ రంగం పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టాలని ప్రధాని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో పాటు నేచురల్‌ ఫార్మింగ్‌ పై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.   

అనవసర నిబంధనలు తగ్గిస్తాం    

కార్పొరేట్‌లపై అనవసర నిబంధనలు తగ్గించాలని చూస్తున్నామని , ఏ ఏ నిబంధనలు తొలగించాలో సూచనలు ఇవ్వండని ప్రధాని కోరారు. దీంతో పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ప్రధానమంత్రికి పలు సూచనల    నివేదిక అందజేశారు. ప్రధానమంత్రి ముందు చూపుతో తీసుకున్న ఆత్మనిర్బర్‌ భారత్‌కు తమ వంతుసహాయ సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు దేశీయ కార్పొరేట్లు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకుపోతోందని వారు ప్రధానిని ప్రశంసించారు.    కోవిడ్‌- 19 ని అదుపు చేయడంలో ప్రధాని కీలకపాత్ర వహించారని , సరైన సమయంలో విప్లవాత్మకమైన మార్పులుతీసుకువచ్చారని ప్రధానికి కితాబిచ్చారు. అలాగే కార్పొరేట్‌ చీఫ్‌లు ఈజ్‌ డూయింగ్‌ బిజినెస (సులభతర వాణిజ్యం) గురించి చేపట్టాల్సిన అంశాల గురించి కూడా ప్రధానికి పలు సూచనలు చేశారు.    

సంస్కరణలకు పెద్దపీట    

కేంద్రంలో  2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రకాల సంస్కరణలు తీసుకువచ్చింది. వాటిలో సులభతర వాణిజ్యానికి పెద్ద పీట వేయడంతో దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం తయారీరంగాన్ని భారత్‌కు హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీని కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలను (పీఎల్‌ఐ)ని ప్రకటించింది. ఉదాహరణకు ఆటోమొబైల్‌ రంగానికి సెమికండక్టర్స్‌ , సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీలకు ప్రోత్సహకాలు ప్రకటించింది. ఈ ప్రోత్సహకాలు చూసి విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ పెట్టుబడులు పెడతారనేది ప్రభుత్వం ఉద్దేశం.   

భారత్‌ను కాప్‌- 26 లోకి తీసుకువెళ్లడానికి దేశంలోని కార్పొరేట్లు పట్టుదలతో కృషి చేస్తున్నాయన్నారు. టాటాస్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌- 19 తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వీ- షేప్‌ రికవరీ చూస్తున్నామన్నారు. ఇక ఐటీసీ సీఈవో సంజీవ్‌పూరి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ర్టీసీ మరింత బలోపేతం చేయడానికి ప్రధానికి పలు సూచనలు చేశారు.   

ప్రతీ రంగంలో గ్లోబల్ టాప్ 5లో భారత్    

టీసీఎస్‌ సీఈవో రాజేశ్‌ గోపీనాథన్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ప్రధానంగా పరిశోధన , ఇన్నోవేషన్‌పై ఫోకస్‌ పెట్టారని.. ప్రస్తుతం మనం అనుకున్న దాని కంటే ఒక అడుగు వెనుక ఉన్నామని భావిస్తున్నారని ఆయన తెలిపారు. రాజేష్‌ గోపీనాధన్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి మాత్రం దేశంలోని ప్రతి రంగం గ్లోబల్‌ టాప్‌  5 లో ఉండాలని పట్టుదలతో ఉన్నారని పేర్కొన్నారు. సామ్ సంగ్‌ ఇండియా చీఫ్‌ మనుకపూర్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఎగుమతులను ప్రోత్సహించడానికి పీఎల్‌ఐని తీసుకువచ్చారన్నారు. కొటక్‌ మహీంద్రా బ్యాంకు సీఈవో ఉదయ్‌ కొటక్‌ మాట్లాడుతూ.. భారతీయ వ్యాపారవేత్తలు , పరిశ్రమ , భారతీయ బ్యాంకింగ్‌ రంగంతో పాటు ఫైనాన్షియల్‌ సక్టార్‌ ఇక ఎలాంటి ఆందోళన చెందకుండా వ్యాపారాలను మరింత అభివృద్ది పథంలో ఎలా తీసుకువెళ్లాలోఆలోచించాలన్నారు. భారత్‌ ఆర్థికంగా మరింత బలపడే సత్తా ఉందన్నారు కొటక్‌.. దేశంలోని అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి భారతీయ బ్యాంకులు సిద్దంగా ఉన్నాయని ఆయన అన్నారు.    

ఈ కార్యక్రమంలో ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఈక్విప్‌మెంట్‌ సీఎండీ మల్లికా శ్రీనివాసన్‌మారుతి సుజుకి ఇండియా ఎండీసీఈవో కెనిచి ఆయుకవారెన్యూపవన్‌ సీఎండీ సుమంత్‌ సిన్హాఓయో సీఈవో రితేష్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు. వీరు కూడా తమ తమ అభిప్రాయాలను ప్రధాని వివరించారు. కాగా నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1, 2022పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఏప్రిల్‌ 1, 2022నుంచి కొత్త బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది.    2021-12-21  Business Desk