ఆదాయ పరంగా 2020 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో అతిపెద్ద ప్యూర్–ప్లే వాల్యూ ఈ–కామర్స్ వేదిక స్నాప్‌డీల్ లిమిటెడ్ (స్నాప్‌డీల్) ఐపీఓ కోసం తమ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దరఖాస్తు చేసింది. ఈ తాజా ఇష్యూ రూ.1250 కోట్ల వరకూ ఉంటుంది. దీనిలో భాగంగా 30,769,600 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.
ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన రూ.1250 కోట్లను సంస్థ వృద్ధి కార్యక్రమాల కోసం –రూ.900 కోట్లు, సాధారణ కార్పోరేట్ కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు.
తమ డీఆర్‌హెచ్‌పీ లో భాగంగా స్నాప్‌డీల్ వెల్లడించిన దాని ప్రకారం 2020 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో అతిపెద్ద ప్యూర్ ప్లే వాల్యూ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌డీల్. గుగూల్ ప్లే స్టోర్‌పై 200మిలియన్లకు పైగాయాప్ ఇన్‌స్టాలేషన్స్ జరిగాయి. ఆగస్టు 31,2021 నాటికి దేశంలో అగ్రశ్రేణి నాలుగు లైఫ్‌స్టైల్ షాపింగ్ కేంద్రాలలో ఒకటిగా ఇది నిలిచింది.
కూపన్ బుక్లెట్ వ్యాపారంగా తమ కార్యకలాపాలను 2007లో స్నాప్‌డీల్ ప్రారంభించింది. ఆ తరువాత 2010లో ఆన్లైన్ డీల్స్ ప్లాట్‌ఫామ్‌గా, అనంతరం 2012లో ఆన్లైన్ ఈ–కామర్స్ మార్కెట్ ప్రాంగణంగా మారింది.
రెడ్‌సీర్ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, 2021, 2026 ఆర్థిక సంవత్సరాల నడుమ 15% వృద్ధితో దూసుకుపోయే వాల్యూ లైఫ్‌స్టైల్ రిటైల్ మార్కెట్ 88 బిలియన్ డాలర్ల నుంచి 175 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ మార్కెట్ అవసరాలను స్నాప్‌డీల్ తీర్చనుంది.