భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను టాటా గ్రూపు గత అక్టోబర్‌లో టేకోవర్ చేసుకుంది. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఈ టేకోవర్‌ను ఆమోదించింది. కాగా టాటాగ్రూపు ప్రత్యేకంగా టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అత్యధికంగా బిడ్‌వేసి ఎయిర్ ఇండియాను దక్కించుకుంది.
ప్రస్తుతం టాటాగ్రూపు ఎయిర్ ఇండియాతో పాటు దానికి చెందిన రెండు అనుబంధ సంస్థలను కూడా టేకోవర్ చేసుకుంది. ఇక టేకోవర్ విషయానికి వస్తే ఎయిర్ ఇండియా 18,000 కోట్లతో అత్యధిక బిడ్ దాఖలు చేసింది. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు చెందిన రూ.15,300 కోట్లకు బాధ్యత తీసుకుంది. దీంతో గత రెండు సంవత్సరాల నుంచి ఎయిర్ ఇండియాను వదించుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ఫలించింది.
టాటాసన్స్ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పేరుతో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకుంది. అక్టోబర్లోఈ బిడ్‌ను దక్కించుకుంది. ఎయిర్ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాలు దక్కించుకోగా.. ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్ పోర్టు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐఎస్లటీఎస్)లో 50 శాతం వాటా దక్కించుకుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) టాలెస్ టేకోవర్‌ను సోమవారం నాడు ఆమోదించింది.
సీసీఐ ఆమోదం ఎందుకు ?
ఇక సీసీఐ ఆమోదం ఎందుకు అనే విషయానికి వస్తే ఓ పరిమితి వరకు బిడ్లకు సీసీఐ అనుమతి అవసరం లేదు. ఓ పరిమితి దాటిన తర్వాత తప్పకుండా అనుమతి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే బిడ్లలో పాల్గొనే కంపెనీల మధ్య పోటీ సమానంగా లేదా (ఫెయిర్)గా ఉండాలనేది దీని ప్రధాన ఉద్దేశం.
ఏఐఎస్ఏటీఎస్ విషయానికి వస్తే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, మంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాల్లో అందిస్తోంది. అలాగే బెంగళూరు విమానాశ్రయంలో సరకు రవాణా సేవలను కూడా అందస్తోంది.
ప్రభుత్వరంగానికి చెందిన ఎయిర్ ఇండియా నెలకు రూ.600 కోట్లపైనే నష్టాలను చవిచూస్తోంది. కాగా పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిర్యాదిత్య సింధియా ఈ నెల 14న మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా లావాదేవీ వల్ల ప్రభుత్వంతో పాటు కొనుగోలు చేసిన టాటాలకు కూడా లాభదాయకమేనని పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ విక్రయించడం వల్ల ప్రజలు సొమ్ము రూపంలో కట్టే డబ్బును ఇక నుంచి సామాజిక కార్యక్రమాలకు వినియోగించకోవచ్చన్నారు.
వాటాదారుల మధ్య గత నెల నవంబర్‌లో ఒప్పందాలు జరిగాయి. ఇక ఎయిర్ ఇండియా కంపెనీ బదిలీ కార్యక్రమం పూర్తయినట్లేనని సింధియా అన్నారు. కొత్త సంవత్సరం నుంచి దీని యజమాని టాటా గ్రూపు అని సింధియా పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఏడాది అక్టోబర్ 20న మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను విక్రయించడం వల్ల పౌర విమానయాన రంగంలో పెను మార్పులు చూస్తామన్నారు. ఈ రంగానికి కొత్త ఊపు వస్తుందని చెప్పారు .
ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ఎయిర్ ఇండియా మొత్తం అప్పులు రూ.61,562 కోట్లకు ఎగబాకింది. వాటిలో టాలెస్ రూ.15,300 కోట్లు తన ఖాతాలోకి బదిలీ చేసుకుంటుంది. మిగిలిన రూ.46,262 కోట్లు ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేస్తుంది. ఇక ఏఐఏహెచ్ఎల్ విషయానికి వస్తే 2019లో ప్రభుత్వం కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్) (ఏఐఏహెచ్ఎల్)ను ఏర్పాటు చేసింది. ఎయిర్ ఇండియాకు గ్రూపునకు చెందిన అప్పులు.. కీలకం కాని ఆస్తులు) ఈ కంపెనీ నిర్వహిస్తుంది.